మాట్లాడు!!
నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ