ఊహ చేయడమే హెచ్చరిక
నీ ఊపిరి విశ్వమంతా పాకిపోయింది విశ్వాన్నెలా భస్మం చేస్తాడు నీ ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది సముద్రాన్నెలా బందీ చేస్తాడు నీ ఆలోచనకు కాళ్లెలా వుంటాయి గాలికీ జీవనదికీ కాళ్లుంటాయా మండే సూర్యుడున్నాక వెలిగే చంద్రుడున్నాక నీ శ్వాసకు అంతమెలా వుంటుంది పీక పిసుకుతాడు కనురెప్పల్ని పీక సాగుతాడు ఊహకెలా ఉరితాడు వేస్తాడు వరిగింజల్లో పిడికిళ్లున్నాయని రాలుతున్న వరిపొట్టులోంచి పిట్టలు పైకెగురుతున్నాయని సృజన చేసిన మెదళ్ళను కూల్చడానికి ఏ బుల్డోజరూ సరిపోదు నీ చేతులు విల్లంబులు పట్టలేదు నీ వాక్యాలు బాణాలయ్యాయి నీ చేతులు తుపాకులు పట్టలేదు చావును నిరాకరించిన నీ దైర్యం తూటాగా మారింది నీ తలనరాలు










