మహావృక్షాలుగా ఎదిగి
తరాలకు నీడనిచ్చిన
మా పూర్వీకులను కుప్పగూల్చి
సమాధుల్లో పూడ్చిపెట్టారు
ఆ పక్కనే
వాళ్ల జ్ఞాపకాలనీ, చరిత్రలనీ బొంద పెట్టారు

ఎంతైనా వృక్ష ప్రేమికులు కదా
ఒక్కొక్క సమాధి మీద
ఒక్కొక్క చెట్టును పెంచారు

అవి ఇప్పుడు వనాలైనవి
రంగురంగుల వనాలు
ఇంద్రధనస్సులో ఊహలు

ఆ చెట్ల నీడన
వాళ్లు కబుర్లు చెబుతూ
తమ పూర్వీకుల
విజయ గాథల్ని నెమరేస్తూ
వింత మైకంతో
యమహా సిస్టంకు
అనుగుణంగా డాన్స్ చేస్తూ
పిచ్చి కేకలు వేస్తుంటారు
"Fuck you Palestine "

కాళ్ళ కింద కంకాళాలు
అస్థిరంగా కదులుతుంటాయి
*
అనువాదం: ఉదయమిత్ర

Leave a Reply