ప్రభుత్వం తప్పు చేస్తోంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఏదైనా ఘటన జరిగింది.. ఈ సమాచారాన్నంతటినీ మీకు చేర్చేదాన్ని మీడియా అని అంటారు. ఈ మీడియానే మీ మాటలను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ “వార్త”ల వాళ్ళ “వార్త” ను ఇవాళ మీకు అందించాలనుకుంటున్నాను.
ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీరు భావించే మీడియా, మన దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దేశం మొత్తం మీద ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటి, సోషల్ మీడియా మాధ్యమంలో మొత్తం మాధ్యమాలతో పరిస్థితి ఏమిటి అని ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీడియా కార్పొరేట్ గుప్పిట్లో వుంది.
నేను ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టును. ఈ రోజు చత్తీస్‌గఢ్‌లో ఎక్కడ చూసినా రక్తం ప్రవహిస్తోంది; హస్‌దేవ్‌లో చెట్లను నరికేస్తున్నారు; బస్తర్‌లో ‘మావోయిస్టుల’ పేరుతో ఆదివాసీలను చంపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జర్నలిస్టులు మీకు వాస్తవాన్ని తెలియచేయాలి, ఇక్కడ పెద్ద పెద్ద జర్నలిస్టులు, వారి సమూహాలు, ఎడిటర్లు, రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు – మీరు జర్నలిస్టులుగా భావించే వారు, మీడియా నాల్గవ స్థంభంగా భావించేవారు, – వాళ్ళు అదానీ పిలుపుతో, ఆదానీ చేసిన ఏర్పాట్లతో గుజరాత్ వ్యాహాలికి వెళ్తారు.
సూరజ్ కుండ్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు ఆఫీసర్ హత్య జరుగుతుంది; బలరాంపూర్‌లో పోలీసుల తప్పిదం వల్ల ఒక వ్యక్తి హత్య లేదా ఆత్మహత్య జరుగుతుంది. స్పష్టత వుండదు.
అయితే దీన్ని వ్యతిరేకించడానికి మీరు నమ్మే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పాత్ర ఏమిటో, అది ఏమి చేస్తోందో కూడా చెప్పగలం. ఆదానీ అంబానీ లాంటి పెద్ద ప్రారిశ్రామికవేత్తల ఏర్పాట్లతో జర్నలిస్టు మిత్రులు మజా చేయడానికి వెళ్తున్నారు. వారికి సేవలు ఫైవ్‌స్టార్ హోటళ్లలోజరుగుతున్నాయి. .. జర్నలిస్టులను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి.. రాష్ట్రంలో జర్నలిజం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు..
బస్తర్‌లో వైమానిక దాడులు జరుగుతున్నాయి, అయితే దేశ పౌరులలో దేశ పౌరుల మధ్య, దేశ ప్రజల పోరాటం పైన సైన్యం దాడులు జరగవు; సైన్యానికి ఏ పాత్రా వుండకూడదని తెలుసుకోవాలి. దీపక్ బర్సే కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, “సైన్యం బస్తర్‌లోకి ప్రవేశించింది, అది పొరపాటు” అని అంగీకరించాడు. ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యత అవుతుంది .. బస్తర్‌లోజరిగే ఎన్‌కౌంటర్‌లకు బాధ్యత వహించాలి. ఎన్‌కౌంటర్‌ల పేరుతో వైమానిక దాడులు జరుగుతున్నాయి… సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు… ఎన్‌కౌంటర్‌లలో నిర్దోషులను చంపేస్తున్నారు… కొన్ని నిజమైన ఎన్‌కౌంటర్‌లు కూడా జరుగుతున్నాయి.. కానీ ప్రజలు హత్యలకు గురవుతున్నారు..
సర్గుజాలో అడవి మొత్తాన్ని నరికేస్తున్నారు.., కాంగ్రెస్ కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం లేదు.
ఇదే కాంగ్రెస్ బ్రిటీష్ హయాంలో పుట్టింది. జైల్లో శిక్షలు అనుభవించింది. బలిదానాలు చేసింది; అప్పుడు కాంగ్రెస్ పుట్టింది. కేవలం ప్రకటనలు చేసి తన నిరసనను వ్యక్తం చేస్తోంది..
కాంగ్రెస్‌ను అడగడానికి ఈ రోజు మన జర్నలిస్టు మిత్రులు లేరు. గత ఐదేళ్ల మీ ప్రభుత్వంలో లాకప్‌లో పంకజ్ హత్యకు గురయ్యాడు, అతని అది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియలేదు. ఇంతవరకు దోషులను పట్టుకోలేక పోయారు.
ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇక్కడ మీడియా జర్నలిస్టులను కొనుగోలు చేసే ప్రయత్నాలను చేస్తున్నది.
బస్తర్ లేదా సుర్గుజా వంటి ప్రదేశాలలో నిజాయితీగా జర్నలిజం చేయడానికి ప్రయత్నించే జర్నలిస్టులను బస్తర్ అడవుల్లోకి వెళ్లనివ్వడం లేదు. మీడియా మిమ్మల్ని చేరుకోలేక పోతోంది మిత్రులారా!
ఛత్తీస్‌గఢ్‌లో అనేక చోట్ల రక్తం ప్రవహిస్తోంది, మావోయిస్టులు చనిపోతున్నారు, మావోయిస్టుల సాకుతో ఆదివాసులను హత్య చేస్తున్నారు. సర్గుజాలో చెట్లను నరికేస్తున్నారు. నరికేస్తున్న చెట్లు లక్షల్లో ఉన్నాయి. రాబోయే తరాల్ని బతికించడం కోసం.. వారికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతోంది. వారిని కూడా చంపేస్తున్నారు. వారి రక్తం కూడా పారుతోంది.
ఇలాంటి స్థితిలో ఒకవైపు అధికారంలో వున్న వారు సుఖభోగాల్లో మునిగివున్నారు… ప్రతిపక్షం లావాదేవీల్లో మునిగి వుంది.
వీధుల్లో పోరాడే వారు కనపడడం లేదు, జైళ్లలో వున్నవారు కనపడడం లేదు, లాఠీ దెబ్బలు తినేవారు కనిపించడం లేదు. ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే పని చేసేది మీడియా. దాన్ని మీరు మీడియా అంటారు. మీరే అంటారు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం అని… మీడియా ప్రజాస్వామికం కానంతవరకు దేశంలో ప్రజాస్వామ్యం రాదు.
ఈరోజు నేను మీడియా గురించి మీ ముందుకు తెస్తున్నాను,. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అకృత్యాలు, రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు అన్నీ, ప్రభుత్వం ఏదైనా, మీ ముందుకు తీసుకురావడం మీడియా బాధ్యత అవుతుంది.
పెద్ద మీడియా మిత్రులు మీకు చూపించే సమాచారం; మీరు ఎక్కువగా చదివే సమాచారం చానెళ్ల యజమానులు, వాటి జర్నలిస్టులు, ఎడిటర్లు, వార్తా పత్రికల సంపాదకులు, వారి జర్నలిస్టులు పారిశ్రామిక వేత్తల ఆహ్వానంపై బస్సుల్లో కూచుని, విమానాల్లో కూచుని దేశమంతా తిరుగుతారు. వాళ్ళకి అయిదు నక్షత్రాల హోటళ్లలో వసతి కల్పిస్తారు. పెద్ద పెద్ద బహుమానాలు యిస్తారు. అందుకనే మీ దగ్గరకు వాస్తవ ఘటనలు రావడం లేదు.
ఈ వాస్తవ ఘటనలను మీ దగ్గరకు తీసుకొచ్చేది చిన్న చిన్న జర్నలిస్టులు… వారికి సలాం చేస్తాను…
మీరు ఉద్యమంలోకి వచ్చాక వార్తలు చూపించడమే మీడియా పని కానీ ఈరోజు మీడియా అవసరం ఉన్న తరుణంలో మేం చేయగలం అనే వార్తతో మీ ముందుకు వచ్చాను. రాష్ట్రంలోని వార్తలను మీకు అందించడానికి ఎవరికి అధికారం ఉంది? మీరు ఎవరిని ఎక్కువ పరిమాణంలో చూస్తారో, చదువుతారో వారికే వుంటుంది.
ఇది సాధించిన జర్నలిస్టులకు నేను నమస్కరిస్తున్నాను, వారు చిన్న ప్రపంచాలు, చిన్న పరిచయాలు ఉన్న చిన్న జర్నలిస్టులు కానీ వారు ధైర్యంగా బస్తర్‌కు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సర్గుజాలో కూడా పోరాడాలని ప్రయత్నిస్తారు; ఎందుకంటే మీకు సరియైన సమాచారం అందించాలి అని.. సర్గుజాలోని ఏ ప్రాంతంలో చెట్లను నరికివేయాలని ఉద్యమం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు, వారి రక్తాన్ని ప్రవహింపజేస్తున్నారు.. ఆ సమాచారం మీదాకా తీసుకు రాలేకపోతున్నారు.
బస్తర్‌లో వైమానిక దాడులు జరుగుతున్నాయి, హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేస్తున్నారు; దేశాభివృద్ధికి శత్రువులు అని చెప్పి మావోయిస్టులను చంపడానికి సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు, ఆ సాకుతో ఆదివాసులను హింసిస్తున్నారు; చంపుతున్నారు. ఇలాంటి సమస్యలపై ప్రతిపక్షాలు వీధుల్లో కనిపించవు; విజ్ఞప్తులు జారీ చేస్తాయి. నిందించాల్సిన ఘటన అని ఖండిస్తాయి.
కాంగ్రెస్ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. దాని నాయకులు ప్రాణాలిచ్చారు; జైలుకు వెళ్లారు; ఈ రోజు ఆ కాంగ్రెస్, ప్రస్తుతం వున్న ప్రభుత్వం భాజపా కూడా సమస్యలపై కేవలం చర్చలు జరుపుతున్నాయి..
ఈ విషయాలన్నీ మీ దగ్గరకు చేర్చాల్సిన మీడియా తరఫున సిగ్గు పడుతున్నాను. మా జర్నలిస్టు మిత్రులు చాలా మంది మీ వరకు సమాచారాన్ని తీసుకువెళ్లడం లేదు. ఇలాంటి స్థితి దేశమంతటా వుంది.
మీరు భావించేట్లుగా ప్రస్తుతం మీడియా నాలుగవ స్తంభంగా లేదు. కేవలం ఆదానీ కంపెనీల కీలుబొమ్మగా తయారైంది.
ఇలాంటి స్థితిలో మీరు జాగ్రత్తగా వుండాలి. వాస్తవాల్ని తెలియచేసే పత్రికలు, చిన్న చిన్న మీడియాకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిని కూడా నాశనం చేసే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాంటి నిజాయితీ గల జర్నలిస్టులకు మద్దతుగా నిలబడాలి.
నిజమైన, వాస్తవమైన వార్తలను చూడడానికి భూమ్‌కాల్ సమాచారాన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.
(భూమ్‌కాల్ సమాచార్ వీడియో సంక్షిప్తానువాదం)