(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర – పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం – వసంత మేఘం టీం )
వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది.
నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది.
ఈ మధ్యలో ఛత్తీస్‌ఘడ్‌లో ప్రభుత్వం మారింది. ఛత్తీస్‌ఘడ్‌లో మా ప్రభుత్వం ఏర్పాటైతే మావోయిజాన్ని పూర్తిగా సమాప్తం చేస్తాం అని కేంద్ర గృహమంత్రి అన్నాడు. 2024లో 2017 మంది మావోయిస్టులను చంపేశారు. 2025లో ఇప్పటి వరకు 136 మంది మావోయిస్టులను చంపారు. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం “శాంతి కోసం మాట్లాడవచ్చు. మొదట మావోయిస్టులు శాంతి కోరుకుంటే ఎదురుగా వచ్చి లేదా మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు” అని అన్నది .. కానీ ఇరువైపుల నుంచి విషయం ముందుకు పోలేదు.. ఎన్‌కౌంటర్‌లు జరుగుతూనే ఉన్నాయి.. ఆ తరువాత మెల్ల మెల్లగా మావోయిస్టుల వైపు నుంచి ముందుగా శాంతి చర్చల గురించి, అభయ్ నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ తరువాత రెండు లేఖలు వచ్చాయి. ఆ రెండు లేఖలు రాసిన వ్యక్తి ఇప్పుడు నా ముందు కూర్చున్నారు. చాలా కష్టం మీద కలవగలిగాను. దట్టమైన అడవిలో ఒకచోట, ఒక గ్రామంలో కూచోగలిగాం. శాంతి చర్చల గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి అని నాకు అనిపించింది. చాలా మంది అన్నారు శాంతి చర్చల గురించి మావోయిస్టులతో వారి అభిప్రాయం తెలుసుకోవాలని.. ఇప్పటికీ ఆ అవకాశం వచ్చింది..
కామ్రేడ్ రూపేశ్ నా ముందర కూచుని ఉన్నారు. మీరే మీ పరిచయం చెప్పండి..
రూపేశ్: కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ ఇన్‌చార్జీని (బాధ్యుడిని)
ముందుగా ఆపరేషన్ కగార్‌లో మా కేంద్రకమిటీ సభ్యులు చలపతి మొదలుకొని కామ్రేడ్ రేణుకలతో పాటు అమరులైన కామ్రేడ్స్ కు ప్రజలకు శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.
కొన్ని విషయాల మీద స్పష్టత నివ్వడానికి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ ద్వారా, బస్తర్ టాకీస్ ద్వారా రెండు మూడు విషయాల మీద స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. ప్రబుత్వానికి నమ్మకం పెరగడానికి కూడా పనికొస్తే మంచిది. అంటే ఇది ఉపయోగపడితే మంచిది. అందుకని మీతో మాట్లాడాలనుకున్నాను. ఈ లేఖలకు సంబంధించి నిజమైనవా, అబద్ధమైనవా అని బయట చర్చలు జరుగుతున్నాయి. వీటి మీద రాజకీయాలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా కాంగ్రెస్ ప్రతినిధి అనుకుంటా మావోయిస్టులు, బిజెపి మధ్య కుమ్మక్కు (సాఠ్ గాండ్)ఉంది అని అన్నారు. హత్యాకాండ అయిన తరువాత ఏర్పడిన పరిస్థితిలో ఆలోచిస్తున్నారు. ఆదివాసీల హత్యలు జరుగుతున్నాయి. వీటిని అపటానికి ప్రయత్నాలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు అవడం వల్ల నేటి స్థితిలో దొరికిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సమస్య పరిష్కారాన్ని చేసే దిశలో వాళ్ళు ప్రయత్నం చేయదానికి బదులు వాళ్ళు తమ రాజకీయాల కోసం పరస్పర కొట్లాటలు లేదా లెక్కలు తేల్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయడం సరి కాదు.
ఈ లేఖలను నేనే బాధ్యుడి స్థాయిలో విడుదల చేశాను. అందులో ఏ సందేహమూ లేదు. అలా సందేహించాల్సిన అవసరం లేదు. మా పార్టీనే 2024 మార్చిలో మా ఎస్‌జెడ్‌సి ప్రతినిధి వికల్ప్ చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం అని స్పష్టతతో తెలియచేసాడు. మా పార్టీ మొత్తానికి అంగీకారం ఉన్నది ఈ ప్రభుత్వంతో చర్చలు జరిపే అంశం పైన. ఈ మధ్యలోనే మా లేఖ విడుదల అయింది. నాకు తెలుగులో దొరకలేదు. ఆ తరువాత నాకు నిన్న మొన్ననే తెలిసింది. వాస్తవానికి మీడియా కోసమే విడుదల చేసేది కాదు. వేర్వేరు మానవ హక్కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులతో శాంతి చర్చల గురించి ముందుకు వెళ్లడానికి, సమస్యను పరిష్కరించడానికి ఏర్పడిన కమిటీ సమావేశం అయింది.. అక్కడ ఆ కమిటీ ఒక సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ సందర్భంలో మా సిసి ప్రతినిధి అభయ్ వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ లేఖను విడుదల చేశారు. ఆ లేఖను మీడియాలో కూడా వాళ్ళు విడుదల చేసారు. పూర్తిగా స్పష్టతగా తెలుసుకొనే పరిస్థితి కూడా లేదు. చూసిన తరువాత తెలిసింది మాదేనని. అది స్పష్టమైపోయింది. వాళ్ళు కూడా బహుశా 18వ తారీఖు అనుకుంటా హైదరాబాదులో ఒక సమావేశం అయింది. అందులో కూడా వాళ్ళు అక్కడి కమిటీలో తమ ఉపన్యాసాల్లో చెప్పారు కూడా. హరగోపాల్ సార్ ఆ లేఖ గురించి చెప్పారు. హైదరాబాదు లో జరిగిన మీటింగులో వేర్వేరు సంఘాల వారు ఉన్నారు. 18వ తారీఖు సోనీ సోరి, బేలా భాటియా కూడా మాట్లాడారు. వారి మాటల్లో కూడా వేదిక మీద నుంచే ఆ స్పష్టత నిచ్చారు. ఆ లేఖ సరియైనది. కేంద్రకమిటీ నుంచి వచ్చిన లేఖనుంచి వచ్చిన సందేహానికి కూడా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. దీపక్ భాయికి, ప్రతిపక్షాలవారికి కూడా అప్పీలు చేస్తున్నాం. ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లడానికి అవసరమైన పాత్రను వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళను స్వాగతిస్తున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి పాత్ర ఉండడం మంచిది. అధికార రాజకీయాలు వదిలి చేస్తే మంచిది. నందకుమార్ పటేల్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? ఏం పాత్ర వహించారు? మా వైపు నుంచి పొరపాటు జరిగింది. మేము అంగీకరించాం
వికాస్: నంద కుమార్ పటేల్ విషయంలో పొరపాటున జరిగిందా?
రూపేశ్: అవును
వికాస్: ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది కామ్రేడ్
రూపేశ్: అయిపోయింది. ఆ ఘటనకు కొన్ని రోజుల ముందు తూర్పు బస్తర్‌లోని నారాయణపూర్ జిల్లా ఓడ్‌నార్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ జరగడం వల్ల నంద కుమార్ పటేల్ నాయకత్వంలో టీం వచ్చింది. గ్రామంలోకి వచ్చింది. దాన్ని వ్యతిరేకించారు. అలాంటి వాతావరణం ఉండింది. మైదానంలోకి వస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరకు వచ్చి వ్యతిరేకత తెలియచేస్తున్నారు. దాన్ని ఫాలో చేయడానికి ఉండాల్సిన నాయకత్వం .. ఆ స్థాయిలో …పూర్తి పరిస్థితి ఏమిటి? ఎవరు ఎలాంటి వారు? అంచనా వేయడంలో … అంటే వారికి తెలియదు. జీరామ్ ఘాటీ ఘటన జరగడం వల్ల అతను లక్ష్యంగా ఉన్నాడు. పరివర్తన్ యాత్ర వాళ్ళను లక్ష్యం చేసుకోవడానికి ఆ అంబుష్ ఏర్పాటు చేయలేదు. మొదటి విషయం మేం అనుకోకుండా జరిగింది. అది పెద్ద విషయం అయింది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఎవరు ఏం చేయాలి? దాని పైన నిర్ణయం తీసుకోవడం.. దగ్గరలో అలాంటి నేతృత్వం లేకుండింది. అందువల్ల తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది .. పార్టీ కూడా ఒప్పుకొన్నది. మహేంద్ర కర్మ గురించి కాదు. కానీ నంద కుమార్ పటేల్, మిగిలిన వాళ్ళకు సంబంధించి మేం జరిగిన పొరపాటును ఒప్పుకున్నాం. ఆ సమయంలోనే పొరపాటును ఒప్పుకున్నాం. అలా జరిగింది. అప్పుడే మేం తప్పును ఒప్పుకున్నాం.
ఇప్పుడయితే కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షం .. మిగిలిన వాళ్ళు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ పాత్ర వహించాలో ఆ పాత్ర వహించాలి..
మీడియాని పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగించుకొన్నారు
మనిష్ కుంజామ్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని..
వీళ్ళు వినరు, అట్లా చేశారు.. ఇట్లా చేశారు… అని అన్నాడు.
ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే ఏమైనా చెప్పాలి అంటే మాతో అంతర్గతంగా (ఇంటర్నల్)చెప్పచ్చు.. మాకు చెప్పవచ్చు .. మీరు చెప్పినంత మాత్రానే మేం కోపం చేస్తామా? మేం తప్పుగా అనుకోం. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీడియా ద్వారా ఏదైనా పాత్ర నిర్వహించాలంటే ఆ పాత్ర నిర్వహించాలి.. శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లాలి…. ఒకవేళ మీరు అనుకుంటే ..
వికాస్: అతని మామగారిని కూడా హత్య చేయించారు మీరు..
రూపేశ్: నాకు ఆ విషయం అంతగా తెలియదు.. తెలుసుకుంటాను…
వికాస్: అతను నాకు చెప్పాడు.. అతను వెళ్ళి మావోయిస్టులను అడిగాడు కూడా.
అతని మామగారు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చాడు కాబట్టి ఉండాలనుకుంటున్నాడు. సరే అనుమతి దొరికింది.. ఆ తరువాత అతని మామగారి హత్య జరిగింది…
రూపేశ్: మేమైతే ఒక ఆదివాసీ సామాజిక నేతలాగా, ఒక మిత్రుడిలాగా అతణ్ణి చూస్తాం… టాటా సమయంలో కూడా అంటే లోహండిగుడా నుంచి సల్వాజుడుమ్ సమయంలో ఇపుడు కూడా బస్తరియా మామగారి హత్య విషయం తెలియదు.. అతను తెలియదు.. ఎందుకంటే అక్కడి చుట్టుపట్ల ఉన్నవారికి అంతా తెలుస్తుంది.
వికాస్: కానీ మీరు డికెఎస్‌జెడ్‌సి కదా!
రూపేశ్: ఇంత విశాలమైన జోన్‌లో నేను సబ్‌జోన్ బాధ్యుడిని
వికాస్: ఇప్పుడు మీ జోన్ కూడా పెద్దగైపోయింది
రూపేశ్: గదౌలి నుంచి పూర్తి కర్చలోకి వస్తుంది కమిటీలో అది తెలుసు. కానీ ఇలాంటివి చాలా ఉండిపోతాయి… కొన్ని తెలుస్తాయి…దీని గురించి తెలియదు..
అందరికీ నేను అప్పీలు చేసేది ఏమంటే ఆ దీపక్ భాయి కాంగ్రెసు వాళ్ళు స్టూడియోల్లో కూచుని చర్చలు చేస్తారు .. చాలా పెద్ద కాంగ్రెస్ అతను కూడా.. బిజెపి అతను కూడా ప్రతినిధి.. వెనుకంజలో ఉన్నారు… సరే హెచ్చు తగ్గుల గురించి మాకు కూడా తెలుసు.. ఒక ఉద్యమం చేస్తున్నాం.. ఒక శక్తివంతమైన రాజ్యం ఉన్నది రాజ్యం గురించి డాక్యుమెంట్‌లే చెబుతాయి. రాజ్యం బలమైనది. రాజ్యంతో చేయడం అంత సులభం కాదు… హెచ్చు తగ్గుల గురించి తెలుసు.. వీడికి చాలా పరేషాన్ (గాభరా) అవుతోంది … చాలా ఆందోళనలో ఉన్నారు వీళ్ళు.. భయపడుతున్నారు.. అది సరియైంది కాదు..
మీడియా వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, బిజెపి వాళ్ళు తమ తమ అవసరాల కోసం చేస్తారు.. అవును.. నిజంగా వెనుకంజలో ఉన్నాం… ప్రభుత్వ.. సాయుధ బలగాలు పూర్తిగా వ్యాపించాయి… అది కూడా నిజమే.. ప్రజల ముందు ఉన్నది.. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిలో వేర్వేరు ఉద్యమాల్లో విప్లవోద్యమాలలో మేము కూడా ఎదుర్కొంటున్నాం… ఎలా వ్యవహరించాలి మేం మా స్థాయిలో ప్రయత్నం చేస్తాం… ప్రజాస్వామిక వాదులు ఈ నాడు బస్తర్‌లో జరిగేదాన్ని నేను హత్యాకాండ అంటాను … ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. చాలా బాధ అనిపించింది మనీష్ కుంజామ్ మాటల్లో పీడియా తప్ప వేరే ఏ బూటకపు ఎన్‌కౌంటర్ లేనేలేదు అని అన్నాడు. చవీంద్ర్ కర్మా మీ ఇంటర్వ్యూ లో అన్నాడు రేణుక బూటకపు ఎన్‌కౌంటర్ ప్రజలకు కూడా తెలుసు. రేణుకది బూటకపు ఎన్‌కౌంటర్ అని అందరికీ స్పష్టంగా తెలుసు.. ఏ ఇంటి నుంచి పట్టుకున్నారు .. గమ్‌డి గురించి తెలుసు, కుమంగ్ గురించి తెలుసు .. టేకామెటా గురించి తెలుసు..ఇన్ని ఘటనల్లో సాధారణ గ్రామ ప్రజల హత్య జరిగింది.. సమస్య ఇంతగా పెరిగిపోయింది.. ఈ సమస్యను “ఏమీ లేదు… అంతా సరిగ్గా ఉంది” అని అంటున్నాడు మనీష్ కుంజామ్.. వాస్తవానికి వారే చంపుతున్నారు.. కేవలం ఒక పీడియా తప్ప వేరే ఎక్కడా అలా లేనే లేదు అంటే బూటకపు ఎన్‌కౌంటర్‌లు లేనే లేదు అని అంటే చాలా దు:ఖం వేస్తోంది.
వికాస్: మనీష్ కుంజమ్ అన్నాడు అందుకని బాధ అనిపించిందా?
రూపేశ్: అవును . మనీష్ కుంజమ్ లాంటి నాయకుడు … అన్నాడు అందుకే బాధ పడ్డాం..
వికాస్: వేరే ఎవరైనా అంటే అంతగా అనిపించదు…
రూపేశ్: ప్రజల పక్షాన ఉండేవాడు… మా ఎర్రా దగ్గరకు వెళ్ళాను… నేను దేవా దగ్గరికి వెళ్ళాను, హిడ్మా దగ్గరకు వెళ్ళాను, మాట్లాడాను అని అంటున్నాడు… ఎలాంటి సంబంధం ఉందో దాన్ని బట్టి .. అందరినీ ఎలా చూస్తున్నాడు? అతను ఎలా ఆపాలి అని చెప్పడానికి బదులు అంతా బాగానే ఉంది అని సర్టిఫికేట్ ఇవ్వడం చూసి మంచిగా అనిపించలేదు. సరే ఉండనీ .. ఇప్పుడు నేను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు. అందరూ ముందుకు రావాలి…
మాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే సలహా ఇవ్వవచ్చు. విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు. మీడియా ద్వారా చేయవచ్చు. వ్యక్తిగత రూపంలో చేయవచ్చు. చేయండి. మేం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా పార్టీ తరఫున నేను కోరుకునేదేమంటే ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళండి. అంటే ఈ హత్యాకాండ ఆగాలి. దీని ఆపడానికి ఏం చేయగలం? అది చెయ్యడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాం. మేం సిద్ధమవుతున్నాం. ఇంతకు ముందు కూడా నేను లేఖల్లో తెలియచేసాను. నేను వ్యక్తిగతంగా.. నేను ఒక సబ్ జోన్ బాధ్యుడిగా ప్రయత్నం చేస్తున్నాను.
ఈ సంభాషణ మొదట్లో చెప్పి వదిలేశాను. 2024 మార్చిలో మా ఎస్‌జెడ్‌సి వికల్ప్ స్పష్టతనిచ్చాడు. దాన్ని బట్టి మేం శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం. పూర్తి పార్టీకి అంగీకారం ఉన్నది. పార్టీలో రెండు అభిప్రాయాలూ లేవు. పూర్తి పార్టీలో రెండు భిన్నాభిప్రాయాలు లేవు. ఇందులో అంగీకారం ఉన్నది. శాంతి చర్చలలోకి వెళ్ళాక అక్కడ ఏం నిర్ణయం చేస్తాం? దాని గురించి ఆలోచించాలి. ఈ నాటి చర్చల పరిస్థితిని బట్టి మేం కలిసి కూచుని నిర్ణయం చేయాల్సి ఉంది.
నేను ఆలోచిస్తున్నాను. నా దగ్గరలో చుట్టుపక్కల ఉన్న కామ్రేడ్స్ కూడా ఆలోచిస్తున్నారు. అందుకని నేను ముందుకు వచ్చాను. ముందుకు తీసుకువెళ్లవచ్చు. ప్రభుత్వం బహుశా ఒకవేళ నిజాయితీతో శాంతి చర్చలు జరగాలనుకుంటే శాంతి చర్చల పేరుతో ఇంత పెద్ద హత్యాకాండకు లెజిటిమసి .. “మేం చెప్పినా వాళ్ళు వినడం లేదు… మేం అవకాశం ఇస్తున్నాం, ఒకళ్ళు రండి, ఇద్దరు రండి, చిన్న గ్రూపు లేదా పెద్ద గ్రూపు లేదా వాట్స్‌అప్‌లో, ఫోన్‌లో ఇంత చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. అందుకనే మేం ఇట్లా చంపాల్సి వస్తోంది”..అని వాళ్ళు లెజిటిమసి కోసం అంటున్నారు .. శాంతి చర్చలే వద్దనుకుంటే మేం ఏమీ చేయలేం.. ప్రజాస్వామిక వాదులు, మేధావులు మీలాంటి జర్నలిస్టులు మిగతా సెక్షన్లు, ప్రజలు ప్రయత్నం చేయాలి వాతావరణాన్ని ఏర్పరచడానికి.. వాతావరణాన్ని ఏర్పరచడం అందరి బాధ్యత.. హత్యాకాండను ఆపాలని అందరి ఆలోచన ..
కొంతమంది అనవచ్చు మా మీద బాధ్యత ఉన్నదని.. కానీ మేము ఇదంతా జరగాలని కోరుకుంటున్నాం… ఒకవేళ ప్రభుత్వం తయారుగా ఉంటే ముందుకు వెళ్ళచ్చు. పరస్పర విశ్వాసం పెరగడానికి కూడా నేను మీడియా ద్వారా ముందుకు వస్తే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశ్యంతో నేను మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాను. ఇది సరియైనది.
వాస్తవంలో కాస్త జరుగుతుంది.. కాస్త ప్రయత్నం చేయాలి.. ఎవరికైతే సందేహం ఉన్నదో .. నేను మనీష్ కుంజామ్ మాట కూడా విన్నాను.. అందరూ ఆలోచిస్తారు.. ఏదో ఒకటి జరుగుతుంది.. ముందుకు వెళ్ళాలి…అప్పుడు ప్రభుత్వం కూడా వినాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సి ఉంటుంది. కొంత మాట్లాడతాం అని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటుంది. సమస్య కూడా చాలావరకు పరిష్కారమవుతుంది. ఈ విశ్వాసంతోనే నేను ముందుకు వస్తున్నాను. సరియైన దిశలోనే వెళ్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇందుకోసం మీ అందరి మద్దతు కావాలి. శాంతి చర్చలకు సంబంధించి నా లేఖ తరువాత మీ వీడియో చూశాను. చివర్లో ముగింపునిస్తూ మీరు చెప్పినది రెండు పక్షాలూ సిద్ధమయితే అంతంలో పరిష్కారం అయితే మంచిది అని..అందుకని కూడా మిమ్మల్ని పిలిచి ముందుకు తీసుకు వెళ్ళడం అందరి దగ్గరకు వెళ్తుంది.. మా కామ్రేడ్స్ కూడా వింటారు.
వికాస్: బస్తర్ టాకీస్‌ను పిలవాలనే నిర్ణయం పూర్తి పార్టీదా?
రూపేశ్: కాదు భయ్యా..పూర్తి పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే బాగుండేది.. అలాంటి స్థితి లేదని నేను నా లేఖలోనే చెప్పాను.
వికాస్: అవును మీరు రాశారు
రూపేశ్: నేను రాశాను అలాంటి స్థితి లేదు. శాంతి చర్చ జరగాలంటే కాల్పుల విరమణ జరగాలనేది సాధారణ విషయం. ఉక్రెయిన్-రష్యా; ఇజ్రాయిల్ -గాజా విషయంలో కూడా మొదట కాల్పుల విరమణ; ఆ తరువాత శాంతి చర్చలు. ఇది సాధారణంగా జరిగేది. కాల్పుల విరమణ లేకుండా, వాతావరణం లేకుండా మీరు ఎలా కూర్చోగలరు? పరస్పర వాతావరణం ఉండాలి. మీమీద నమ్మకం ఉన్నది. అందుకనే మిమ్మల్ని కలిశాను. కగార్ కోసం రెచ్చగొట్టే వాళ్ళని పిలవలేను కదా. అలాంటి చానెల్ వాళ్ళని పిలిచి మాట్లాడలేను కదా.
వికాస్: ఏ చానెల్?
రూపేశ్: ఇటు అటు తిరుగుతుంటారు. అతని పేరు ఏమిటి?
వికాస్: రాజేంద్ర్ తివారీ?
రూపేశ్: అవును. ఆ తివారీ. మీరు కూడా తివారీ (చిరునవ్వు) అలాంటి వాళ్ళను పిలవలేం కదా
వికాస్: అవును. నాకు మంచి మిత్రుడు
రూపేశ్: ఉండచ్చు. అతని నేపథ్యం తెలీదు. అతనే స్వయంగా వచ్చి అడవిలోకి వచ్చి అబూజ్ మాడ్ కొండలు ఎక్కి వాళ్ళే చంపుతున్నారు అని చెప్తూ ఉంటాడు కదా. రేపు అలా చేస్తాడు. ఒక రోజు వచ్చి డిఆర్‌జి వాళ్ళతో తిరిగితే తెలుస్తుంది. ఒకరోజు తిరిగితే తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రతినిధులు చెబుతున్నారు కదా, మీ పిల్లల్ని పంపించండి డిఆర్‌జి వాళ్ళ వెంబడి. బస్తర్ ఫైటర్స్ వాళ్ళ వెంబడి రెండు రోజులు ఒక కేంపెయిన్‌లో. అప్పుడు చెప్పచ్చు మీరు. ఇంత పెద్ద సమస్యను పరిష్కరిస్తున్నారు నక్సలైట్లు వీళ్ళు ఇంత భయంకరమైన వాళ్ళు. వీళ్ళని చంపుతున్నారు అని మీరు చెప్తున్నారు కదా.. స్టూడియోలో కూచుని
మీరు స్వయంగా దిగండి. మీ పిల్లల్ని పంపండి వాళ్లతోటి. సమస్యను పరిష్కరించడానికి. ఇంత పెద్ద సమస్యలను పరిష్కరిస్తున్నారు దేశం కోసం. మీరు కొట్లాడుతున్నారు కదా. మీ పిల్లలను రెండు రోజుల కోసం.. ఎక్కువ వద్దు రెండు రోజుల కోసం మే నెలలో ఏప్రిల్ నెలలో కేంపెయిన్‌లో కొండల మీద రెండు రోజులు తిరిగితే తెలుస్తుంది
వికాస్: డిఆర్‌జి తోనా
రూపేశ్: అవును డిఆర్‌జి తో
వికాస్: అంటే మీరు ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అని
రూపేశ్: ఒప్పుకుంటున్నా. డిఆర్‌జి వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు అని. డిఆర్‌జి వాళ్ళను మేమే తయారు చేశాం కదా.
వికాస్: అవునా
రూపేశ్: మా ట్రైనింగ్ కదా.
వికాస్: అవునా?
రూపేశ్: మా దగ్గర అంటే పార్టీలో ఉండి ట్రైనింగ్ తీసుకున్నారు కదా
వికాస్: అవునా సరేండర్ అయి వెళ్ళిన వాళ్ళు
రూపేశ్: అవును. సరేండర్ అయి వెళ్ళినవాళ్లు. వాళ్ళకు సులభం. వాళ్లు స్థానికులు. ఇది కౌంటర్ ఇన్సర్జెన్సీ విధానం. స్థానికులతోటి బలగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం ప్రభుత్వం కూడా చాలా కష్టపడింది. భాజపా వాళ్ళకి ఇప్పుడు క్రెడిట్ పోతోంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పోయింది కదా. కాంగ్రెస్ గ్రీన్ హంట్‌ను మొదలుపెట్టింది. మా వాళ్లని, ముఖ్య నాయకులను, మా డిపార్ట్‌మెంట్‌లని 2009 నుంచి కార్పెట్ సెక్యూరిటీని కాంకేర్ జిల్లాలో రాజ్ నంద్ గావ్ జిల్లాలో విస్తరించింది. ఆ తరువాత కాంగ్రెస్ చాలా చేసింది
వికాస్: భాజపా అంటుంది కాంగ్రెస్ మావోయిస్టులతో కలిసిన పార్టీ. గత అయిదు సంవత్సరాలలో మావోయిస్టుల పైన దాడి చేయలేదు అని భాజపా వాళ్ళు అంటున్నారు.
రూపేశ్: మీకు ఏం కనబడుతోంది? మీరు మా కంటే ఎక్కువ రిపోర్టింగ్ చేస్తున్నారు కదా. మీరు వెళ్లారు కదా. కోయల్‌బేడాకు కూడా వెళ్లారు. ట్రాక్టరు, మిల్లు ఉన్నవాళ్లను ఇద్దరినీ చంపడానికి. అందుకని కూడా రిపోర్టు చేశారు దాన్ని కూడా మర్చిపోయారు మా కుంజామ్. అక్కడ కూడా బూటకపు ఎన్‌కౌంటర్ అని అతను కూడా వెళ్ళాడు. ఏం లేదు అని ఇప్పుడు చెబుతున్నాడు. కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదు అనేది తెలుసు.
వికాస్: వాళ్ళూ ఇద్దరినీ చంపారు
రూపేశ్: ఇద్దరినీ చంపడం వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన విషయం. అప్పుడు అమిత్ షా కూడా వచ్చి వాళ్ళకు చాలా సర్టిఫికేట్ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళకు. ఏ జిల్లాలో ఎంత విజయం సాధించారు అని. మేం కూడా ఒప్పుకున్నాం. అంటే వాళ్ళ విజయం కాదు.. మా వైఫల్యాలు ఏమిటి? ఎంత బలహీనంగా ఉన్నాం? ఎంత బలంగా ఉన్నాం? మా విశ్లేషణ కూడా ఉన్నది. ఎప్పుడు ఏమిటి అనేది. టైమ్ టైమ్ కి మేం కూడా కూచుంటాం. సమావేశం వేసుకుంటాం. సమావేశం వేసుకుని మూల్యాంకనం వేసుకుంటాం. భాజాపా వాళ్ళకు క్రెడిట్ అంటే ఇప్పుడు భాజాప అంటే అమిత్ షా విజయం పొందుతున్నామని అంటున్నాడు. అందరూ ఒకటే. వాళ్ళకు తెలుసు కాంగ్రెస్, భాజపా వేరు కాదని. ఒకే వైఖరి (స్టాండ్) ఉంది. ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళంతా ఒకటే కోరుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ హస్‌దేవ్ స్థితి హస్‌దేవ్‌దే. సిద్ధపడుతున్నారు, ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. ఇప్పుడే అందులోకి వెళ్ళద్దు అని. వివాదంలోకి వద్దు.
వికాస్: కామ్రేడ్ శాంతి చర్చలు ముందుకు పోతాయా లేదా? ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. మీ లేఖలు వస్తున్నాయి. ముందు జరగబోయేది ఏమిటి? ఎందుకంటే ప్రభుత్వం చెబుతోంది తుపాకీకి సమాధానం తుపాకీతో ఇస్తాం. ఏ కమిటీనీ ఏర్పాటు చేయం. మీరు ఏదైనా కమిటీ ఏర్పాటు చేసి పంపాలనుకుంటే పంపించవచ్చు. రెండో విషయం మా సరెండర్ పాలసీని అప్‌గ్రేడ్ చేసాం. దాని లాభం పొందండి. రండి ప్రధాన స్రవంతిలోకి అని. విషయం ముందుకు ఎలా వెళ్తుంది?
రూపేశ్: చెప్తాను. తుపాకీకి సమాధానం తుపాకీతో ఇస్తాం అనే విషయంలో.. రాజ్యాంగాన్ని విశ్వసించేవాళ్లు, అన్నీ చట్టాలను అంగీకరించే ప్రభుత్వం కదా. అలాంటపుడు మీరు ఆలోచించాలి అలా సమాధానం ఇవ్వడం సరియైనదా అని. సరెండర్ కండి లేదా తూటా తినాల్సిందే. అదేకదా.
వికాస్: ఉ…
రూపేశ్: రేణుక తమ్ముడు పేరు ఏదో ఉన్నది సమాధానం ఇచ్చాడు తెలుగులో .. అతన్ని అడిగారు ప్రశ్న.. అప్పటికి మా వికల్ప్ లేఖ విడుదల కాలేదు. అది బూటకపు ఎన్‌కౌంటరా అని లేఖ విడుదల కావడానికి ముందే జర్నలిస్టులు అడిగారు. మూడు నాలుగు ప్రశ్నలు అడగడంతో అతను జవాబు ఇస్తున్నాడు.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అనుకుంటున్నారా? అని అడిగితే అతను నేరుగా సమాధానం ఇచ్చాడు. ఒక ఘటన గురించి అది ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా అని మీరు అడగాల్సిన, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బహిరంగంగా చెబుతున్నారు … తూటాలు పేలుస్తాం అని బహిరంగంగా చెబుతున్నారు..బహిరంగంగా మీడియా ముందు చెబుతున్నారు… అదే చేస్తున్నారు.. 30 మందిని, 35 మందిని చంపుతున్నారు. చెప్పి చంపుతున్నారు కదా. బూటకపు ఎన్‌కౌంటరా అనే ప్రశ్నకు అర్థమే లేదు అని సమాధానం ఇచ్చాడు. అది అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది విషయం ఏమిటి అని. కానీ మేం చెప్పట్లేదు కదా విజయ శర్మాజీ మాకు చెప్తున్నాడు మాటలేం జరగవు. మన రాజ్యాంగం ప్రకారమే, మన చట్టం ప్రకారమే జరుగుతుంది అని అంటున్నాడు కదా .. కానీ మీరు కూడా పాటించాలి .. ఆ విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు కదా ఏమవుతోందో? కానీ అడగడం లేదు. అది మాకు ఆందోళన కలిగించే విషయం .. అలా ఎలా అంటాడు? సుప్రీం కోర్టు తీర్పు ఏమిటి? తుపాకీ పట్టుకున్నవాళ్లందరినీ చంపేయాలి అని ఏమైనా చట్టం ఉన్నదా? సుప్రీం కోర్టు అలాంటి తీర్పు ఏమైనా ఇచ్చిందా? ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే .. ఏం చేయాలి? తుపాకీ పట్టుకునేవారితో ఏం చేయాలి? ఎలా పరిష్కరించాలి? ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. తెలిసిన వాళ్ళు ముందుకు వచ్చి అడిగే పరిస్థితి కూడా లేదు. ఇదంతా మా దృష్టిలో ఉంది. ఇదంతా దృష్టిలో ఉంచుకునే మేం ఆలోచిసున్నాం. మేం అందరికీ అప్పీలు చేశాం. దాన్ని వ్యతిరేకించమని. అన్నీ చేశాం. ప్రయత్నం చేస్తున్నాం . ముందుకు వెళ్ళాలి. అందులో వాదోపవాదాలు… ఇప్పుడే వ్యతిరేకించాలి అని కాదు. అయినా ప్రభుత్వం శాంతి చర్చలు జరగాలనుకుంటే తప్పకుండా అవుతాయి. ఎందుకంటే మేం సిధ్ధంగా ఉన్నాం. శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం
వికాస్: ప్రభుత్వానికి అదే షరతు కదా! మీరు తుపాకి వదిలి రావాలి అని.
రూపేశ్: అదే చెప్తున్నా. అది సరియైనది కాదు. మా పైన షరతు పెట్టడం సరియైనది కాదు. సమస్య ఏమిటి? వీళ్ళు ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్నారు. అదే సమస్య. ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారు మీరు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మీరు అణచివేతను ఉపయోగిస్తున్నారు. రెండవది శాంతి వార్తల ఆప్షన్ ఉంది. శాంతి చర్చల ఆప్షన్ ఉంది అని మీరు చెప్పడం లేదు. శాంతి చర్చల ఆప్షన్ ఉన్నది. సరే ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆయుధం పట్టుకుంటామా, వదులుతామా అనేది ఎక్కడ నిర్ణయం అవుతుంది. కూచుంటే నిర్ణయం అవుతుంది. అదే సమస్య అని మీరు అంటున్నారు . ఏ సందర్భంలో, ఏదృక్పథంతో, ఏ పరిస్థితుల్లో, ఏ ఆలోచనతో మేం తుపాకులు పట్టుకున్నాం. తుపాకులు పట్టుకుంటామా, వదిలిపెడతామా? ఏం ఆలోచిస్తాం?నేను చెప్తున్నాను కదా. మాలో మేము మాట్లాడుకోవాలి. మాలోప్మేము మాట్లాడుకునే పరిస్థితి లేదు. అది కూడా మేం చెప్తున్నాం.. 2, 3, 4, ఎస్‌జెడ్‌సి కామ్రేడ్స్ తోటి, ఒకళ్ళిద్దరు సి సి కామ్రేడ్స్‌తోటి నేను మాట్లాడుతున్నాను.
వికాస్: పొలిట్ బ్యూరోతో కూడా?
రూపేశ్: అందులో పొలిట్ బ్యూరో కామ్రేడ్స్ కూడా ఉన్నారు. వారితో నేను మాట్లాడుతున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో మా కామ్రేడ్స్‌కు కూడా తెలియాలి. నేను మీతో అనుమతితోనే మాట్లాడుతున్నాను. మా కామ్రేడ్స్, మేమూ కూడా అర్థం చేసుకుంటున్నాం, ఏ దిశలోకి శాంతి చర్చలను తీసుకువెళ్లాలని మాట్లాడుతున్నాం అనేది మా కామ్రేడ్స్ కూడా అర్ధం చేసుకుంటారు. నేను ఒక్కడినే వ్యక్తిగతంగా వచ్చి మీతో మాట్లాడటం లేదు. చుట్టుపక్కల ఉన్న కామ్రేడ్స్‌తో , నేను ఎవరినైతే కలవగలుగుతానో, వారి గైడెన్స్ (మార్గదర్శకత్వం) లోనే నేను మాట్లాడుతున్నాను. ఒకళ్ళనొకళ్ళం కలిస్తే తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం పరిస్థితి ఉండాలి. నేను మొదటి లేఖలో చెప్పాను. వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఇది షరతు కాదు. చర్చల కోసం వాతావరణం. చర్చలు జరుపుతాం. చర్చలు జరపడానికి తగిన వాతావరణం ఉండాలి. అక్కడ మండుతూ ఉంటుంది. మంట మీద పోయి కూచోగలమా. అలా కూచోలేం. మొదట మంటను ఆర్పాలి. కూర్చోడానికి ఏర్పాటు చేయాలి. ఒక వైపు హత్యాకాండ చేస్తున్నారు. నేను రేణుకతో మాట్లాడాను. రేణుక ఒప్పుకొన్నది. మనం ఒక టీం గా కలిసి చేద్దాం అన్నది.
వికాస్: శాంతి చర్చల కోసం…
రూపేశ్: శాంతి చర్చల కోసం. అంటే శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి ఒక టీం రూపంలో పని చేద్దాం అని ఆలోచించాం. ఒక రోజు ముందు నేను కలిసాను అక్కడ ఇంటికి వెళ్ళి. ఈ ప్రక్రియ మొదలయ్యే ముందరే పట్టుకుని హత్య చేశారు. కమలా కశ్యప్ అభినందిస్తున్నాడు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపిన పోలీసులను మెచ్చుకుంటున్నారు. మంచిగా అనిపించదు. వాళ్ళు ఆలోచించాలి. సరే అది వేరే విషయం.
మేం మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం. మిగతా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పని జరుగుతుంది. సకారాత్మక ఫలితం వస్తుంది. శాంతి చర్చల కోసం ఒకవేళ ప్రభుత్వానికి కూడా ఉద్దేశ్యం ఉంటే కొంత సులభం అవుతుంది. శాంతి చర్చల కోసం, చర్చల కోసం ఇది కూడా ఒక ఆప్షన్ రూపంలో మేం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు.. ముందుకు వెళ్ళచ్చు అని. మేం ఎవరితో మాట్లాడటానికైనా సిద్దం. వాళ్ళ తరఫున ఎవరైనా ప్రతినిధిని వస్తే మాట్లాడతాం.
వికాస్: ప్రభుత్వం తరఫు నించి?
రూపేశ్: అవును
వికాస్: విజయ్ శర్మాజీ చెప్పాడు కదా మీరు ఒంటరిగా వచ్చినా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. మీ భద్రతకు గ్యారంటీ ఇస్తాము అని..
రూపేశ్: కుదరదు. ఒంటరిగా వెళ్ళి ఏం చేయను?
వికాస్: మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నట్లుగా.. పార్టీ అనుమతితో
రూపేశ్: మీతోనే మాట్లాడతాను. మొదట మాలో మేము మాట్లాడుకోవాలి. నేను కమిటీ కాదు కదా. ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే మొదట మేం మాట్లాడుకున్న తరువాత చెప్తాం. శాంతి చర్చల కోసం వీళ్ళ ఇబ్బంది ఏమిటి? అందరికి ఉన్న సందేహం ఏమిటి? హత్యాకాండను ఆపడానికి లేదా ఒక అవకాశం కోసమా? దీని వెనుక ఏదైనా ఎత్తుగడ ఉన్నదా?అని కదా
వికాస్: హిడెన్ ఎజెండా
రూపేశ్: హా. హిడెన్ ఎజెండా.. అలాంటిది ఏమైనా ఉండచ్చు అని. ఇక్కడి నుంచి పారిపోవడానికి లేదా మరింత పటిష్టపరచుకోవడానికి (కన్సాలిడేట్ అవడానికి)..
వికాస్: మీరు పడిపోయారు. అందుకనే అన్నీ వైపులనుంచి శాంతి చర్చలు లేదా ఒక నెల రోజులు ..
రూపేశ్: ఆ సమయంలో కూడా మేం అదే చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం.. మాకు ఏ హిడెన్ ఎజెండా లేదు. ఏ ఎత్తుగడా లేదు. మేం నిజాయితీగా శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం. ఇట్లా మాటని దాటేస్తూ ఉంటే ఆరు నెలల కాల్పుల విరమణ .. ఆరు నెలలు అంటే ప్రభుత్వం వినడం లేదు. మొదటగా ఏదో ఒకటి మొదలుపెడదాం.
వికాస్: మీరు క్యాంపులను తీసేయండి, బలగాలను తీసేయండి అని అంటున్నారు. ఇది అవుతుందా?
రూపేశ్: 2024లో మొత్తం పరిస్థితిని అంచనా వేసాక క్యాంపులు ఎత్తేయడానికి ప్రభుత్వం ఒప్పుకోదు అనే అర్థం చేసుకొని క్యాంపులను ఎత్తేయాలని డిమాండ్ చేయడం లేదు. కాని శాంతి చర్చల ప్రక్రియ జరిగేటప్పుడు ఆ సమయంలో తమ క్యాంపుల్లో, తమ బ్యారక్స్‌లోనే బలగాలు ఉండాలి. మావి కూడా అలాగే ఉండాలి. అలా మేం తెలియచేసాం. వాతావరణం కోసం.. తీసేయాలని కాదు.. చర్యలు (ఆపరేషన్స్) ఆపాలి కదా. ఇప్పటి ఉదాహరణే చెప్తున్నా.
మొదటి లేఖ విడుదల చేశాం..నేను ఒక కామ్రేడ్ ను కలవడానికి వెళ్తున్నా…
నేను 12 వ తారీఖు ఘటనలో చిక్కుకు పోయాను..
అనిల్ పూనమ్ ను 11 రాత్రికి పట్టుకున్నారు.. 12వ తారీఖు పొద్దున్న చంపేశారు
వికాస్: పోలీసు అంటోంది – ఉదయం భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది అని.
రూపేశ్: అని ఉండచ్చు. నేను అక్కడే ఉన్నాను. ఎలాంటి భీకరమైన్ ఎన్‌కౌంటర్ జరగలేదు. నేను ఉన్న దగ్గరికి అయిదు నిమిషాల దూరంలో .. వారి రెండు బ్యాచ్‌ల మధ్య ఫైరింగ్ చేశారు. నేండే అని ఒక గ్రామ ఉన్నది. అక్కడ వాళ్ళే తమ రెండు బ్యాచ్‌ల మధ్య కాసేపు కాల్పులు జరిపి ఉండచ్చు.
వికాస్: కన్ఫ్యూజన్లో?
రూపేశ్: కన్ ఫ్యూజన్‌లో అయి వుండచ్చు బహుశా.. కానీ నది ఒడ్డున తూటా పేల్చి హత్య చేశారు. ఏ ఆయుధమూ లేకుండింది. నిరాయుధుడిగా వున్న అతన్ని..
వికాస్: ఆయుధం చూపించారు..
రూపేశ్: అరె.. భయ్యా మీతో ఒక సమస్య ఉన్నది. మీరు చెప్పారు.. సుధీర్ దగ్గర ఆయుధం దొరికినప్పుడు .. నిజమే అది సుధీర్‌దే. కానీ సుధీర్ పట్టుకోలేదు. కానీ సుధీర్‌దే. ఆయుధం లేదు అని గ్రామస్తులు చెప్తున్నారు. ఆయుధం ఎక్కడినుంచో తీసుకొచ్చి పెడతారు. రికార్డు ఉంటుంది కదా అన్నింటికి.
ఆజాద్‌ను హత్య చేశారు నాగపూర్‌లో పట్టుకొని. పటేల్ సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. శాఖమూరి అప్పారావును హత్య చేశారు.. వందల మందిని హత్య చేశారు. ఏకే-47 పెట్టారు.
వికాస్: అంటే ఎక్కడ నుంచి వస్తాయి?
రూపేశ్: మీరు అర్థం చేసుకోవాలి. మావోయిస్టుల కంటే ఎక్కువగా జర్నలిజం చేస్తున్నారు మీరు. బస్తర్‌లో మీరు అధ్యయనం చెయ్యాలి. ఏం జరుగుతోంది అని. ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకే తెలియాలి.. రేణుకది మీకు బాగా తెలుసు. రేణుక తుపాకీ పట్టుకుని కూచోలేదు అక్కడ. మనకు తెలుసు కదా. మరి అక్కడ కూడా తుపాకి చూపించారు కదా.
వికాస్: అక్కడ ఇంసాస్ చూపించారు.
రూపేశ్: ఏం చూపించారో?
వికాస్: సమస్య ఏమిటంటే.. భర్మార్ పెడితే అర్థమవుతుంది. 12బోర్ తుపాకీ నాటు తుపాకీ పెట్టినా అర్థమవుతుంది. ఆటోమేటిక్ వేపన్ రికార్డు ఉంటుంది కదా. అది ఎలా పెడతారు?
రూపేశ్: మీరు ఆలోచించాలి. అడిగితే పోలీసులు చెప్పరు కదా? వాళ్ళకు తెలుసు. మీరు అడగారు కూడా. ఇది పెద్ద విషయం కాదు కదా.. ఈ వ్యవస్థ గురించి తెలుస్తే అది పెద్ద విషయం కాదు. ఆయుధాన్ని పెట్టడం పెద్ద విషయం కాదు. అంత అకౌంటబిలిటీ (జవాబ్దారీతనం), ప్రభుత్వం – అందరూ చూస్తున్నారు కదా..
వికాస్: కామ్రేడ్.. మీరు అంటున్నారు పూర్తి పార్టీ శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నది. హిడ్మా కూడా సిద్ధంగా ఉన్నాడా? నేను విన్నాను హిడ్మా విడిగా పోరాడటానికి తయారీ చేస్తున్నాడు అని..
రూపేశ్: నాకు తెలియదు. మీకు ఈ విషయాలు అన్నీ ఎక్కడనుంచి దొరుకుతాయో నాకు తెలియదు. కానీ మా మధ్య, మా కమిటీల మధ్య శాంతి చర్చలకు వెళ్లడానికి సంబంధించి ఎలాంటి భిన్నాభిప్రాయం అనే అంశం లేదు. శాంతి చర్చలలోకి వెళ్ళిన తరువాత ఏం చేద్దాం? దాని గురించి కలిసి మాలో మేం మాట్లాడుకుంటే ఏమవుతుందో తెలియదు. కానీ శాంతి చర్చలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, వైఖరి మీద మొత్తం పార్టీ, ఒక్క కామ్రేడ్ కూడా ఏ స్థాయిలోనైనా ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. అందరికీ అంగీకారం ఉన్నది.
వికాస్: సరెండర్ గురించి మీ ఆలోచన ఏమిటి? ప్రభుత్వం అంటోంది మేం సరెండర్ పాలసీని మేం అప్ గ్రేడ్ చేశాం దాని లాభాన్ని పొందండి అని అంటోంది. ఈ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు?
రూపేశ్: మా కామ్రేడ్స్ నేటి పరిస్థితి చూసి మా వ్యక్తిగత బలహీనతలు ఆరోగ్యానికి సంబంధించి లేదా రాజకీయపరంగా పరిస్థితులను చూసి ఏం సాధిస్తాం ఏం సాధించలేం.. ఆరోగ్యసమస్యకు సంబంధించి… ఎలాగైనా మరణిస్తాం అని కొంతమంది కామ్రేడ్స్ వెళ్తున్నారు. సరెండర్.. ఆకర్షణీయమైన పునరావాసం దొరుకుతుంది. ఇల్లు దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది.. బండి వగైరాలు దొరుకుతాయి, మా పైన ఉన్న కేసులు ఉండవు, ప్రశాంతంగా జీవించవచ్చు అని ఆలోచించి వెళ్ళడం లేదు. ఎవరూ కూడా…
వికాస్: చనిపోతామనే భయంతో వెళ్తున్నారు..
రూపేశ్: అవును. అంటే చనిపోతామనే భయం కూడా ఉన్నది. ఏదైనా స్వార్థమూ లేదా ఇప్పుడే తప్పించుకోవాలి ఎలాగైనా సరే..
వికాస్: అదే చావు అంటే భయం ..
రూపేశ్: ఇప్పుడు దాడులు తీవ్రతరమయ్యాయి.. ఇంతకు ముందు కూడా వెళ్ళిపోయారు. దాడులు తీవ్రంగా లేని సమయంలో కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా వేరు వేరు బలహీనతల వల్ల.. కేవలం అణచివేత భయం మాత్రమే కాదు. వేరు వేరు కారణాలు కూడా ఉండవచ్చు. వెళ్ళేటప్పుడు మాతో మంచిగా చెప్పి వెళ్తున్నారు. ఉత్తరాలు రాసి వెళ్తున్నారు. మేం అలా ఉంటాం.. ఇలా ఉంటాం అని. విచారంతో.. ఎందుకంటే సంవత్సరాల తరబడి మాతో పాటు కలిసి ఉన్నారు. అందుకని చెప్పి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? తప్పనిసరి పరిస్థితుల్లో.. ఆ తరువాత అలవాటైపోతుంది. చాలా తక్కువ మంది వ్యతిరేకతతో వెళ్ళారు. చాలా మంది ఇప్పుడు డిఆర్‌జిలో ఉన్నారు. మా నిర్మాణంలో ఫిట్ కాలేని వాళ్ళు . అంటే నైతిక విలువలు, సమాజంలో ఏ విలువలైతే ఉన్నాయో, మా నిర్మాణంలో .. గ్రామాల్లో కూడా.. అంటే సమాజంలో కూడా కొన్ని విలువలు ఉంటాయి.. ప్రతి సమాజంలోనూ కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను పాటించాల్సి ఉంటుంది. పార్టీలో కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పాటించకపోవడం వల్ల కొన్ని విచారణలకు గురయ్యారు. గ్రామస్తులు కూడా బహిష్కరిస్తారు. దానికి గురై వెళ్ళిన వాళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యారు.
వికాస్: ఎక్కడ? డిఆర్‌జి లో?
రూపేశ్: అలాంటివాళ్లు .. వాళ్ళ పేర్లు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని .. చెప్పగలుగుతాను.. మెజారిటీ వాళ్ళ మీద పార్టీ విచారణ జరిపింది.
వికాస్: అనైతిక వ్యవహారాలకు సంబంధించి..
రూపేశ్: అన్నింటికంటే ఎక్కువ అనైతిక వ్యవహారాలు పార్టీలో .. అనైతిక వ్యవహారం అంటే.. మహిళలతో ఎలా వ్యవహరించాలి అని నియమాలు ఉంటాయి. గ్రామంలో ఉంటే అక్కడి మహిళలతో (దీదీలతో) ఎలా ఉండాలి?పార్టీలో మహిళా కామ్రేడ్స్‌తో ఎలా ఉండాలి?
వికాస్: మహిళలతో దుర్వ్యవహారం చేస్తారా?
రూపేశ్: కొంతమంది ఉంటారు. సమాజంలో జరిగేవి ఇక్కడ కూడా కొన్ని జరుగుతాయి. అలా జరగకూడదని ఎడ్యుకేట్ చేస్తాం.. ప్రయత్నం చేస్తాం సరిదిద్దడానికి.. చివరికి విచారణ జరిగాక వారు ఉన్న స్థాయి నించి కిందికి పంపిస్తాం(డిమోషన్). వాళ్ళు ఒకసారి, రెండు సార్లు మళ్ళీ అలా వ్యవహరిస్తే, తమ తప్పును సరిదిద్దుకోకపోతే మేం పంపించేయడం లేదా వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం అదే మంచి జాగాగా ఉండి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం ఉపయోగిస్తోంది తమ కౌంటర్ ఇన్సర్జెన్సీ లో. ఇలాంటి వాళ్ళను చేర్చుకొని ….
మేమైతే ప్రయత్నం చేస్తాం. కానీ నేను మొదటి లేఖలో, రెండవ లేఖలో స్పష్టంగా డిమాండ్ పెట్టాను నేను. మా కామ్రేడ్స్‌ను కలిసిన తరువాత .. కనీస ఆరు నెలల కాల్పుల విరమణ ఉంటే ఏమైనా చేయగలం… వాతావరణం.. పరస్పర విశ్వాసం ..ఉండాలి
కానీ ప్రభుత్వం వినేటట్టు లేదు.. అందుకని మేం వెనక్కు తగ్గి కనీసం ఒక నెల అయినా అంటున్నాం.. ఒక నెలలో త్వరత్వరగా కనీసం మొదట మేం ఒక సమావేశం వేసుకొని ఏం చేద్దాం అని ఆలోచిస్తాం. ఒక నెలలో ఏం చేయగలమో చేద్దాంఅని ఆలోచిస్తున్నాం. కనీసం మేం కలుసుకోవాలి ఇతర కామ్రేడ్స్‌ని కలుసుకోవాలి.. మాట్లాడుకోవాలి.. వేరే వేరే బాధ్యతలలో ఉన్న వేరే వేరే ప్రాంతాలలో ఉన్నారు కామ్రేడ్స్ . ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పని కోసం ఒక దగ్గర చేరటం చాలా రిస్క్. ప్రమాదం వున్న విషయం అందుకని మొదట ఏం చేద్దాం ఎలా చేద్దాం అని. వేరే వేరే జోన్‌లలో ఉన్న కామ్రేడ్స్‌మి కలుసుకోవాలి. ఈ పరిస్థితుల్లో అది రిస్క్.
ప్రభుత్వం నుంచి సకారాత్మక స్పందన వస్తే మేం తప్పకుండా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి ఏదైనా నిర్ణయం తీసుకుంటామనే నమ్మకం ఉన్నది.
వికాస్: కానీ ప్రభుత్వానికి ఏమీ ఫరక్ పడడం లేదు.. కారణం ఏమంటే ఝార్ఖండ్ లో మీ కామ్రేడ్స్ 10 మందిని చంపేశారు. ఒక సెంట్రల్ కమిటీ సభ్యున్ని చంపేశారు. ఇక్కడ కూడా మీకు వరుసగా నష్టాలు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం మీరు చెప్పింది ఒప్పుకోలేదు అనుకోండి. లేదా ప్రభుత్వం ఒకవేళ ఒక నెల కాల్పుల విరమణ కోసం ఒప్పుకోక పోతే? మీరు శాంతి చర్చల కోసం రండి. రాకపోతే మీరు పోరాడుతూనే ఉండండి. పోరాడుతూ పోరాడుతూ ఉంటే ఏమవుతుంది.. మీరే అంటున్నారు నాలుగు వైపులా చుట్టుముట్టారు అని..ఏరియా తక్కువ అయిపోతోంది అని.. మీ కామ్రేడ్స్ సరెండర్ అవుతున్నారు.. దీని ఫలితం ఏమవుతుంది? ఇప్పుడు మీరు పోరాడే స్థితిలో లేనే లేరు కదా.. తూటాలు తక్కువ ఉన్నాయి.. కేడర్ తక్కువ ఉన్నారు… స్థలం కూడా తక్కువ ఉంది. ఎలా మరి?
రూపేశ్: సమస్య అయితే ఉన్నది.. బలహీనపడిన స్థితిలో ఏం చేయాలి? నష్టం అయితే జరుగుతుంది.
ఇంతవరకు చేస్తున్న స్థాయిలో, ఆ రూపంలో చేయలేక పోవచ్చు కాని 2026 మార్చి కల్లా అంతం చేస్తాం.. పూర్తి పార్టీని అంతం చేస్తాం.. అంటే అలా అయితే జరగదు… అది అసంభవం…
ఇక్కడ ఇలా ఉండదు.. పూర్తి క్యాంపులు ఉంటాయి…
బస్తీ గ్రామంలో జరిగినట్లుగా నక్సల్స్ లేని గ్రామంగా ప్రకటిస్తే కోటి రూపాయలు ఇస్తాం అని…అలాంటి పథకాలతో.. వాతావరణం ఏర్పడవచ్చు…
మావా సదస్య ముక్తి గావ్…మాది సభ్యులు లేని గ్రామం
మార్చి 31 తరువాత మళ్ళీ ఏప్రిల్.. జూన్‌లో ఆర్మీ మెనోవర్ సెంటర్ విషయం వస్తుంది..
ఇంద్రావతి టైగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమస్య వస్తుంది…
గనుల తవ్వకాల సమస్యలు వస్తాయి .
కార్పొరేట్ అనుకూల అభివృద్ధి జరపాలనే మీరు నిర్ణయించారు.. దాంతోటే అభివృద్ధి చేస్తామంటున్నారు.
అప్పుడు మరొక రూపంలో నక్సలైట్ల ఆలోచనా విధానం ఉంటుంది. ఏం చేయాలి అనేదానికి చట్టాలు ఉన్నాయి.
మేమూ, ఇతర సామాజిక సంఘాల నేతృత్వంలో జరుగుతున్నది ఒక రూపం తీసుకుంటుంది.
రెండవ రూపం అంటే ఒకవేళ ప్రభుత్వం వినకపోతే మరో రూపం తీసుకుంటుంది .
అలా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది.
మరో కొత్త రూపంలో ఆందోళన అయితే ఉంటుంది. పోరాటం అయితే ఉంటుంది.
వికాస్: సాయుధ పోరాటం కూడానా? సాయుధ పోరాటం ఉండదా?
రూపేశ్: సాయుధ పోరాటం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
సాయుధ పోరాటం అవసరమైతే ఆయుధాలు పట్టుకుంటాం..ఒకవేళ ఆయుధాలు అవసరమైతే ఏ ఆయుధం అయినా పట్టుకోవచ్చు.. ప్రతిఘటించడానికి…. ఆత్మరక్షణ కోసం…అవసరమైతే ఆయుధాలు పట్టుకోవచ్చు
భగత్ సింగ్ ను మనమందరమూ గౌరవిస్తాం…(అంగీకరిస్తాం)
వికాస్: మీరు చేసే పోరాటం ప్రజల కోసం. పార్టీ ప్రజల కోసం అంటారు..కానీ ఇప్పుడు ప్రజలు మీ వైపు తక్కువగానూ, బలగాల వైపు ఎక్కువగానూ ఉన్నారు అని మీకు అనిపిస్తోందా.
రూపేశ్: ఇది సాధారణమైన విషయం.. బలంగా ఉన్నప్పుడు అటువైపు ఉండడం.. మేం బలంగా ఉంటే ప్రజలకు మా పైన విశ్వాసం ఉంటుంది. మా సైన్యం, పిఎల్‌జిఎ, పార్టీ బలంగా ఉన్నదని విశ్వాసం ఉంటే అప్పుడు ప్రజలు అందరూ క్రియాశీలకంగా ఇందులో పాల్గొంటారు..
పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంటుంది.
ప్రతికూలత పెరిగినప్పుడు అంటే పోలీసుల బలం, పోలీసులను ఉపయోగించి రాజ్యం చేత రాజ్య అణచివేత పెరిగినప్పుడు ఇక్కడ క్యాంపులు ఎక్కువవుతున్నాయి, కొత్త క్యాంపులు వస్తున్నాయి ప్రతికూలత పెరుగుతోంది.. అరెస్టులు జరుగుతున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారు అడవిలోకి వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు ప్రజలు అడవిలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. చాలా పనులు మానేస్తున్నారు.
రోజూ షెల్లింగులు జరుగుతున్నాయి. సుక్మా జిల్లాలో, బీజాపూర్ – సుక్మా సరిహద్దు గ్రామాల్లో రోజూ షెల్స్ వేస్తున్నారు.
పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.
అందువల్ల ప్రజలు అంత క్రియాశీలంగా సమర్థించరు. కొంత వెనక్కు వెళ్తారు. అలా వెళ్ళే అవకాశం ఉన్నది. వెళ్తున్నారు. కొంచెం మార్పు అయితే ఉంటుంది.
మేం బలంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది.
కానీ ప్రజలు పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు అనేది సరియైనది కాదు.
మా కామ్రేడ్స్ అందరికీ ప్రజలే మద్దతునిస్తున్నారు.
ఎంత పోలీసు అణచివేత ఉన్నా, ఎంత చుట్టుముట్టినా ముందర మాకు అన్నం పెట్టి కానీ వారు తినరు.
అలాంటి ప్రజలు ఉన్నారు
పోలీసుల మధ్య నుంచి మాకు ఎలాగైనా అన్నం తెస్తారు. మీరు ఉండాలి అంటారు. అమరులైతే ఏడుస్తున్నారు.. మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? మా దగ్గర ఉండాల్సింది. మేం కాపాడేవాళ్ళం అని నారాయణపూర్, బీజాపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, టౌన్ లేదా హైవే దగ్గర ఉన్న ప్రజలు ” మీరు అంత లోపలికి అడవిలో ఎందుకు ఉంటారు? మాకు దగ్గరలో ఉంటే మేం కాపాడగలం”..అంటారు
అందువల్ల మొత్తం మీద మీ ప్రశ్నకు సమాధానం.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ప్రజా పునాది, ప్రజా మద్దతు తగ్గుతుంది.. అలాంటి పరిస్థితి ఉన్నది
రాజ్యం కూడా అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది కదా. చాలా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా చేసి బలప్రయోగంచేస్తోంది .. పథకాలను అమలు చేస్తోంది. రకరకాలుగా చేస్తోంది. దాని ప్రభావం కూడా తప్పకుండా ఉంది.
వికాస్: కామ్రేడ్ నాలో మళ్ళీ మళ్ళీ ఒక ప్రశ్న రేకెత్తుతోంది. మీరు చెబుతున్నారు . మీ పార్టివాళ్లను హత్య చేశారు అంటున్నారు.. ప్రభుత్వం పట్టుకొని చంపేస్తోంది..
ఇన్ఫార్మర్లు అనే పేరుతో… తాడిమెట్లలో 76 మంది పోలీసులు.. మిన్పాలో 17 మంది పోలీసుల హత్య.. ఈ విషయాన్ని ఎలా చూస్తారు? వీళ్ళని చంపాల్సి వచ్చింది కదా అని మీరు బాధపడ్డారా?
రూపేశ్: అది వేరే విషయం. ఈ పరిస్థితిలో దానికి జవాబు చెప్పను. అది వేరే విషయం
వికాస్: నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియోని చూసిన వాళ్ళు అడుగుతారు. మీ వాళ్ళని చంపినప్పుడు మీకు బాధ కలుగుతుంది.. మీ వాళ్ళు ఇన్ఫార్మర్లు అని చెప్పి గ్రామస్తులను చంపారు. పోలీసులను చంపారు. పోలీసులు వాళ్ల డ్యూటీ చేయడానికి వచ్చారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి…మీరే చెప్తారు పోలీసులు మీ శత్రువులు కాదు అని… అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కూడా ప్రజలు అడుగుతారు.
రూపేశ్: ఈ ప్రశ్నకు చాలా వివరంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకే మాటలో జవాబు చెప్పే విషయం కాదు.
వికాస్: సరే.. ఈ విషయంలో తరువాత మాట్లాడుకుందాం…
శాంతి చర్చల గురించి ముగింపుకి వద్దాం.. మేము సరెండర్ పాలసీని చాలా బాగా తయారు చేసాం. మీరు వెనక్కి రండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లాభాన్ని పొందండి. ప్రధాన స్రవంతిలోకి రండి అని ప్రభుత్వం అంటోంది.
మీరు రెండు లేఖలు రాశారు. మేం శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం కానీ అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.. కనీసం ఒక నెలపాటు కాల్పుల విరమణ జరపాలి.. అలా చేస్తే కనక మేం అందరమూ కలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలు అవుతుంది..అని అంటున్నారు
మీకు ఏం అనిపిస్తోంది? ఈ విషయం ముందుకు వెళ్తుందా? ఎందుకంటే ప్రభుత్వం తన మాట మీదే మొండిగా వున్నది.
రూపేశ్: తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలి. ప్రయత్నం అయితే చెయ్యాలి.. మా పైన కూడా బాధ్యత ఉన్నది…
వికాస్: కొంతమంది అంటున్నారు.. మీరు పడిపోయారు
రూపేశ్: మేం వేరే విధంగా అడగడం లేదు..నేను ఇప్పుడు ఆయుధం పట్టుకుని లేను … ఆయుధాలు పట్టుకొని చర్చకు వస్తాము అని అనలేదు
మనీష్ మాట్లాడేటప్పుడు మా రామకృష్ణ గార్డ్ రక్షణ తోటి వచ్చాడు అని. గార్డ్స్ తోటి రాలేదు.. వలంటీర్స్‌తో వచ్చాడు. వాళ్ళు వాలంటీర్లు. తమ డ్రెస్ వదిలేశారు అన్ని వదిలేశారు.. వలంటీర్స్ వెంబడి సహాయం చేయడానికి ఉన్నారు.
ఆయుధాలు ధరించిన వాళ్ళు రక్షణ కోసం లేరు.
ఆ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వం తుపాకులతో భద్రతను తెచ్చుకుంది. వికాస్: మీరు బస్తర్ టాకీస్ ను చాలా శ్రద్ధగా చూస్తారు…
రూపేశ్: అవును తప్పకుండా చూస్తాం. అందరూ చూస్తారు. ఎవరు ఎట్లా విశ్లేషణ చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? వాళ్ళ ఆలోచన ఏమిటి? సకారాత్మకమైనది ఏమిటి? నకారాత్మకమైనది ఏమిటి?
నమ్మకం ఉండి అందరూ ప్రయత్నం చేస్తే .. మీరు ప్రయత్నం చెయ్యాలి .. అందరూ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తలొగ్గక తప్పదు.
వికాస్: ప్రభుత్వాన్ని వంచాలనుకుంటున్నారా? లేక ప్రభుత్వంతో కలిసి..
రూపేశ్: ప్రభుత్వానికి చర్చ జరపాలనే ఉద్దేశ్యం ఉంటే తప్పకుండా మేం తీసుకుంటున్న చొరవను చూసి ముందుకు రావాలి.
ప్రభుత్వం ముందుకు రాకపోతే..
అప్పుడు ప్రయత్నం చెయ్యాలి.. ప్రయత్నం చేసి చూడాలి. అప్పుడు వింటుంది.
ఇప్పుడు ప్రభుత్వం బలంగా ఉన్నది
ఏమైనా మాట్లాడడానికి కూడా మనసులో ఉన్న భయం.. కానీ చాలా మంది మనసులో ఉన్నది
మాట్లాడడానికి కూడా ముందు వెనక అవుతున్నది. లేదు వీళ్ళు వెంబడి పడుతున్నారు అని ఏదైనా ఒక సామాజిక సంఘం వాళ్ళు తమ మాట చెప్పలేకపోతున్నారు. పరిస్థితి అలా తయారయింది. వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి. వాతావరణం చెడే మాటలు మాట్లాడదలుచుకోలేదు. అట్లా ఎందుకు మాట్లాడటం అని మా కామ్రేడ్స్ అంటున్నారు
అనుకూల వాతావరణాన్ని ఏర్పరచడానికి జరిగే ప్రయత్నాల దిశలోనే ముందుకు సాగుదాం..అని అందరూ అనుకుంటున్నారు..
వికాస్: అని మీ పార్టీ కామ్రేడ్ అందరూ అనుకుంటున్నారు. మీరు విజయ శర్మకు ధన్యవాదాలు చెప్పడాన్ని కూడా అందరూ చర్చిస్తున్నారు….
రూపేశ్: నేను వెంటనే ప్రతిస్పందించాను. మీరు మీ ప్రయత్నం చేయవచ్చు అంటే మా కామ్రేడ్స్‌ని కలవవచ్చు అని చెప్పినది అందుకు పరిమితమై .. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు అనిపించి ఉండవచ్చు అరె.. ఇదేమిటి ఇట్లా చెప్తున్నారు అని.. అందుకని వాళ్ళకు సందేహం వస్తోంది కృతజ్ఞతలు చెప్పడం గురించి అనుమానం రావచ్చు .. వీళ్ళ మధ్య ఏమైనా ఉన్నదా అని. అలాంటిది ఏమీ లేదు. వెంటనే ప్రతిస్పందించాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పాను.
వికాస్: అమిత్ షా కూడా దంతేవాడలో కాస్త మార్పుతో ప్రకటన చేశాడు. విజ్ఞప్తి కూడా చేశాడు. మీకు ఏం అన్పించింది? రాజకీయం అన్పించిందా? హృదయపూర్వకంగా చెప్పాడు అనిపించిందా?
రూపేశ్: అతను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఒకసారి ఒకరకంగా ఇంకోసారి ఇంకొరకంగా మాట్లాడతాడు. ఇప్పుడు తెలుస్తుంది.
అమిత్ షా కానీ విజయ శర్మకానీ ఎవరైనా మేం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ముందుకు వెళ్తాం.
వికాస్: ధన్యవాదాలు కామ్రేడ్. మీరు సమయం ఇచ్చారు. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా మిగిలిపోయి ఉంటే .. ఎందుకంటే నా దగ్గర ప్రశ్నల భాండారం ఉన్నది. కానీ మనం ఇప్పుడు శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నాం.
రూపేశ్: ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించాలి. నేనైతే దిగాను. ఆ సందర్భం ముందే చెప్పాను. నేను 12వ తారీకు క్యాంపెయిన్ లో చిక్కుకుపోయాను. ఫరవాలేదు. నాకు ఏదో అయిపోతుంది అనే ఆందోళన లేదు. ఈ ప్రక్రియ మొదలయ్యేకంటే ముందే ఏమీ జరగకూడదు.. ఆ తరువాత ఏమైనా జరగని.. పోలీసులు ఏమైనా చేయని.. తెలంగాణ అధికారులు వచ్చి దంతెవాడలో వచ్చి కూర్చున్నారు. తరువాత ఏమైనా చేయనీ..
వికాస్: మీరు తెలంగాణకు చెందిన వాళ్ళు కదా..
రూపేశ్: అవును.. ఈ ప్రక్రియను జరగనివ్వండి. పోలీసు అధికారులకు కూడా సుందర్ రాజ్ కు కూడా అందరికి అప్పీలు చేస్తున్నాను.. శాంతి చర్చల కోసం మా పార్టీ తరఫున, దగ్గరలో ఉన్న మా కామ్రేడ్స్ తరఫున నేను తీసుకుంటున్న చొరవను ముందుకు వెళ్ళనీయండి.
దీన్ని (డిస్టర్బ్) చేయవద్దని నేను పోలీసు అధికారులకు, ఐ జి సుందర్ రాజ్ కు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
డిస్టర్బ్ చేసే అవకాశం ఉన్నది. నేనైతే ఎక్కడికీ వెళ్ళే వాడిని కాను. నన్ను టార్గెట్ చేయాలనుకుంటే ఇదే ప్రాంతానికి వచ్చి చుట్టుముట్టవచ్చు. నన్ను ఏమైనా చేయవచ్చు. అందరి ముందు చెబుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఈ ప్రాంతంలోనే ఉంటాను. మీరు ఏమైనా చేయదల్చుకుంటే చేయవచ్చు.
నేను ఈ ప్రక్రియలోకి దిగాను. అందుకని చెప్తున్నా. ముందుకు వెళ్లాలా, వద్దా అనేది.. ప్రభుత్వం నుంచి స్పందన వస్తే పని మొదలుపెడతాం. పని మొదలు పెడతాం అంటే మరేం లేదు.. మా కామ్రేడ్స్ కలుస్తాం. మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నాక కాల్పుల విరమణ ప్రకటన అవుతుంది. అయితే పని మొదలుపెడతాం.
వికాస్: మీరు పదేపదే కాల్పుల విరమణ అని అంటున్నారు. కానీ ఆర్డి పేలుళ్లు నిరంతరం జరుగుతున్నాయి. ప్రభుత్వం కాల్పుల విరమణ చేస్తే మీరు బాంబు లన్నింటిని తీసేస్తారా?.
రూపేశ్: ఇంతకు ముందే నేను మొదటి లేఖ రాసినప్పుడే మా కామ్రేడ్స్‌కి తెలియచేసాను. మరింత స్పష్టత తో నేను లెటర్ కూడా రాశాను.
ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బాధ్యుడిగా, మీరు ఈ కార్యకలాపాలను ఆపాలి అని విజ్ఞప్తి చేస్తున్నా. అది పనులు రోడ్ల పని చేయడం కావచ్చు.. క్యాంపుల్లోకి రావడం, పోవడం, రోడ్ ఓపెనింగ్ చేయడం కావచ్చు..ఒకవేళ మీరు చుట్టుముట్టివేతలో చిక్కుకుపోతే .. క్యాంపెయిన్ నడుస్తోంది నిరంతరం.. 12వ తారీఖు ఇక్కడ కూడా జరిగింది. నారాయణపూర్ పోలీసు కూడా జరిపింది. 18, 19 తారీఖుల్లో కుమ్‌డాదీ దగ్గర కూడా వచ్చారు. ఒకవేళ మీరు ఘెరావ్ లో చిక్కుకు పోతే మీరు ప్రతిఘటించవచ్చు.
కానీ మీరు స్వయంగా వెళ్లి తూటాలు పేల్చకండి, ఐఇడి లు పెట్టకండి మీరు ఇప్పటికే వేసిన ప్రణాలికలన్నింటిని ఆపండి. టిసిఓసి ప్లాన్ చేస్తే ఆపండి..
ఒక వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. సమస్యను పరిష్కరించే దిశలో మేం పని చేస్తున్నాం. అందుకని ఇది పాటించాలని లేఖ కూడా రాశాను.
అయినా ఆ తరువాతనే ఐదుగురి హత్య జరిగింది.
చాలా బాధాకరమైన విషయం.
మళ్లీ ఏదైనా ఘటన జరిగితే మా వాళ్ళు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇట్లా ఎందుకు జరుగుతోంది?
ఒకవైపు పోలీసులు చంపుతున్నారు. రెండో వైపు మనం ఏమీ చేయకూడదు అని చెబుతున్నారు. ఈ సమస్య వస్తుంది. నేను అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచించడం లేదు. మా వాళ్ళు కొంతమందికి నా సందేశం అంది ఉండకపోవచ్చు.
కాంకేర్ వైపు ఉండే కామ్రేడ్ కి బస్తర్ టాకీస్ ద్వారా చెప్తున్నాను.. అన్ని కార్యకలాపాలను ప్రస్తుతానికి ఆపాలి.. ఒక వాతావరణాన్ని ఏర్పరచాలి. అన్నికార్యకలాపాలను ఆపి ఉంచుదాం. కొంత నష్టమైనా మనం భరిద్దాం .
ప్రజాస్వామిక ప్రజలందరూ చూస్తున్నారు..మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది. అందుకని పాటించాలి.
ముందు ముందు ఏం చేయాలి అనేది కమిటీ నిర్ణయం తీసుకుని చెప్తుంది.
వికాస్: సరే. చాలా ధన్యవాదాలు. ఈ కామ్రేడ్ ఉత్తర్ పశ్చిమ్ సబ్ జోనల్ బాధ్యులు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు. శాంతి చర్చలకు సంబంధించి రూపేశ్ పేరుతో లేఖ రాశారు. పూర్తి పార్టీ శాంతిచర్చలు జరగాలని కోరుకుంటోంది. చాలా రోజుల తరువాత ఒక పెద్ద మావోయిస్టు నాయకుడు తన అభిప్రాయాలు చేపారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆశిస్తున్నారు. చర్చల కోసం వాతావరణాన్ని ఏర్పరచాలి. తూటా పేలితే రక్తం ప్రవహిస్తుంది. ఎవరో ఒకరు మరణిస్తారు. ఇక ముందు మరణించకూడదు. ఇంతకుముందు జరిగిన హత్యలు , ఇంతకు ముందు మరణించినవారు మావోయిస్టులు, ఆదివాసీలు లేదా పోలీసులు వాళ్ళని వెనక్కు తీసుకురాలేమ్. కానీ మిగిలిన వాళ్ళను కాపాడడానికి ఇది ఒక ప్రయత్నం. ప్రభుత్వం ఏమంటుంది చూడాలి. ఆ తరువాత శాంతి చర్చలు జరిగితే బస్తర్‌కు అంతకంటే మంచి వార్త ఏముంటుంది? బస్తర్‌లో శాంతి తీసుకురావడానికి శాంతి చర్చలు అవసరం అనే విషయాన్ని మీరు కూడా ప్రభుత్వానికి చేరేలా ప్రయత్నించండి. ధన్యవాదాలు