భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం
ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి. విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త బస్తర్ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్ కూడా ఇవాళ