దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా డిమాండ్ పెరగడం మార్కెట్ ను ఉద్దీపన చేసెందుకై, తద్వారా కొత్త పరిశ్రమలకు అవకాశం, కొత్త ఉపాధి కల్పించడం లక్ష్యం
– ఇదీ క్లుప్తంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలు. దానికి ఆమె ఎంచుకున్న మార్గం ఉన్నత మధ్యతరగతి వేతన జీవులకు పన్ను రాయితీ. ఉన్నత మధ్యతరగతిని దేశాభివృద్ధికి చోదకశక్తి గా ఆమె పొగడ్తల వర్షం కురిపించారు. దేశాధ్యక్షులు శ్రీమతి ముర్మూ గారు అదే పాటను పాడడం గమనార్హం. మొత్తం కార్మిక శక్తిలో ఒక వంతుకూడా వుండని, ఆదాయపు పన్నుచెల్లించే వారిలో కేవలం 2% వుండే ఈ వేతన కార్మికులపై అలాంటి ప్రశంశల వెనుక బిజెపి ఓట్ల ఎత్తుగడ దాగుందని చెప్పవచ్చు. సమాజాన్ని పరిశీలించి, విశ్లేషించే శక్తి, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగల సామర్థ్యమున్న వారిని , కొందరిని బెదిరింపులతో, నిర్భంధంతో లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తూ , ఎక్కువ మందిని ఈ బుజ్జగింపు రాయితీలతో తనవైపు తిప్పుకొనే ప్రయత్నం ఇది.
సామ, దాన, దండోపాయాలను వినియోగించుకోవడంలో మోడీని మించిన వారెవరున్నారు?
మంత్రి గారు చెప్పినట్టు ఈ బడ్జెట్ డిమాండ్ ను పెంచుతుందా? ఆర్ధిక సర్వే ఏం చెబుతుంది? ప్రస్తుతం, గృహ నెలవారి వినియోగపు ఖర్చులు (HOUSEHOLD CONSUMER EXPENDITURE) ఎలా వున్నాయో చూద్దాం. ఎందుకంటే అవి పరోక్షంగా సమాజంలోని వివిధ వర్గాల నెలవారీ తలసరి ఆదాయాలను తెలియజేస్తాయి. పై సర్వే ప్రకారం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబ నెలసరి ఖర్చు సగటున గ్రామీణ ప్రాంతాలలో రూ.8,316/కాగా, పట్టణ ప్రాంతాలలో అది రూ.14,528/ గా వుంది. అంటే, నలుగురు సభ్యులున్న ఒక కుటుంబ ఆదాయం సగటున సంవత్సరానికి రూ.99,792/, రూ.1,74,336/ మాత్రమే. వీరంతా ఆదాయపు పన్ను పరిధిలోకి రారు. అలాంటప్పుడు పన్ను మినహాయింపు వల్ల వీరికి మిగిలేది ఏమీ వుండదు. ఇక కొత్తగా వీరికి మిగిలేదేమిటి? వీరి వల్ల మార్కెట్ డిమాండ్ ఎలా పెరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే, బడ్జెట్ లో వివిధ రంగాల కేటాయింపుల పరిశీలిస్తే, కేంద్రం ఏ వర్గ ప్రయోజనాలకు ముందు పీట వేసిందో స్పష్టమవుతుంది. పన్ను రాయితీలతో కేంద్రం తానూ కోల్పోతున్న ఆదాయాన్ని ఎలా భర్తీచేసుకుంటున్నదో విశ్లేషిస్తే, మనకు కేంద్రం కష్టజీవుల కడుపుగొట్టి, కార్పోరేట్లకు కైంకర్యం చేస్తున్నదని విదితమవుతుంది.
బడ్జెట్ ఒక విధంగా అంకెల గారడీ కూడా. ఒక రంగానికి కేటాయింపులు గత బడ్జెట్ తో పోలిస్తే పెరిగినట్టుగా కనిపించవచ్చు. కానీ నిశితంగా పరిశీలిస్తే మొత్తం కేటాయింపులలో ఆ రంగానికి నిష్పత్తిలో తక్కువ కేటాయింపు కనపడుతుంది. ఇక వాస్తవ బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి ఎక్కువుగా కనిపించవచ్చు, అయితే గత బడ్జేట్ సవరించిన అంచనాలతో పోలిస్తే తక్కువుగా వుంటుంది. అదే విధంగా, దేశ జిడిపి ఈ రంగ శాతం, పెరిగిన ద్రవ్యోల్భణం, జనాభా అవసరాలు, అంతేగాదు కేటాయించిన నిధులలో మంజూరయినవి ఎన్ని, వాటిలో ఖర్చు చేసినవి ఎన్ని ? ఇవి తెలియడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్నప్పుడే బడ్జెట్ నిజస్వరూపం మనకు అవగతమవుతుంది.
ప్రతి సంవత్సరం బడ్జెట్ లో లాగే ప్రభుత్వం ఒక పరిష్కరించలేని వైరుధ్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అది పాలకులు తమ యజమానులైన అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశాల అమలుజేస్తూ జిడిపి, ద్రవ్యలోటు ల నిష్పత్తి ఒక నిర్దిష్ట సంఖ్యను దాటరాదు. అదే సమయంలో, దేశ ఆర్ధిక పెరుగుదల రేటును పెంచాలి. ఈ రెంటి మధ్య పొంతన ఉండదని మనకు తెలియని కాదు. అందువల్ల , ఏ పాలకవర్గామైనా తమ యజమానుల అభీష్టం మేరకు పనిజేయక తప్పదు. అయితే అత్యధిక సంపన్న వర్గాలపై పన్నులు పెంచడం ప్రభుత్వాలకు చేత కాదు గనుక, ఇక అది ద్రవ్యలోటును నియంత్రించడానికి తప్పనిసారిగా, తన ఖర్చులను తగ్గించుకోక తప్పదు. ప్రజా సంక్షేమం పై కోతలను ఈ కింది రూపాలను తీసుకొంటుంది.
1) బడ్జెట్ లో పరిస్థితుల విలువ ఆధారంగా నిధుల కేటాయింపులలో కోతకోయడం. 2) ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని నిధులలో కోతకోయడం. 3) సవరించిన బడ్జెట్ అంచనాలకన్నావాస్తవ ఖర్చులను తగ్గించడం. 4) రుణాల చెల్లింపులను బడ్జెట్ కేటాయింపులుగా చూపడం.
ఇక ఇప్పుడు వివిధ రంగాల కేటాయింపుల వివరాల్లోకి వెళ్లుదాం.
దేశంలోని దాదాపు 90% ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రంగాలలో ఆహారం, ఉపాధి కల్పన.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం:
గ్రామప్రాంతాలలో సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తూ, ఉపాధి కల్పించే ఈ పథకం పై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనే వుంది. ఈ బడ్జెట్ లో ఈ రంగానికి కేటాయింపులు రూ.85,428.39 కోట్లు కాగా 2024-25 సవరించిన బడ్జెట్ కేటాయింపులు అంతే వుండటం గమనార్హం. అంతేగాదు, జనవరి25 నాటికి పాత బకాయీల రూ.6,950/ లను పరిగణిస్తే ఈ అతి ముఖ్యమైన రంగం పట్ల కేంద్రప్రభుత్వ వైఖరి తెలుస్తుంది. క్రాంతికారి కిసాన్ యూనియ అధ్యక్షుడు దర్శన్, దీనికి స్పందిస్తూ, “బడ్జెట్ ఉపాధికల్పన విషయంలో, గ్రామ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసల విషయం లో మౌనం వహిస్తున్నది. ప్రస్తుతం, ఈ ఉపాధి పతకం కింద, హామీ యిచ్చిన 100 పనిదినాల బదులు, సగటున 45 రోజులే పని కల్పించబడుతున్నది. రోజుకు రూ.600 వేతనంతో సంవత్సరానికి 200 పనిదినాలు కల్పించాలనేది మా డిమాండ్. ఈ ఉపాధి పథకానికై రూ.1,70,000 కోట్లు కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుండగా ప్రధానమంత్రి ఈ పేదలకు ఉపయోగపడే పథకానికి నిధుల కేటాయింపు నిరంతరం తగ్గిస్తూనే వున్నాడు” అని వాఖ్యానించారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ:
మంత్రిగారు తమ ప్రసంగంలో వికసిత్ భారత్ లో ప్రధాన భాగమయిన ఆరోగ్య రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని చెబుతూ, ప్రజలందరికీ “మెరుగైన, అందుబాటులో వుండే ఆరోగ్య సంరక్షణ” కల్పిస్తున్నామని డంబాలు పలికారు. అయితే మాటలు కోటలు దాటాయి గాని, కేటాయింపుల శాతం రెండంకెలు దాటలేదు. దీనికి కేటాయింపులు, వాస్తవ ధరలలో, ఈ బడ్జెట్ కేటాయింపులు 9.5% ఎక్కువుగా కనిపించినా, ఆ రంగానికి గత బడ్జెట్ లో 2.26 % కేటాయింపులుంటే, ఇప్పటి బడ్జెట్ మొత్తంలో దీనికి కేటాయింపులు 2.05% దిగజార్చారు. అంతేకాదు, జిడిపి లో దాని శాతం తక్కువుగా వుండటం గమనార్హం పైకి చూచేందుకు గత బడ్జెట్ అంచనాల రూ.94,671కో.నుండి ఈ బడ్జెట్ లో రూ.10,385 కోట్లు అంటే 9,180 పెరిగినా వాస్తవ విలువలో, ద్రవ్యోల్భణం పరిగణలోనికి తీసుకుంటే, ఆ పెంపు కేవలం 3.04% మాత్రమే .
జన స్వాస్త్య అభియాన్ పరిశీలనలో 2020-21 బడ్జెట్ వాస్తవ ఖర్చు జిడిపి లో 0.37శాతంగా వుండగా, నేటి బడ్జెట్ లో అది 0.29% నికి దిగజారిందని వెల్లడయ్యింది. ఇదే కాలంలో కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు 2.26% నుండి 2.05% పడిపోయాయని స్పష్టమవుతుంది. ఆరోగ్య శాఖలో రెండురకాల పథకాలున్నాయంటూ, జన స్వాస్త్య అభియాన్ వాటికి కేటాయింపులలో వ్యాపార ప్రయోజనాలకు ప్రోత్సాహమిచ్చే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, డిజిటల్ హెల్త్ మిషన్ లకు, అవి విఫలమయినా, నిధుల కేటాయింపులలో ప్రాధాన్యమిచ్చారని ఆ సంస్థ తెలుపుతున్నది. ఇక పేదలకు ఎక్కువుగా ఉపయోగపడే, ప్రసూతి, శిశు సంరక్షణనందించే ప్రైమరీ, సెకండరీ ఆరోగ్య రక్షణ పథకం జాతీయ ఆరోగ్య మిషన్ కు కేటాయింపులు తగ్గాయి. దీనివల్ల, అందులో పనిజేసే ఆశా వర్కర్స్ వేతనాలపై ప్రభావం పడుతుంది. దానికి భిన్నంగా ప్రైవేట్ సెక్టార్ కు లబ్ది చేకూర్చే, సామాన్య ప్రజలకు పెద్దగా లబ్ది చేకూర్చని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి, గత బడ్జెట్ కేటాయింపులు కన్నాఈ సంవత్సరం 24% పెరగడం గమనార్హం. ఈ ప్రాధాన్య కేటాయింపులను మనం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య భీమా పథకాల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతులిచ్చిన నేపథ్యం లో చూడాలని జన స్వాస్త్య అభియాన్ సంస్థ అంటుంది. అంటే, ప్రజల సంక్షేమ పథకాల పేరుతొ పాలకులు వారి యజమానులకు ఎలా లబ్ది చేకూరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఆరోగ్య పరిశోధనల కై కేటాయింపులు, మొత్తం ఆరోగ్య బడ్జెట్ లో కేవలం 3.8% మాత్రమే.
విద్య:
సమాజ పురోగతి ప్రజల చైతన్యం పై ఆధారపడుతుందనీ, ఆ చైతన్యం, ప్రజలకు విద్యద్వారా లభిస్తుందని చరిత్ర చెబుతుంది.. స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న 78 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో నూరు శాతం అక్షరాస్యత సాధించ లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ఈసారి మొత్తం బడ్జెట్ రూ.50.65 లక్షల కోట్లలో, విద్యారంగానికి రూ. 1.28 లక్షల కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలుస్తే, ఇది 6.65% ఎక్కువుగా కనపడుతుంది కానీ, ఇది మొత్తం బడ్జెట్ లో కేవలం 2.54% , జిడిపిలో 0.4% మాత్రమె వుండటం గమనార్హం. గత కొన్ని సం. లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యారంగంపై పెట్టిన ఖర్చు జిడిపిలో కేవలం 4.2%-4.6 శాతంగా వుందని విద్యా మంత్రిత్వ శాఖ చెబుతూండగా, రిజర్వుబ్యాంక్ అంచనా ప్రకారం అది కేవలం 2.7% గా వుంది.
1966 లోనే విద్యారంగానికి జిడిపిలో కనీసం 6% కేటాయించాలని కొఠారీ కమీషన్ సిఫారసులతో పోలిస్తే, మన ప్రభుత్వాలు విద్యారంగానికి ఇస్తున్న ప్రోత్సాహమెలాంటిదో అర్థమవుతుంది. మిగతా మంత్రిత్వ శాఖల కేటాయింపులతో పోలిస్తే, విద్యారంగ కేటాయింపులు 10 వ స్థానం లో వున్నాయి. ఈ రంగంకన్నా రోడ్లు,రవాణ,రహదారులు(5.7%), ఎరువు, కెమికల్స్, ఎరువులు(3.2%),వ్యవసా యం, రైతుల సంక్షేమం (2.7%) ముందు భాగాన వున్నాయి.
ఇక విద్యారంగపు కేటాయింపులలో పాఠశాల విద్య, అక్షరాస్యత కు రూ.78.572 కోట్లు (బడ్జెట్ లో 1.5%),ఉన్నత విద్య కు రూ.50.078 కోట్లు (0.99%) కేటాయించబడ్డాయి.
బడ్జెట్ 2024 బడ్జెట్ 2025 మార్పు
శాఖ | మొత్తం.కో.రూ. | శాతం | మొత్తం.కో.రూ | శాతం | కేటాయింపులో తేడా కో.రూ. | శాతం |
పాటశాల విద్య,అక్షరాస్యత | 73,,008 | 1.51 | 78.572 | 1.55 | 5,564 | 7.62 |
ఉన్నత విద్య | 47,620 | 0.99 | 50.078 | 0.99 | 2.456 | 5.16 |
మొత్తం | 1,20,628 | 2.5 | 1,28.650 | 2.54 | 8.022 | 6.65 |
ఇక సమగ్ర శిక్ష, ఎలిమెంటరీ, సెకండరీ విద్యకు కేంద్రం అందించే నిధులు స్వల్పంగా, రూ. 37010 కోట్ల నుండి రూ.41,250 కోట్లకు పెరిగాయి. అయితే ఇందులో సెకండరి విద్యకు కేటాయించింది కేవలం రూ.6,250 కోట్లు మాత్రమె. ఈ మొత్తం, కేంద్రీయ పాటశాలకు, కేంద్రీయ విద్యాయాలలు (రూ.9,504 కో.), నవోదయా విద్యాయాల (రూ.5,305 కో.) లాంటి వాటి కేటాయింపులతో పోలిస్తే అతి స్వల్పమని చెప్పవచ్చు. అత్యధికవిద్యార్థుల సంఖ్య కలిగిన పాటశాలలకు నిధుల కేటాయింపులు తగినన్ని లేకపోవడం వల్ల నష్టపోయేది గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులే.
నూతన విద్యా విధానం 2019 డ్రాఫ్ట్ ప్రకారం, సెకండరీ స్కూళ్ళలో ఎక్కువమంది విద్యార్థులు మధ్యలో చదువు వదిలేస్తున్నారని, దానికి కారణం ఆ స్కూళ్ళు వారికి అందుబాటులో లేకపోవడనమని తెలుస్తున్నది. అలాంటప్పుడు వాటికి నిధులు పెంచకుండా, కేవలం అత్యల్ప సంఖ్యాకులకు అందుబాటులో వుండే కేంద్ర సంస్థలపై ప్రేమ చూపడం అహేతుకం.
అంతేకాదు, రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో వుండే, 445 విశ్వవిద్యాలయాలకు, 9200 రాష్ట్ర కాలేజీలకు ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్ష అభియాన్, ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షప్రోత్సాహన్ యోజన ద్వారా అందించే నిధులు కేవలం రూ.3,360 కోట్లుగా వుంది. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య వనరుల లభ్యత అంతరం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇది ఫెడరల్ వ్యవస్థ ను దెబ్బతీయడమే.
ఇక పేదవిద్యార్థులను చదువుకొనేందుకు ప్రోత్సహించే ఉపకార వేతనాలకు కేటాయించిన నిధులతో పరిసీలిస్తే, మనకు ఈ ప్రభుత్వపు మైనారిటీ, గిరిజన వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది.
మైనారిటీలకు ఉపకార వేతనాలు (రూ.కోట్లలో)
పథకం | బడ్జెట్ 2021-22 అంచనా | బడ్జెట్ 2022- 23 అంచనా | బడ్జెట్ 2023- 24 అంచనా | బడ్జెట్ 2024- 25 అంచనా | బడ్జెట్ 2025- 26 అంచనా | తేడా% |
పూర్వ మెట్రిక్ విద్యార్థులకు | 1378 | 1425 | 433 | 326.16 | 195.70 | -40 |
మెట్రి అనంతర విద్యార్థులకు | 468 | 515 | 1,065 | 1.145.38 | 413.99 | -63.85 |
ప్రోఫెషనల్, సాంకేతిక విద్యార్థులకు | 325 | 365 | 44 | 33.80 | 7.34. | -78 |
మదరసాలలకు | 174 | 160 | 10 | 2 | 0.01 | -99.5 |
పై కేటాయింపుల పరిశీలిస్తే మైనార్టీల పట్ల బిజె పి ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంది.
ఇక, ఎస్ టి విద్యార్థుల ఉపకారవేతనాల చూద్దాం
పథకం | బడ్జెట్ 2023- 24 అంచనా | బడ్జెట్ 2024- 25 అంచనా | బడ్జెట్ బడ్జెట్ 2025- 26 | తేడా% | ||
ఎస్ టి విద్యార్థులకు ఉన్నత విద్య | 145 | 165 | 0.02 | -99 | ||
విదేశీ విద్యకై | 4 | 6 | 0.01 | -99 | ||
ఏకలవ్య మోడల్ స్కూళ్ళు | 5.943 | 6.399 | 7.088 | 10 | ||
మెట్రిక్ పూర్వ | 411.63 | 440.36 | 313.79 | 28 | ||
మెట్రిక్ తర్వాత | 1,970.77 | 2,432.68 | 2,462.68 | 1.2 | ||
గిరిజన పరిశోధన సంస్థలకు | 118.64 | 111 | 111 | -0- | ||
గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు అనర్హులనుకున్నారేమో కమలనాథులు ఆయా రంగాలకు కేటాయింపులు పూర్తిగా తగ్గించారు. అవును, మరి గిరిజనులు నివసించాల్సింది అడవుల్లోనే కదా! అయినా, అక్కడైనా వారిని ప్రశాంతంగా బతకనివ్వడం లేదుగా! కార్పోరెట్ల ఖనిజాల దోపిడీకి కై వారిని అడవులనుండీ తరిమేస్తున్నారు.
ఎస్ సి,ఓబిసి లకు ఉపకార వేతనాలు ( కోట్ల రూలలో )
పథకం | 2023-24 అంచనా | 2024-5అంచనా | 2025-26 అంచనా | తేడా % |
ఎస్సీల మెట్రిక్ అనంతర | 6,359.14 | 6,349.98 | 6,360 | 0.5 |
ఓబీసీ, ఇబిసి, డిఎన్ టిల మెట్రిక్ అనంతర | 1,087 | 921 | 1,250 | 35 |
ఎస్సీల, ఇతరుల మెట్రిక్ పూర్వ | 500 | 500 | 577.96 | 15.59 |
ఓబీసీ, ఇబిసి, డిఎన్ టిల మెట్రిక్ పూర్వ | 281 | 210 | 300 | 30 |
ఎస్సీల జాతీయ ఫెలోషిప్ | 163 | 188 | 212 | 12.76 |
ఓబిసి ల జాతీయ ఫెలోషిప్ | 57 | 55 | 190.13 | 245 |
ఎస్సిల విదేశీ విద్య | 50 | 95 | 130 | 36.84 |
పై వివరాలను పరిశీలిస్తే మోడీ ప్రభుత్వపు ‘‘సబ్ కా సాత్ , సబ్ కా వికాష్ ’’ మైనారిటీలకు, , ఆదివాసీలకు చోటులేదని స్పష్టమవుతుంది. ఎస్ టి విద్యార్థుల జాతీయ ఫెలోషిప్, ఉన్నత విద్యకు ఉపకార వేతనాలు 99 % కోతబడ్డాయి. ఇక మైనారిటీల విషయానికొస్తే మెట్రక్ పూర్వ, మెట్రిక్ అనంతర ఉపకార వేతనాలు వరుసగా 40%, 63.8% తగ్గించారు. మోడీ ప్రభుత్వ ఓటు బ్యాంక్ విధానాల్లో భాగంగా జనాభాలో అధిక శాతం వుండే ఓబీసీ, ఇబిసి ల ఉపకార వేతనాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది.
సాక్షం అంగన్ వాడి-,పోషణ్-2:
తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్, పోషణ్-2 కు “పోషకాహార ఖర్చు నిబంధనలు పెంచుతామని” చేసిన ప్రకటన మోసపూరితమయినదని అఖిల భారత అంగన్వాడి వర్కర్స్, సహాయకుల ఫెడరేషన్ తీవ్రంగా మండిపడింది. గత బడ్జెట్( సవరించిన) లో ఈ పథకానికి రూ.21,809.64కోట్ల నుండి ఈ బడ్జెట్ లో కేటాయింపులు రూ. 21,960 కోట్లకు పెంచారు. గత బడ్జెట్ కేటాయింపులపై కేవలం 3.6% పెంపు. సప్లమెంటరీ పోషకాహారానికి కేటాయించే నిధులు 2017 నుండి పెంచకపోవడంతో, (ఈ పథకం కింద ప్రతి ఏటా లబ్ది పొందే 8 కోట్ల మంది శిశువులు, 2 కోట్ల మంది గర్భిణులు) ఈ బడ్జెట్ లో పెంపు ప్రతి శిశువుకు కేటాయించింది కేవలం 5 పైసలు మాత్రమె. దీన్ని ప్రభుత్వ గణాంకాలు- మన పిల్లలో (0-6) 2.7 కో.మంది ఎదగని వారు, 17% మంది వయసుకు తగ్గ బరువు లేని వారు ఉన్నారనే వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే ఈ ప్రభుత్వం పేదల పట్ల ఎంత నిర్దయగా వుందో తెలుస్తుంది.
ఇక అంగన్వాడి పనివారాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే వున్నట్లు వుంది. దాదాపు 26 లక్షల అంగన్వాడి వర్కర్స్, సహాయకుల జీతాలు 2018 నుండి పెరగక పోవడం గమనార్హం. వారు అంగన్వాడి పనివారలు నెలకు రూ.,4500/వేతనంతో, సహాయకులు రూ.2,250/ వేతనం తోనూ జీవితం గడుపుతున్నారంటే, సభ్య సమాజం సిగ్గు పడాల్సిందే, ఈ ప్రభుత్వం, వారికి జీతాల పెంచాలని, గ్రాట్యువిటీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయక పోవడం వారి పట్ల పాలకుల దుర్మార్గమైన వైఖరి వెల్లడవుతున్నది.
వ్యవసాయ రంగం:
వ్యవసాయం పట్ల కేంద్రప్రభుత్వ వైఖరి ఎంత సహేతుకం అయినదో, అసంబద్ధమైనదో ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వేనే స్పష్టం చేస్తుంది.
సాధారణంగా ఒక దేశం ఆర్థికంగా పురోగతి పథంలో ఉన్నదంటే, దాని ఆర్థికాభివృద్ధి ప్రాథమిక (వ్యవసాయ, దాని అనుబంధ) రంగం నుండి ద్వితీయ (పారిశ్రామిక) రంగానికి, ఆ తర్వాత సేవారంగానికి పురోగమించాలని ఆర్ధిక వేత్తలంటారు. కానీ, ప్రభుత్వం విడుదలజేసిన ఆర్ధిక సర్వే ప్రకారమే ఎన్ డి ఎ-2, ఎన్ డి ఎ-3 ప్రభుత్వాలు ప్రజలను వ్యవసాయ రంగం నుండి, పారిశ్రామిక, సేవారంగాని బదిలీ చేయడంలో వైఫల్యం చెందాయి. 2017-18 లో వ్యవసాయరంగంలో 44.1% మంది ప్రజలు ఉపాధి పొందగా, అది 2023-24 నాటికి 46.1% పెరిగింది. అంటే ప్రజలు ఎక్కువుగా తమ ఉపాధికి వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారన్నమాట. అదేకాలంలో ప్రజలకు ఉపాధి కల్పించడంలో పారిశ్రామిక,సేవారంగాల పాత్ర వరుసగా 0.7%, 1.4% తగ్గింది. మహిళల వ్యవసాయ రంగ ఉపాధి 2017-18 లో 73.2% కాగా, 2023-24 లో వ్యవసాయరంగంలో పనిజేసే మహిళల సంఖ్య76.9% కి పెరిగింది. అదే సమయంలో ఈ రంగం, దేశ జిడిపిలో కేవలం 16% మాత్రమె వుండటం గమనార్హం. దేశంలోని మెజారిటీ ప్రజలకు ఉపాధి కల్పించే రంగం ఆర్థికంగా దేశాభివృద్ధికి దోహదం చేయడంలో వెనుకబడింది . వ్యవసాయ రంగంలో మిగులు ఉంటేనే, పారిశ్రామికరంగ అభివృద్ధికి దారి తీస్తుంది. అలాంటి వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడటం దుర్మార్గమైన చర్య అని చెప్పవచ్చు.
మన దేశంలో ఇప్పటికీ మెజారిటీ ప్రజలకు జీవనోపాధి కల్పించేది వ్యవసాయరంగమే. ఈ బడ్జెట్ లో కొట్టవచ్చినట్టు కనపడేది- గత మూడు సంవత్సరాలకు పైగా దేశ రైతాంగం కనీస మద్దతు ధరకై, స్వామినాథన్ కమిటీ నివేదిక అమలుకై ఉద్యమిస్తున్నా, దాన్ని గురించిన ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగ ప్రాధాన్యత తాము గుర్తించినట్టు చిలకపలుకులు పలికినా, వ్యవసాయ రంగం, “ఆర్ధిక రంగానికి మొదటి చోదక శక్తి” అంటూనే కేటాయింపుల విషయంలో పూర్తిగా ఆ రంగాన్ని విస్మరించింది. బడ్జెట్ కేటాయింపుల విశ్లేషిస్తూ, రైతాంగ ఉద్యమానికి నాయకత్వ వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా, ఈ ప్రభుత్వ విధానాల వల్ల కార్పోరెట్ల సంపద కేవలం ఒక సం.(2022-23, 2023-24) లోనే రూ.10,88,000 కోట్ల నుండి రూ. 14,11,000 కోట్లకు పెరిగిందంటూ, అదే సమయంలో రైతులకు స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేసేందుకు మాత్రం ప్రభుత్వం తనకు ఆర్థికంగా సాధ్యం కాదంటుందని , ప్రభుత్వ వర్గ స్వభావాన్ని తెలియజేసారు. గతరెండు సంవత్సరాలలో షెడ్యూల్డ్ బ్యాంకులు కార్పోరేట్లకు వరుసగా రూ.2,09,118కోట్లు, రూ. 1,70,000 కోట్ల ను మాఫీ చేసారని, అయితే అదే కాలంలో అప్పులు చెల్లించలేక రోజూ 31 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రైతు నాయకులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
బడ్జెట్ ను పరిశీలిస్తే వ్యవసాయ, సంబంధిత రంగాలకు కేటాయింపులు, గత బడ్జెట్(సవరించిన) కన్నా రూ .5,042 కోట్లు తగ్గాయి (రూ.3,76,720కోట్ల నుండి రూ.3,71,687కోట్లకు ). ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన పథకానికి 2024-25 బడ్జెట్ లో రూ.16 వేల కో. కేటాయించారు. దాన్ని 2025-26 బడ్జెట్ లో రూ. 12,242.27 కోట్ల కు కుదించారు
వ్యవసాయ ఉత్పత్తులకు దోహదం జేసే ఎరువుల సబ్సిడీని రూ.3411.30 కో.(రూ.171298.5కోట్ల నుండి రూ.16788.20 కోట్ల కు ) తగ్గించారు. ఇక ఎంతో గొప్పగా చెప్పుకున్న కాయధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహమిచ్చే ఆత్మనిర్భారత మిషన్ కు కేటాయించింది కేవలం రూ.1,000 కో.మాత్రమె,అదేసమయంలో కందిపప్పు దిగుమతులపై సుంకాన్ని తగ్గించి మొజాంబిక్ మరియు ఇతరదేశాల రైతాంగానికి ప్రోత్సాహమిస్తూ ప్రకటన చేయడం మన ప్రభుత్వపు ఘనకార్యం.2024 జనవరి-నవంబర్ మధ్యకాలంలో పప్పు ధాన్యాల దిగుమతులు రెండింతలు కావడం గమనార్హమని అఖిలభారత సీసాను సభ అధ్యక్షులు అశోక్ ధవాలే అభిప్రాయ పడుతారు.
ఉపాధికల్పన:
సామాన్య ప్రజల , మహిళా సంక్షేమం గురించి ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్ననూ, నిధుల కేటాయింపులలో మాత్రం ఆ ఉదారత, ముఖ్యంగా, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకుంటే, కనిపించదు. 2024-25 బడ్జెట్ తో పోలిస్తే సంక్షేమ రంగాలకు కేటాయింపులు జిడిపి లో 14.55% నుండి 14.18% తగ్గాయి. మహిళలకే మొత్తం బడ్జెట్ లో 8.8%, జిడిపి లో 1.61% నిధులు కేటాయిస్తారని ఆశిస్తే , మహిళా బడ్జెట్-పార్ట్ (వంద శాతం మహిళలకే కేటాయింపులు)లో మొత్తం బడ్జెట్లో కేటాయించింది 2% మాత్రమె. ఇక ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకానికి గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే, ఈసారి రూ.2250 కో.తగ్గాయి. మనం ద్రవ్యోల్భానాన్ని పరిగణలోనికి తీసుకుంటే, పేద ప్రజల కడుపు ఈ ప్రభుత్వం ఎలా కొడుతున్నదో మరింత అర్థమవుతుంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనందించడం ద్వారా, ప్రజల ఉపాధి అవకాశాలు పెంచుతామని ఆర్ధిక శాఖా మంత్రి చెప్పినా, వాస్తవంలో ఆ పరిశ్రమలకు కేటాయింపులు పెరగలేదు. గత కొన్ని సం.లలో 40% సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడటం ఆమె గమనంలోకి తీసుకోకపోవడం విచారకరం, ద్రవ్య లోటును ఇంచుమించు గత సం. స్థాయిలో ఉంచడానికి కారణం ప్రపంచ వ్యాప్త ద్రవ్య పెట్టుబడి సంస్థల సంతృప్తి పరిచేందుకేనని చెప్పవచ్చు.కేవలం వేతనజీవుల సంతృప్తి (డిల్లీ ఎన్నికల్లో వారి వోట్లకు గాలం) పన్ను రాయితీలతో మార్కెట్ డిమాండ్ పెరుగుతుందనుకోవడం భ్రమనే. ఒకవేళ పెరిగినా, అది విలాససరుకుల, కార్లు లాంటి వాటి అమ్మకాలు పెరుతాయి. వాటివల్ల లబ్ది పొండేది కార్పోరేట్ కంపెనీలే. ఇవి ప్రధానంగా పెట్టుబడి కేంద్ర కర్మాగారాలుగా వుండటంతో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరిగేదేమీ వుండదు.సాధారణ కార్మికుల వేతనాలకు,సంక్షేమానికి నిధుల కేటాయింపులు అవసరమైన స్థాయిలో పెంచకపోవడంతో వారి కొనుగోలు శక్తి పడిపోతుంది. బ్లూమ్ వెంచర్ అనే సంస్థ చేసిన ప్రకారం దేశంలోని 140 కోట్ల జనాభాలో, దాదాపు వందకోట్ల ప్రజల ఆదాయం వారి నిత్యావసర వస్తువువుల కొనుగోలుకే సరిపోతున్నదని, ఇక మరో 30 కోట్ల మంది ఆహారేతర వస్తువులు చౌకధరవి కొనగలిగే స్థితిలో వున్నారని తెలుస్తున్నది.మూడు సం.,క్రితం సామాన్య ప్రజలు కొనగలిగే గృహాలు 40% వుండగా, ఇప్పుడవి కేవలం కేవలం 18% గా వున్నాయని తెలుస్తుంది. అందువల్ల, చిన్న, చిన్న ఉత్పత్తిదారుల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. అవి మూతపడటం ద్వారా సాధారణ కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఈ ఎత్తుగడల వల్ల తెల్ల చొక్కా కార్మికులు మిగతా కార్మికులకు మరింత దూరమవుతారు. బడా పారిశ్రామికవేత్తలు సంతృప్తి చెందుతారని ప్రభాత్ పట్నాయక్ లాంటి ఆర్థికవేత్తల అభిప్రాయం. చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారడం ఖాయం. అందువల్ల నష్టపోయేది సామాన్య జనమే. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధీర్గకాలిక సంఘటిత ఉద్యమాల