పీడిత ప్రజలకు కలలు కూడా ఉండకపోవచ్చు. వాళ్లు అనుభవిస్తున్న అమానవీయమైన అణిచివేత, హింస, దోపిడీ నుంచి వాళ్లకు కన్నీళ్లు కార్చే సమయమూ, అవకాశమూ ఉండకపోవచ్చు. దోపిడీ సమాజం ఆ ప్రజల దేహాలను, మనసులను పిండి పిప్పి చేస్తుంటే వాళ్ల నెత్తురు చెమటయి కారడమో, చిత్రహింసలతో నెత్తురై కారడమో తప్ప ఎండిపోయిన కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారే అవకాశం లేకపోవచ్చు. గొంతులో తడి మిగిలితే కదా గాద్గదికంగా దుఃఖించడానికి.

కానీ ఇవ్వాల్టి సమస్య కాదు. స్పార్టకస్‍ కాలానికి పీడితులైన, దోపిడీకి గురైన బానిసలకు మొదటిసారి తాము బానిసలుగా చూడబడుతున్న మనుషులమని తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం కన్నా ముందు ఎందరు బానిసలు ఇప్పుడు ఆపరేషన్‍ బ్లాక్‍ ఫారెస్ట్ లో ఆదివాసులు ఎట్లా రాలిపోతున్నారో అంతకు వందల వేల రెట్లు బలి అయిపోయారు.

స్పార్టకస్‍తో పాటు ఉరికొయ్యలకు వేలాడదీసిన ఎందరో బానిసలను చూపి వరినీయాను ఇదిగో నీ స్పార్టకస్‍కు, ఆయన రెచ్చగొట్టిన బానిసలకు ఇదే గతి పడుతుందన్నాడు శత్రువు. కానీ స్పార్టకస్‍ (లు) నేలలో చిందించిన ప్రతి నెత్తురు బొట్టు నుంచి వేనవేల స్పార్టకస్‍లు పుట్టుకొచ్చి ఈ బానిస వ్యవస్థను రద్దు చేస్తారంటుంది వరినియా.

హోవర్డ్ ఫాస్ట్ పుస్తకం నుంచి స్పార్టకస్‍ పుట్టలేదు. స్పార్టకస్‍ పోరాటం నుంచి త్యాగం నుంచి ఒక చారిత్రక నవల పుట్టడం అనేది రెండవ ప్రపంచ యుద్ధ కాలపు ప్రజా విజయ ఆవిష్కరణ కావచ్చు. కానీ యూరప్‍ లో బానిస వ్యవస్థ రద్దు కావడం మాత్రమే కాదు మొదటి ప్రపంచ యుద్ధకాలానికే ఒక శ్రామిక వర్గ బోల్షివిక్‍ విప్లవం విజయవంతమై 1917 నుంచి నవంబర్‍ 7 కనీసం 36 ఏళ్ళు ఒక సామ్యవాద సమాజ స్వప్నాన్ని వాస్తవం చేసుకున్నారు.

అవును ఒకటే కల. మనిషికి ఒకటే విలువ. యజమాని – బానిస అని తేడాలేని విలువ, పాలకులు, పాలితులు లేని విలువ, అది లక్ష్యం. ఆ లక్ష్యంతో ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలి సెట్‍బ్యాక్‍ కు గురైనా మళ్లీ లేచి నిలిచే మళ్లీ ఏటికి ఎదురీదే ఆజాదీ ఆకాంక్ష అది స్పార్టకస్‍ తోనే ప్రారంభమైన వర్గ పోరాట కాంక్ష. స్పార్టకస్‍ తాను తనతో పాటు యాజమాన్య వ్యవస్థకు సేవలు చేస్తున్న బానిసలు మనుషులని గుర్తించి పోరాటం చేయడం సమాజంలో వర్గ పోరాటమనే ఒక కలను కాదు ఒక ఆకాంక్షను, ఒక లక్ష్యాన్ని పీడిత ప్రజల ఎజెండా మీదికి తెస్తుందని స్పార్టకస్‍ ఊహించకపోవచ్చు. మార్కస్ గతితార్కిక చారిత్రక భౌతికవాద ద•ష్టితో ప్రతిపాదించాడు.

లెనిన్‍ కలలు కనడమే విప్లవం అన్నాడు. అవును అది ఒక చోట మొదలై ఒక కలగా మొదలై ప్రపంచ మానవాళి అంతా కనే కలగా, ఎన్నో కలల సమాహారమైన విప్లవం ఇప్పుడు నక్సల్బరీ వసంతకాలం నుంచి కొనసాగుతున్నది.

సమాజానికి యాంత్రికంగా ప్రక•తి సూత్రాలు వర్తించకపోవచ్చు. సరళ రేఖలు గాను సాగకపోవచ్చు. కానీ ఒక పారిస్‍ కమ్యూన్‍ ప్రయోగం ఒక బోల్షివిక్‍ విప్లవ కాలానికి ఒక సామ్యవాద ఆచరణగా మారినట్లు, ఒక నక్సల్బరీ, ఒక శ్రీకాకుళం ఇవ్వాళ దేశంలో ఎన్నో ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య ఆచరణలకు తమ సెట్‍ బ్యాక్‍ల నుంచి దారి చూపినవి.

శ్రీకాకుళం సెట్‍ బ్యాక్‍ అయిన కాలంలో ఆ జిల్లా నుంచి వరంగల్‍ రీజినల్‍ ఇంజినీరింగ్‍ కాలేజీలో చేరిన నంబాల కేశవరావు ఒకే కల మాత్రమే కనలేదు. ఒకే లక్ష్యంతో ఏబై మూడేళ్లుగా పోరాడి అమరుడయ్యాడు. అమరత్వం రమణీయం, కవిత్వమో  సైద్ధాంతిక కాల్పనికతయో పదిమందిలో చావు పండుగ అని ప్రజలు కామన్‍ సెన్స్ తో చెప్పుకునే మాట పదిమంది మంచి కోసం చేసే ఎంతటి త్యాగమైనా వ•ధా కాదు. అని రుజువు కాలేదా.

నంబాళ కేశవరావుకు రీజనల్‍ ఇంజినీరింగ్‍ కాలేజీలో తాము ఎదుర్కొన్న సమస్యలు ఇవ్వాల్టికి విషవ•క్షమైన బ్రాహ్మణీయ ఫాసిజం విత్తనాల క్యాంపస్‍ మెస్‍లో మెస్‍ వర్కర్లతో కలిసి పని చేస్తున్నప్పుడే ఏబివిపి విద్యార్థులను ఎదుర్కోవడం దగ్గర అర్థమైంది. ఇటు క్యాంపస్‍లో జ్ఞానం శీలం ఏకత పేరుతో ఎంత పుక్కిటి పురాణాల అజ్ఞానం, ఎంత పిత•స్వామ్య భావజాలం, ఎంత ఇతరులుగా చూసే నిచ్చెన మెట్ల ఆధిపత్య అనైక్యత ఆచరణ ప్రచారం జరుగుతున్నదో అర్థమైంది. తెలంగాణలోని అగ్రకుల భూస్వాముల పిల్లలే కాదు, బీహార్‍ లోని భూమిహార్ల పిల్లలు, అది గ్రామీణ భూస్వామ్య అధిపత్యాన్ని టెక్నాలజీ, ఇంజినీరింగ్‍ చదువుకునే విద్యాలయంలో అమలు చేయాలని చూసినప్పుడు దానికి స్థానిక మంత్రులు, రాజకీయ నాయకులు మొత్తం రాజ్యాంగ యంత్రం అండగా నిలిచినప్పుడు ప్రతిఘటించిన నేపథ్యం నుంచి రూపొందిన వాళ్లే సూరపనేని జనార్ధన్‍, చెరుకూరి రాజకుమార్‍, నంబాళ కేశవరావులు – క్యాంపస్‍లో తప్పించుకున్న బీహార్‍ భూమి హార్‍ వంశపు ఎబివిపి గుండాను వరంగల్‍లోని మార్కెట్‍ యార్డులో శిక్షించిన వరంగల్‍ రీజినల్‍ ఇంజనీరింగ్‍ కాలేజీ విద్యార్థుల్లో జీవించి ఉన్నవాళ్లు ఇవాళ ఎక్కడ ఏ వ్యాపకాల్లో ఉన్నా ఆ రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు.

వాళ్లు ఒక మాట రాసారు. మాకు ఆయన క్లాస్‍ రూమ్‍లో నాయకుడు. కబడ్డీ గ్రౌండ్‍ లో క్యాప్టెన్‍. అయితే సెలవులొచ్చాయంటే ఆలస్యం శ్రీకాకుళానికి పోతే సెలవుల్లో వ్యవసాయ పనులు చూసుకోవడానికి పోతున్నాడేమో అనుకున్నాం అన్నారు.

ఆయన ఈ ఎబివిపి మీద సాంస్క•తికంగా బావజాలపరంగా, భౌతికంగా కూడ చేస్తున్న దాడులను విడిగా చూడలేదు. ఈ అన్నింటినీ వ్యవసాయ విప్లవంలో భాగంగా చూసాడు. అందుకే తొలినాళ్లలోనే ఒక నిర్బంధాన్ని తాను కబడ్డీ పట్టునుంచి తప్పించుకున్నట్లుగా తప్పించుకున్నాడు. ఒక నిర్బంధంలో జైలుకుపోతే బెయిల్‍ తెచ్చిన తండ్రి సోదరులు ఇక ఘర్షణలు వద్దు, బి.టెక్‍ అయిపోయింది కదా ఇక ఇక్కడే చదువమంటే ఇక ఇంటి వైపు చూడనని నిర్ణయించుకున్నాడు. నా వంతుకు వచ్చే భూమి ఇస్తే పేదలకు పంచి పోతానన్నాడు. అజ్ఞాతంలోకి వెళ్లే ముందు అది భూ సంబంధాల అధ్యయనానికి, గ్రామాలకు తరలివెళ్లే మమేకత్వానికి, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్వార్‍ ఇచ్చిన పిలుపుమేరకు తూర్పు డివిజన్‍ విప్లవోద్యమ నిర్మాణానికి, ఇంక ఆ ప్రస్థానం ప్రపంచంలోనే 140 కోట్ల ప్రజలున్న అతి పెద్ద దేశంలో 2014 నాటికి – అంటే గ్లోబలైజేషన్‍లో ఇండియా భాగమయ్యేనాటికి – మావోయిస్టు పార్టీ, మావోయిజం దేశ భద్రతకు అంతర్గత ప్రమాదమే పెను ప్రమాదమని ప్రభుత్వాదినేత గాబరాపడి ప్రకటించిన కాలానికి ఆయన కోట్లాది మంది పీడిత, పోరాట ప్రజల పార్టీ అయిన మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు.

ఆయన అమరత్వం సందర్భంగా శతృవు సహజంగానే స్థానికంగానే ఒక దళం చేసిన చర్య మొదలుకొని, కేంద్ర కమిటీ వ్యూహంలో భాగంగా జరిగిన చర్యల వరకు ఆయనే నాయకత్వం వహించాడని చెప్తున్నాడు. బహుశా దేవవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని కోర్టులలో ఆమేరకు ఎఫ్‍.ఐ.ఆర్‍.లు నమోదయి ఉంటాయి. కాని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు శ్యాం, మహేశ్‍, మురళిలు అమరులైన తొలి సంస్మరణ సంవత్సరంలో పార్టీతో  పాటు ప్రత్యేకంగా నిర్మాణం చేయదలుచుకున్న 2000లో పీపుల్స్గెరిల్లా ఆర్మీ 2004లో నిర్మాణం చేసిన పీపుల్స్ లిబరేషన్‍ గెరిల్లా ఆర్మీ ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి ఆయన కమాండర్‍ ఇన్‍ చీఫ్‍ అయ్యాడు. నిజానికి ఆ ముగ్గురు కేంద్ర కమిటీ నాయకులు బతికుండగానే 1995లోనే పీపుల్స్వార్‍ స్పెషల్‍ కాన్ఫరెన్స్లో ప్రత్యామ్నాయ ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామ రాజ్య కమిటీలు (జనతన సర్కార్‍ తొలి రూపాలు) ఏర్పాటుచేసి జల్‍ జంగల్‍ జమీన్‍ల స్వాధీనంతో పాటు ప్రాథమిక అవసరాలు, ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికీ అందే ప్రణాళికతో పాటు ఈ గ్రామ రాజ్యాలను కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాల రూపంలో తొలి ప్రజా గెరిల్లా దళాల నిర్మాణం ప్రతిపాదన వచ్చినప్పటినుంచీ దండకారణ్యం, ఝార్ఖండ్‍ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ నిర్మాణం ఉన్న ప్రతి రాష్ట్రానికి ఆయనే స్వయంగా వెళ్లి ప్రజా గెరిల్లా సైన్యానికైనా, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికైనా ఆయనే స్వయంగా శిక్షణ ఇచ్చాడు.

మావోయిస్టు పార్టీని కార్పొరేటీకరణకు అంతర్గత శత్రువు అనుకొని అంతం చేయడానికి పార్టీ విముక్తి ప్రాంతానికి కేంద్రమయ్యే అవసరం ఉన్న దండకారణ్యంలో అభియాన్‍లన్నీ విఫలమై రమణసింగ్‍ బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష కాంగ్రెస్‍ నాయకుడు మహేంద్రకర్మ ఆదివాసి సమాజాన్ని చీల్చి సల్వాజుడుం తయారుచేశాడు. అది ప్రజాస్వామిక, న్యాయ పోరాటాల వల్ల రద్దయ్యేనాటికి 2009 నుంచి గ్రీన్‍హంట్‍ ఆపరేషన్‍ ప్రజల మీద ప్రభుత్వ యుద్ధంగా ప్రారంభమైంది. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా ఛత్తీస్‍గఢ్‍లో ఏ ప్రభుత్వం ఉన్నా దానితో నిమిత్తం లేకుండా సూరజ్‍ కుండ్‍ వ్యూహంలో భాగంగా స్వయంగా అమిత్‍ షా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా సైనికీకరణ వ్యూహాలు పన్నుతున్నాడు.

ఆ చరిత్ర అంతా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నదే కానీ, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం మోడీ, షాలు రూపొందించిన వ్యూహం మాత్రం చర్చించుకోవాలి.

2024లో బిజెపి ఛత్తీస్‍గఢ్‍ ప్రభుత్వం ఏర్పడగానే ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తాము మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలకు సిద్ధమే అన్నారు. కానీ కేంద్రం ముఖ్యంగా హోం మంత్రి అమిత్‍ షా మాత్రం ఎన్నికల ముందు నుంచి గడువు పెడుతూ ఇంక ఎన్నికలు అయిపోయాక ఆపరేషన్‍ కగార్‍ పేరుతో 31 మార్చి 2026 మావోయిస్టు రహిత భారత్‍ అన్నాడు. మొదట మాడ్‍లో పెద్ద సైనిక బేస్‍ క్యాంపు నిర్మాణానికి వేల హెక్టార్ల స్థలాన్ని కేటాయించి అది లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించాడు గానీ ఆపరేషన్‍ కర్రెగుట్టల దాకా అనారోగ్యంతో ఉన్న చలపతి వంటి కేంద్ర కమిటీ సభ్యుల్ని తప్ప పార్టీ నాయకత్వాన్ని నష్టం చేయలేకపోయాడు. హరి భూషణ్‍, ఆర్‍.కె., ఆనంద్‍ అనారోగ్యంతో జరిగిన పార్టీ నష్టంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కనుక 2024 జనవరి తల్లి ఒడిలోని పాపను చంపిన దగ్గర్నుంచి ఆదివాసుల మారణకాండ మీద పడ్డాడు. కార్పొరేటీకరణ అంతిమ అవసరం అదే. ఆదివాసి రహిత బస్తర్‍ అంతకుముందు మావోయిస్టు రహిత సాధ్యంకాకపోతే ఆదివాసి వలస, ఆదివాసి హననం కూడా అవసరమే కదా, కానీ నీటిలో చేపలను పట్టందే, నీళ్లు తోడడం అంత సులభం కాదనుకున్నాడు. ఇంకా హిడ్మా లక్ష్యమని తెలంగాణ నాయకత్వం లక్ష్యమన్నాడు. ఆపరేషన్‍ కర్రిగుట్టలన్నాడు. ఏప్రిల్‍ 21 నుంచి మే 21 దాకా దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో భారత విప్లవోద్యమం పట్ల ఆశావాహ ద•ష్టితో చూస్తున్న అందరి ద•ష్టి కర్రెగుట్టల మీదికి మళ్లించాడు. ఇక్కడ హిడ్మా, కేంద్ర కమిటీ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం ఉందన్నాడు. అయితే 31 మందిని చంపగలగడం, అనారోగ్యంతో ఉన్న రేణుకను పట్టుకుపోయి చంపడం తప్ప హిడ్మా కాదు కదా ఒక్క కేంద్ర కమిటీ సభ్యుడు కూడా చిక్కలేదు. ఇదొక్క విషయం మనం గమనించాలి. రెండవది సిఆర్‍పిఎఫ్‍ నాయకత్వమైనా ఈ నెల రోజుల ఆపరేషన్‍ చొరవంతా డిఆర్‍జి, బస్తర్‍ ఫైటర్స్, ఎస్‍టిఎఫ్‍ ముగ్గురు గ్రేహౌండ్స్ చనిపోయి బయట పడిన విషయం వల్ల – వాళ్లూ ఉన్నారు. అంటే మావోయిస్టుల స్థావరాలు ఆనుపానులు తెలిసి క్రూరంగా వ్యవహరించే వారిపై కేంద్రీకరించాడు. మే 21 నాడు ఆపరేషన్‍ కగార్‍ కాదు ఆపరేషన్‍ సంకల్ప్ కూడా లేదన్నాడు. రొటీన్‍ గాలింపులే అన్నాడు. బలగాలు వెనక్కి పోతున్నాయన్నాడు. ఇక్కడికి రాష్ట్ర పాత్ర ప్రాముఖ్యం తగ్గింది. ఇక ఆపరేషన్‍ కగార్‍, సంకల్ప్ కాదు, కర్రెగుట్టలు కాదు బ్లాక్‍ ఫారెస్ట్ ఆపరేషన్‍ మోడీ కనుసన్నల్లో అమిత్‍ షా లే చేపట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటన చూడండి, అది ఆధారంగా ఇండియన్‍ ఎక్స్ ప్రెస్‍ •ష్ట్రష్ట్ర•••ఱ•స్త్ర•తీష్ట్ర, ణ=+. •జూవ•ఱ•శ్రీ •శీతీ•వ •ష్ట్ర•• •ఱశ్రీశ్రీవ• ఎ•శీఱ•• శ్రీవ••వతీ మావోయిస్టు నాయకుడిని చంపింది ఛత్తీస్‍గఢ్‍ డిఆర్‍జి, స్పెషల్‍ పోలీసు బలగాలు. ఈ నెల రోజులు నంబాళ కేశవరావు (బసవరాజ్‍) లక్ష్యంగా అమిత్‍ షా బసవరాజ్‍ సెక్యూరిటీ నుంచి సరెండర్‍ అయిన వాళ్లు ఎవరో వాళ్లు వెంటనే డిఆర్‍జి లోను, స్పెషల్‍ ఫోర్స్ లోను చేరి ఉంటారు కనుక వాళ్లకు ఆపరేషన్‍ బ్లాక్‍ ఫారెస్ట్ పేరుతో నాయకత్వాన్ని ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి పిఎల్‍జిఎ చీఫ్‍ కమాండర్‍ స్థావరాలు, అనుపానులు తెలుసుకునే పని పెట్టాడు. ఆరోగ్యం బాగు లేకపోతే చికిత్స చేయించుకునే అవకాశాలు ఉన్న సానుభూతిపరులైన వాళ్లు ఏర్పాటు చేయగల ఆసుపత్రుల మీద నిఘా పెట్టాడు. ఒరిస్సాలో ఆరోగ్యం బాగు చేయించుకుంటుంటే పట్టుకు వచ్చి చంపారు వంటి అనుమానాలు కూడా అందుకే వస్తున్నాయి.

గత మూడు దశాబ్దాలలో ప్రధాన కార్యదర్శి ఎన్‍కౌంటర్‍లో చనిపోవడం ఇది మొదటిసారి అన్నాడు అమిత్‍ షా. 30 ఎందుకు 1990 ప్రపంచీకరణ కార్పొరేటీకరణ ఆయనకు లెక్క లేకపోతే ప్రథమ ప్రధాన కార్యదర్శి 1972 జూలై 28న కలకత్తా లాల్‍బజార్‍ లాకప్‍ లో చనిపోయిన చారుమజుందార్‍ తర్వాత దాదాపు 53 ఏళ్లకు యుద్ధంలో ‘ఎన్‍కౌంటర్‍లో’ అమరుడయ్యాడు. ఒక ప్రభాకరన్‍ వలె, ఒక ఉమర్‍ ముక్త్యార్‍ వలె, ఆ రెండు జాతి విముక్తి యుద్ధాలు. కామ్రేడ్‍ బసవరాజ్‍ నంబాళ కేశవరావు అక్రమణ యుద్ధాన్ని ప్రజాయుద్ధంతో ప్రతిఘటిస్తూ ఒక మావోయిస్టు పార్టీ అనేకాదు. నక్సల్బరీ పంథాలో ఎంఎల్‍ పార్టీ ఏర్పడి, దాని మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి అయిన చారుమజుందార్‍ తప్ప – ఆ తర్వాత విడిపోయి ఏర్పడిన ఎంఎల్‍ పార్టీ ఏ నాయకుడు కూడా ఎన్‍కౌంటర్‍లో అమరుడు కాలేదు. ఇది పదకొండేళ్లుగా దేశంలో అమలవుతున్న బ్రహ్మణీయ ఫాసిజం, వేసుకున్న ప్రజాస్వామ్య ముసుగులో నీతి బాహ్యత్వాన్ని ఎంత రుజువు చేస్తున్నదో ఆ పార్టీ ఆరుసార్లు శాంతి చర్చలకు ప్రతిపాదించి దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్షాలు అన్నీ అందరూ శాంతి చర్చలు కోరుతున్న సమయంలో అమరుడు నంబాళ కేశవరావు వంటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో గానీ, ఏ స్థాయిలో గానీ యాభై ఏళ్ళుగా సుదీర్ఘకాలం అప్రతిహతంగా విప్లవంలో కొనసాగిన మడమతిప్పని విప్లవ పోరాట దీక్ష త్యాగానికి కూడా నిదర్శనం.

2004 చర్చల వంటివి కావు. ఇవి, నిజాయితీతో కూడిన శాంతి చర్చలు అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏమిటంటే అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల ఆకాంక్షతోనే (అప్పుడు ఆంధప్రదేశ్‍ కావచ్చు ఇప్పుడు బస్తర్‍ కావచ్చు మొత్తంగా మధ్యభారతంలోని ఆదివాసులు కావచ్చు) మావోయిస్టు పార్టీ ప్రజా యుద్ధం సజీవ శాంతి కొరకే కనుక శాంతి చర్చలకు సిద్ధమైంది. ప్రధాన కార్యదర్శి అమరత్వమంత మహోన్నత త్యాగమయింది.

Leave a Reply