చలపతి, విజయవర్ధనరావుల విడుదలకై పోరాడుదాం
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలకూ ప్రజాసంఘాలకూ జీవిత ఖైదీల విడుదల సాధన సమితి తరపున ఆహ్వానం. మిత్రులారా చిలకలూరి పేట బస్సు దహనం కేసు మనలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవత్సరంలో జరిగిన ఆ దుర్ఘటన కు బాధ్యులైన చలపతిరావు విజయవర్ధనరావులు సంఘటన జరిగిన రెండు మూడు రోజులకే అరెస్ట్ అయ్యారు.వారు ఆ నేరం బస్సులో ఉన్న వారిని చంపాలనే ఉద్దేశ్యంతో చేయలేదు. కేవలం బస్సులో ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్రమే చేశారు.అయితే అనుకోని విధంగా బస్సు దహనం జరిగిపోయింది. చలపతి విజయవర్ధనరావులు అరెస్ట్ అయిపోయారు.కోర్టు వారికి ఉరిశిక్ష