రాత్రి చెందురుడు  
మా పల్లె మీద రాబందులు
వాళ్ళకుండా డేగ కండ్లతో
కాపు కాస్తున్నవాళ్ళు..!

పూరి గుడిసెల వాడల్లో
నిట్టాడుగా నిలిచిన చోట
అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన
పసికూన కూతకు
తుఫాకి మోన పెట్టి కాల్చాలని కలగన్న ఈ దోపిడీ రాజ్యాన్ని ధిక్కరించే
తెగువై
కాచిన కందిలి వెలుగులు వాళ్ళు..!!

అడవి కాచిన వెన్నెల
సంద్రాలను ఈదుతూ
సెలయేరు పాయలుగా పారుతూ
కొండలు, కోనలను తడుముతూ
సకల జీవరాశులను ఓల్లో ఒంపుకుంటూ
చుక్కాని అయిన వాళ్ళు
ఈ దేశ పీడిత ప్రజలకు సెంట్రియే...!

దిక్కు తెలియని వాళ్ళకు దిక్కై
నలుదిక్కుల న్యాయముకై
విముక్తి నావనెంచి సాగుతున్న వాళ్ళకు
పోరు సమరంలో వాళ్లో స్నేహితులు
వాళ్లో సహోదరులు
వాళ్లే మన చెలిమి
వాళ్లే ఈ పీడిత ప్రజల సెంట్రీ....!!

(వర్గ పోరులో అమరులైన వారికోసం....)

Leave a Reply