మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి.

అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ దేశంలోని సహజవనరులను యదేచ్ఛగా బహుళ జాతి కంపెనీలకు దోచి పెట్టడానికి అడవి ప్రాంతాలలోని ఆదివాసీలను అక్కడ నుండి గెంటి వేయడానికి, దానికి అడ్డంకిగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా తూడ్చి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ జనవరి 01, 2024 నుండి మొదలుపెట్టింది. దాని కొనసాగిస్తూ ఇప్పటికే 350 మంది వరకు ఆదివాసీలు, ఉద్యమకారులు అత్యంత దారుణంగా ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య గావించబడ్డారు. అందులో భాగంగానే సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమీత్‌ షా 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని తుడ్చి పెట్టేస్తామని పలుసార్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. అంటే మావోయిస్టులందరినీ భౌతికంగా అంతమొందిస్తామని చెబుతున్నాడు. సదరు చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్టం విరుద్ధం. మావోయిస్టులు చట్టం దృష్టిలో నేరస్థులయితే, వారితో చట్ట బద్ధంగానే వ్యవహరించాలి గాని, లక్షలాది సైన్యాన్ని దింపి, డ్రోలులతో నిగా పెట్టి, ఒకేసారి 15,20 వేల బలగాలతో చుట్టుముట్టి, కాల్చిచంపాడని హక్కుల సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మావోయిస్టు ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా గాకుండా, సామాజిక, ఆర్థిక సమస్యగా చూసి రాజకీయంగా పరిష్కరించాలి తప్ప దానికి మిలిటరి పరిష్కారాన్ని ఎన్నుకోవడం వెనక, బహుళ జాతి కంపెనీల ఒత్తిడి ఉన్నదనేది వాస్తవం. ఈ బహుళ జాతి కంపెనీలకు చెందిన 104 ఒప్పందాల (ఎంఓయు) ద్వారా అపార సహజ సంపదలని వారికి దోచిపెట్టడానికే ఆపరేషన్‌ కగార్‌ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 350 మంది ఎన్‌కౌంటర్‌ పేర కాల్చిచంపబడ్డారు. అందులో3వ భాగం అందరూ అమాయక ఆదివాసీలు వున్నారనేది ఒక నగ్న సత్యం. కొన్ని ఎన్‌కౌంటర్‌ ఘటనలో మాత్రమే వాస్తవాలని సేకరించగలిగాం. వాస్తవాల్ని ఈ దేశ ప్రజలకు తెలియకుండా  ఉండేందుకే హక్కుల సంఘాలని నిజనిర్ధారణ చేయకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు హక్కుల సంఘాల కార్యాచరణను అడ్డుకోవడం కోసం హక్కుల సంఘాల నాయకుల ఇండ్లపై నిరంతరం ఎన్‌ఐఏతో చేపిస్తున్నారు.

ఇదిలా ఉండగా దేశంలో ముస్లిం మైనారిటీలు మునుపెన్నడూ లేనంతగా పూర్తి అభద్రతలోకి నెట్టబడ్డారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. వారిపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మరొకవైపు మణిపూర్‌లో రెండు తెగల మధ్య రాచుకున్న అగ్గిని చల్లార్చడానికి వారి మధ్య ఏర్పడ్డ అపోహలను తొలగించి, సామరస్యాన్ని కాపాడానికి కేంద్రం ఎలాంటి చర్య చేపట్టలేదు. దేశ ప్రధాన మంత్రే ఇప్పటివరకు దానిపై నోరెత్తలేదు. అలాగే పంజాబ్‌, ఉత్తరభారత దేశంలోని రైతుల ఆందోళనలపై, పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని డిమాండ్‌పై కూడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రపంజ శ్రామికులు శతాబ్దాల పోరాటం ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను మార్చడం కార్మికులను, ఉద్యోగులను తిరిగి బానిసత్వంలోకి నెట్టడమేనని మేం బలంగా అభిప్రాయబడుతున్నాం. ఆర్టికల్‌ 370 ని రద్దు చేయడం ద్వారా, కాశ్మీరి ప్రజల హక్కులను కేంద్రం కాలరాయడమే కాకుండా చివరకు కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకోవడం కాశ్మీరిల ఉనికినే ప్రమాదంలోకి నెట్టింది.

Date : 26-01-2025,

Hyderabad, Telangana.

(Asish Gupta) (Tapas Chakraborty) (Kranthi Chaitanya) – Coordinators, CDRO.

Preethpal Singh AFDR Panjab

Prof. Gunti Ravi (CLC TG) Prof. Laxman Gaddam (CLC

Prof. Laxman Gaddam (CLC TG)TG)

Narayanarao (CLC TG)

Moutly, APDR West Bengal

Babudha, APDR West Bengal

Sriman Narayana, CLC Andrapradesh

Leave a Reply