సంభాషణ

త‌మ‌ల‌పాకు రైతుల‌పై లాఠీ

2022 జనవరి 14న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాల త‌మ‌ల‌పాకు రైతుల‌పై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుక‌ప‌డ్డాయి. వాళ్ల‌ను తోట‌ల‌కుకు వెళ్లకుండా  అడ్డంప‌డ్డాయి. అక్క‌డితో ఆగ‌లేదు. ఘోరంగా లాఠీ చార్జి చేశారు.   పైకి క‌నిపించే ఈ ఘ‌ట‌న వెనుక చాలా క‌థ ఉంది.  దాన్ని తెలుసుకోడానికి  నిజ‌నిర్ధార‌ణ‌కు దేశంలోని ప‌లు పౌర‌హ‌క్కుల సంస్థ‌లు, వేదిక‌లు 2022, జనవరి 29-30 న వెళ్లాయి. ఇందులో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO) సభ్యులు  ఏడుగురు, గణతంత్రిక్ అధికార్ సురక్ష్య‌ సంఘటన్ (GASS) సభ్యులు
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
సాహిత్యం వ్యాసాలు

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
సాహిత్యం కవిత్వం

ఆకలి జోలె

జోలెకుఅటు అతడుఇటు నేను.. మా ఇద్దరి మధ్యజోలె పెరు ఆకలి.. అల్యూమినియం బిళ్ళ కోసంఇద్దరిని దేహీ అంటూ అడిగిందిదేశ భవిష్యత్తు.. జోలెకు అటువైపు వ్యక్తి..ప్రభువు దుఃఖంతో నిండినదరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..ఇటు వైపు నేను..వస్తే ఛిద్రమైతూమనమద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను.. రాం, రహీం,జీసస్ఎవరచ్చిన అంగట్లోఅర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్నభవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?అంతటి ధైర్యం చేస్తారా..? (కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)21/01/2022
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను
సాహిత్యం కవిత్వం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా
సాహిత్యం కవిత్వం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
ఆర్థికం

కార్పొరేట్ల గుప్పిట్లోకి బ్యాంకులు

గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్టీస్‌ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో