ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు
(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.










