వర్ణం నుండి కులం దాకా – ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ
భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను 'చాతుర్వర్ణ' నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు. మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం,