జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్ కుమార్ రాయ్ ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా, జార్ఖండ్ అడ్వకేట్ జనరల్, జంషెడ్‌పూర్ పౌరుడైన జవహర్‌లాల్ శర్మ 2018లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ నంబర్. 549 కింద జారీ చేసిన ఉత్తర్వును ఉదహరించి, జంషెడ్‌పూర్ పారిశ్రామిక పట్టణంగా మార్చాలనే జార్ఖండ్ ప్రభుత్వం ఆలోచనను సుప్రీంకోర్టు అంగీకరించిందని చెప్పారు.!
జవహర్ లాల్ శర్మ 2018 రిట్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని; జంషెడ్‌పూర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం 1988 లో దాఖలు చేసిన రిట్ నంబర్ 154కి కొనసాగింపు అని, ఆ సమయంలో జార్ఖండ్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం జంషెడ్‌పూర్‌లో పారిశ్రామిక పట్టణం ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది అని పిటిషనర్ న్యాయవాది అఖిలేష్ శ్రీవాస్తవ,
ఆ సమయంలో పారిశ్రామిక పట్టణ నోటిఫికేషన్ లేదు లేదా దాని ఫారమ్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో ఎటువంటి ప్రణాళికను సమర్పించలేదు, కాబట్టి 2018లో సుప్రీంకోర్టులో పారిశ్రామిక పట్టణం సమస్య ఉనికిలో లేనే లేదు.
ఏమైనప్పటికీ జంషెడ్‌పూర్ పౌరులు జవహర్ శర్మ రిట్‌లో లేదా జార్ఖండ్ ప్రభుత్వం-టాటాల మధ్య జరిగిన ఎటువంటి ప్రైవేట్ ఒప్పందంలో భాగం కారని, అందువల్ల జంషెడ్‌పూర్ పౌరులకు పారిశ్రామిక పట్టణం చట్టబద్ధతను సవాలు చేసే హక్కు ఉందని ఆయన అన్నారు.
జంషెడ్‌పూర్‌లో ఆంగ్లేయులు ఆదివాసీల భూమిని స్వాధీనం చేసుకుని టాటాకు ఇచ్చిన 15725 ఎకరాల ప్రభుత్వ గ్రాంట్‌ను రాజ్యాంగ విరుద్ధమైన, అక్రమ పద్ధతిలో లీజుగా మార్చడం; టాటా 12708 ఎకరాల భూమిని టాటా సబ్ లీజుకు యివ్వడం; భూ రెవెన్యూ కలెక్టర్ అక్రమంగా గత 100 సంవత్సరాలుగా చట్టవ్యతిరేకంగా కోట్లాది రూపాయల భూ ఆదాయాన్ని సేకరించడాన్ని కూడా రిట్ వ్యతిరేకించింది.
“లీజు”గా చెబుతున్నదానిని చట్టవిరుద్ధమని ప్రకటించాలని; టాటా అక్రమంగా సేకరించిన భూ ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఏ ఇండస్ట్రియల్ టౌన్ లేదా మున్సిపల్ కార్పొరేషన్‌ను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు గుర్తించినట్లయితే, జంషెడ్‌పూర్‌లోని 15725 ఎకరాల భూమి దాని నియంత్రణలో ఉంటుంది. ఇది టాటా నియంత్రణలో ఉండదు. అయితే దీనిపై విచారణ జరిపిన తర్వాత ఈ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రస్తుతం, 2018లో జవహర్‌లాల్ శర్మ రిట్‌లో సుప్రీం కోర్ట్ ఉత్తర్వు జారీ అయింది కాబట్టి , హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ రిట్ గురించి హైకోర్టుకు తెలియజేయాలి అని పిటిషనర్ తరపు న్యాయవాది అఖిలేష్ శ్రీవాస్తవ వివరించారు.
ఆ తరువాత, న్యాయమూర్తి ఉత్తర్వులను జారీ చేస్తూ, జవహర్‌లాల్ శర్మ పెండింగ్ రిట్‌ను 20.09.2024న సుప్రీంకోర్టులో విచారించే అవకాశం ఉందని, అందుకే ఈ కోర్టు, జవహర్‌లాల్ శర్మ రిట్‌ను సుప్రీంకోర్టు అమలు చేసిన తర్వాత , సౌరవ్ విష్ణు, జంషెడ్‌పూర్‌లోని డజన్ల కొద్దీ ఇతర పౌరులు దాఖలు చేసిన ఈ రిట్‌ను వింటుంది!
23.12.2023 తేదీ నోటిఫికేషన్ ద్వారా, జంషెడ్‌పూర్ పౌరులకు రాజ్యాంగం కల్పించిన స్వపరిపాలన హక్కును రద్దు చేసి, టాటా కంపెనీ వలస పాలనను కొనసాగించాలనే దురుద్దేశంతో జార్ఖండ్ ప్రభుత్వం మొత్తం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగా సాక్చిలో వున్నతన సూపర్‌వైజర్స్ కాలనీ, సాక్చి ప్రాంత చుట్టుపట్ల ఉన్న వందలాది సంస్థల భవనాలను అక్రమంగా కూల్చివేసి 500 ఎకరాలకు పైగా భూమిని అక్రమంగా ఆక్రమించి తమ ప్లాంట్‌ను అక్రమంగా విస్తరించింది.
వంద సంవత్సరాల వలస పాలనలో టాటా ఆదివాసీల 12708 ఎకరాల భూమిని ఆదివాసేతరులకు సబ్ లీజుకు ఇచ్చింది. ఆ భూములపైన 100 సంవత్సరాలు నుంచి రెవెన్యూ కలెక్టర్ లాగా అక్రమంగా భూ ఆదాయాన్ని వసూలు చేస్తోంది. ఈ 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న టాటా సుదీర్ఘ వలస పాలనను కొనసాగించడానికి జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక నగరంగా మార్చాలని నోటీసు జారీ చేసింది. ఈ నోటీసును జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం కుదుర్చుకున్న 20.08.2005 నాటి లీజు ఒప్పందం భారీ మోసమని కూడా ఆ పిఐఎల్ పేర్కొంది. ఈ భూమిపై మునిసిపల్ కార్పొరేషన్‌కు హక్కు ఉంది. మున్సిపల్ కార్పొరేషన్‌కు మాత్రమే భూ ఆదాయాన్ని సేకరించే హక్కు ఉంది. కానీ టాటా వసూలు చేస్తోంది.
సెప్టెంబర్ 14, 2024
(జన్ చౌక్ నుండి నివేదిక)