అమరజీవి మా కాంతమ్మత్త !
అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు. ఇంకో మాట కూడా అనేశారు "ఎరికిలోలల్లో ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే! ”