సమీక్షలు

మెరుపులాంటి, భాస్వరంలాంటి కవిత్వం 

మట్టి గాయపడినా , చెట్టు గాయపడినా , మనిషి గాయపడినా  కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షరాలతో యుద్దాన్ని ప్రకటిస్తాడ.  సానుభూతి కాదు. సంఘీభావం ముఖ్యమనే మాటపై నిలబడుతాడు.  నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రోజుల్లో ఉదయ్ కవిత్వం ఈ ఫాసిస్టు  దాడికి ప్రతిదాడిలాంటిది.  గాయానికి మందులాంటిది. ఈ మనుషుల కోసం, సమానత కోసం, బువ్వ కోసం, భుక్తి కోసం తనువు రాలే వరకు పోరాడుతున్న మిత్రులను గుండెకు హత్తుకుంటాడు.  పోరాట గీతాల్ని ఆలపిస్తాడు. అమరత్వాన్ని కీర్తిస్తాడు,. అమరుల బాటల్లో నడవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాడు. మనల్ని సమాయత్తం చేస్తాడు. ఈ నేల చెప్పే గాథలను, కన్నీళ్లను మనలో ఒంపుకుందాం. ఈ
సమీక్షలు

మనకు తెలియని శికారిలు

కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు "శికారీలు". మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
వ్యాసాలు

అభివృద్ధి విధ్వంసాల రాజకీయార్థిక విశ్లేషణ

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత
వ్యాసాలు

ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల  అవిశ్రాంత కృషి

మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్
పరిచయం

కొత్త తరానికి లెనిన్ పరిచయం

 “ఈనాటి జీవితాన్ని సామ్రాజ్యవాద సంస్కృతి స్పృశించని పార్శ్వము, కోణామూ లేదు. అది మన అలవాట్లనూ, ఆచారాలనూ, ప్రవర్తననూ, సంస్కారాలనూ, కుటుంబాలను, సామాజిక సంబంధాలనూ, మన కోర్కెలను, ఆశలను, రాజ్యాన్ని, రాజకీయాలను వ్యక్తులనూ, సంస్థలనూ, కలల్ని, కళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూవుంది. క్షీణ విలువలకు ముఖ్య ఆధారంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం నిలిచివున్నది.”     - లెనిన్ Lenin for children పేరుతో సోవియట్ రష్యా బొమ్మల పుస్తకం ప్రచురించింది. దీన్ని అమెరికన్ పిల్లల కోసం రూత్ షా ఇంగ్లీషు లోకి అనువదించగా 1934 లో ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, న్యూయార్క్ వాళ్ళు ‘our lenin. For boys and girls’ అంటే ‘మన
వ్యాసాలు

ప్రొ. సాయిబాబ కేసులో ఎల్గార్ పరిషత్ కేసు మూలాలు

ఎల్గార్ పరిషత్  కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి  సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్‌లో   పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో   మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్‌చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020
వ్యాసాలు

3,588 రోజుల నిర్బంధం

ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది. మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది.
వ్యాసాలు

“నేను జైలు నుండి బయటపడటం యాదృచ్ఛికమే”

'నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ' ' అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం
పాట

ఢిల్లీ చలో….

పదరా..పదరా పదపదపదమని..కదం దొక్కరా " ఢిల్లీ కోటకు వొణుకు పుట్టగా ప్రపంచమంతా నివ్వెరపోగా " "పదరా" రైతుబిడ్డ లా నిలువరించెడూ బారికేడ్లనూ బద్దలు గొట్టగ " పొలాలల్లో శ్రమించే చేతులు నియంత మీదకు పిడికిలెత్తినవి " "పదరా" సంకెళ్ళేసిన రోడ్ల మీదకు సర్రున దూసుకు..పదండి,పదండి " మన కడుపులకూ సంకెళ్ళేసిన దోపిడి దొంగలు పని బట్టంగ " " పదరా " గర్జించరా..గర్జించరా. నియంత మీదకు నిప్పులు జెరగర " పొలాల నమ్మే బందిపోట్లకూ పొట్టలు గొట్టే విద్య దెలువదా" " పదరా" పరుగెత్తరా.. పరుగెత్తరా కోటల మీదా గురి వెట్టరా " మన బత్కుల చెరను బట్టినా