పసి వయసుల ముసి నవ్వుల బాల్యమంటే కోపమా. .
పచ్చనడవి రక్తమెందని అడుగుతుంటే నేరమా...
అడవి జీవరాసులతో అందమైన జీవనం..."2"
వెదురు తేనె తునికాకు వేరు కునేవాళ్ళము"2"
కొండబండలెన్లో దాటికొనసాగేను దారిరా..
వేటగాడే కాకిలై మాటువేసి కాల్చేరా......
" పసి వయసుల ముసి నవ్వుల"
అమ్మ పాల కమ్మదనం ఎరుగనట్టీ వాళ్ళము..."2"
నాన్న చేతి స్పర్శ కూడా తాకనట్టి వాళ్ళము.."2".
ఆరు నెలలు నిండలేని పసి పాప మంగ్లి రా..
అడుగులేసే నేలనేవరు ఆక్రమిచ చూసేరా రా....
" పసి వయసుల ముసి నవ్వుల"
డ్రోను బాంబుదాడులతో అంతర్యుద్ధరంగమా..."2"
తల్లి పిల్ల అక్కచెల్లి అశ్లీత చిత్రామా..."2"
గూడాలను కూల్చి గూండా రాజ్యమేచేసేరా...
కూలితల్లి గూడుచెదిరే పక్షిలాగా మార్చేరా...
" పసి వయసుల ముసి నవ్వుల"
బస్తర్లో బందుకుల కెదురు నిలిచే ధైర్యము.."2".
భూమి భుక్తి విముక్తి కొరకు సాగిన ప్రయాణము..."2"
నాట్య మాడే నెమలితల్లి పురివిప్పెనింక చూడరా..
పాలకేడ్చే పాప కంచు కంఠలుగా మ్రోగేరా..
Related