(ర‌ష్యా విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో 1905 తిరుగుబాటు ఓట‌మి ఘోర‌మైన అనుభ‌వం. ఉద్య‌మం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఆ స‌మ‌యంలో   ప్రతికూల మేధావులు, పార్టీ మేధావుల్లో కొంద‌రు మార్క్సిజంలోని మౌలిక భావ‌న‌ల‌కు, విప్ల‌వాచ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తిరగదోడే  ప్రయత్నం చేశారు.  విప్ల‌వ పంథా త‌ప్ప‌ని ప్ర‌చారం చేశారు.  మెన్షివిక్ నాయ‌కుడైన ప్ల‌హ‌నోవ్ *వారు ఆయుధాలు ప‌ట్టుకోవ‌ల‌సింది కాదు* అన్నాడు. దానికి లెనిన్ స‌మాధానం ఇస్తూ *మ‌నం సాయుధ పోరాటాన్ని మ‌రింత దృఢంగా, శ‌క్తివంతంగా నిర్వ‌హించి ఉండ‌వ‌ల‌సింది* అన్నాడు. ఆ కాలంలో తాత్విక రంగంలో త‌లెత్తిన మార్క్సిస్టు వ్య‌తిరేక వాద‌న‌ల‌ను తిప్పి కొడుతూ లెనిన్   “భౌతికవాదం- అనుభవవాద విమర్శ” అనే గ్రంథం రాశాడు.  ర‌ష్య‌న్ విప్ల‌వంలోని ఈ  మ‌లుపు ప్ర‌పంచ విప్ల‌వాల‌కు గొప్ప అవ‌గాహ‌న‌ను అందించింది. స్థ‌ల కాలాల చారిత్ర‌క ప్ర‌త్యేక‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ దెబ్బ‌తినిపోయిన విప్ల‌వోద్య‌మాలు నేర్చ‌కోద‌గిన అనుభ‌వాలు, అవ‌గాహ‌న‌లు అందులో ఎన్నో ఉన్నాయి. ఈ కింది వ్యాస ఖండిక బోల్షివిక్ పార్టీ చ‌రిత్ర‌లోంచి – వ‌సంత‌మేఘం టీం)

గ్రామ సైనికులు, పోలీసులు, జారుప్రభుత్వ గూఢచారులు, బ్లాక్‌హండ్రెడ్ గూండాలు, కార్మికవర్గంపై సాగించిన రాక్షస దౌర్జన్యకత్యాలు  స్టోలీపిన్ అభివృద్ధి నిరోధక కాలంలో సాగాయి. కార్మికులను బాధించి, శిక్షించినది జారుప్రభుత్వ తాబేదారు లొక్కరేకాదు. ఈ విషయంలో ఫ్యాక్టరీ యజమానులు, మిల్లు యజమానులు ప్రభుత్వానికి ఏమీ తక్కువదినలేదు. పరిశ్రమలు మందకొడిగా వుండి నిరుద్యోగం హెచ్చిన సంవత్సరాలలో ముU్యంగా కార్మికవర్గంపై వీరి దాడి మరింత తీవ్రమయింది. ఫ్యాక్టరీ యజమానులు ఒక్కుమ్మడిగా, లాకౌట్లు ప్రకటించారు. సమ్మెలలో ఉత్సాహంగా పాల్గొని పనిచేసిన వర్గచైతన్యంగల కార్మికుల పేర్లతో “బ్లాక్‌లిస్టు”లను తయారు చేశారు. ఒకసారి ఆ జాబితాలో చేరిన వ్యక్తికి, ఆ ప్రత్యేక పారిశ్రామిక శాఖలో ఉత్పత్తిదార్ల సంఘానికి చెందిన ఏ కర్మాగారంలోనూ ఉద్యోగం దొరుకుతుందనే ఆశలేదు. 1908 నాటికే జీతాలు నూటికి 10 నుండి 15 వరకు కోసివేశారు. దినానికి పనిచేసే గంటల పరిమితి 10 నుండి 12 వరకు పెంచబడింది. నెత్తురుపీల్చే జరిమానాల పద్ధతి తిరిగి తలయెత్తింది. 1905 విప్లవాపజయంతో, దానితోటి ప్రయాణీకులలో నైతిక పతనమూ క్షీణతా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మే<ó²వులలో నైతిక పతన క్షీణతా ధోరణులు తలయెత్తాయి. విప్లవం ఉచ్ఛస్థాయిలో వున్న కాలంలో బూర్జువా శిబిరంనుండి వచ్చిన తోడి ప్రయాణీకులు, స్టోలీపిన్ అభివృద్ధి నిరోధక కాలంలో పార్టీని విడిచిపోయారు. వారిలో కొందరు విప్లవ శత్రుశిబిరంలో బహిరంగంగా చేరిపోయారు. మరికొందరు, అప్పటికి యింకా మిగిలియున్న బహిరంగంగా పనిచేస్తున్న కార్మికవర్గ సంఘాలలో పాతుకుపోయారు. అలాచేరి శ్రామికవర్గాన్ని విప్లవ మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నం చేశారు. శ్రామికవర్గ విప్లవ పార్టీని అపఖ్యాతిపాలు చేయసాగారు. విప్లవాన్ని వదిలి పారిపోయిన తోడిప్రయాణీకులు, అభివృద్ధి నిరోధకుల దయాదాక్షిణ్యాలను సంపాదించడానికీ, జారు ప్రభుత్వంతో ఒడంబడిక చేసుకొని బ్రతకడానికీ ప్రయత్నించారు.

విప్లవం ఓడిపోవటాన్ని అదునుగా తీసుకొని ఎక్కువ స్వార్థపరులూ, పిరికి పందలూ అగు తోడిప్రయాణీకులను గూఢచారులుగా జార్‌ప్రభుత్వం తీసుకొంది. ఈ నమ్మకద్రోహులయిన నీచులు జార్ గూఢచారి శాఖ తరఫున కార్మికవర్గంలోకి, పార్టీ సంఘాలలోకిపోయి, లోపలనుండే గూఢచారి కార్యక్రమంచేస్తూ, విప్లవకారులకు ద్రోహం చేశారు. విప్లవ ప్రతీఘాతక దాడి సిద్ధాంత రంగంపైన కూడా సాగింది. ఫేషన్‌బుల్ వ్రాయసగాండ్ర గుంపు ఒకటి బయలుదేరి మార్కి ్సజాన్ని “విమర్శించారు”. దాన్ని “కూల్చివేశారు.” విప్లవాన్ని గేలిచేసి దూషించారు. ద్రోహాన్ని పొగిడారు. “వ్యక్తిత్వపూజ” అనే ముసుగుక్రింద వ్యభిచార అవినీతిని పొగిడారు.

తత్వశాస్త్రరంగంలో కూడా మార్క్సిజాన్ని “విమర్శించడానికి”, కుసంస్కరించడానికి ప్రయత్నాలెక్కువయ్యాయి. సూడో కపట శాస్త్రీయ సిద్ధాంతంతో కప్పివేయబడిన అనేక రకాల మత ధోరణులు కూడా తలెత్తాయి. మార్క్సిజాన్ని విమర్శించడం ఫేషన్ అయిపోయింది. ఈ పెద్దమనుష్యులందరూ బహు వేషదారులైనప్పటికీ, వారంతా ఒకే ఆశయానికి పాటుపడ్డారు. అది విప్లవం నుండి ప్రజలను మరలించటం.

పార్టీ మేధావివర్గంలో ఒక భాగాన్ని సంశయవాదమూ పతనమూ ఆవరించాయి. వీరు తాము మార్క్సిస్టులమని అనుకొన్నా, ఎప్ప్పుడూ మార్క్సిస్టు సిద్ధాంతానికి గట్టిగా అంటిపెట్టుకొని వుండలేదు. వారిలో బోగ్గనావ్, బాజరోవ్, లూనాచార్స్కీ (1905 విప్లవంలో వీరంతా బోల్షివిక్కులతో చేతులు గలిపినవారు) యాష్కెవిచ్, వేలెంటినోవ్ (వీరు మెన్షివిక్కులు) మొదలగు రచయితలు ఉన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతంయొక్క తత్వశాస్త్ర పునాదులపైన వారు ఒక్కసారిగా తమ విమర్శనాయుధాన్ని ప్రయోగించారు. అనగా గతితార్కిక భౌతికవాదానికి వ్యతిరేకంగాను, చారిత్రక విజ్ఞానంయొక్క ప్రధానమార్క్సిస్టు సూత్రాలైన చారిత్రక భౌతిక వాదానికి వ్యతిరేకంగాను వారు తమ దాడిని సాగించారు. ఈ విమర్శన మామూలు విమర్శలాంటిదికాదు. ఈ విమర్శను బహిరంగంగాను, నియమబద్ధంగాను చేసేవారుకాదు. మార్క్సిజం ప్రధాన సిద్ధాంతాలను “సమర్థించే” ముసుగుతో, మిషతో, కపటంగా యీ విమర్శను సాగించేవారు, వీరు అసలు విషయాల్లో మార్క్సిస్టులేనట. కాని మార్క్సిజాన్ని దాని కొన్ని ప్రధాన సూత్రాలను త్రోసివేసి, “అభివద్ధి” చేయదలచుకున్నారట. వాస్తవంలో వీరు మార్క్సిజానికి ప్రతికూలురు. ఎందుచేతనంటే వీరు మార్క్సిస్టు సిద్ధాంతపు పునాదులనే కూలద్రోయ ప్రయత్నించారు. తాము మార్క్సిజానికి వ్యతిరేకులం కామని కపటంగా కల్లలాడినప్పటికీ, తాము మార్క్సిస్టులమంటూ రెండు నాల్కలతో ప్రవర్తించినప్పటికీ, వారు నిజానికి మార్క్సిజానికి వ్యతిరేకులే. పార్టీ అనుచరులను మోసగించి, వారిని తప్ప్పుడు తోవకు పట్టించడానికే యీ కపట విమర్శ చేయబడింది. ఇందులోనే దీని ప్రమాదం వుంది. మార్క్సిజం సిద్ధాంతం పునాదులను భగ్నపరచదలచిన యీ విమర్శ కుటిలతరమైన కొలదీ పార్టీకి మరింత అపాయకరమైంది. ఎందువల్లనంటే విప్లవానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా అభివద్ధి నిరోధకులు జరిపే సాధారణ దుష్ప్రచారంలో యిదికూడా మిళితమైంది. మార్క్సిజాన్ని వదిలి పారిపోయిన కొంతమంది మేధావులు ఒక కొత్తమతాన్ని స్థాపించాలని ప్రచారంచేసేదాకా పోయారు. వీరినే “భగవదన్వేషకులు,” “భగవన్నిర్మాతలు” అని పిలిచేవారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని వదిలి పోయిన స్వామి ద్రోహులకు తగు రీతిగా జవాబివ్వడం, వారి ముఖాలనుండి ముసుగులను తొలగించి పూర్తిగా బట్టబయలు చేయడం, ఆ విధంగా మార్క్సిస్టుపార్టీ సిద్ధాంతపు పునాదులను సంరక్షించడం మార్క్సిస్టుల అత్యవసర కర్తవ్యమయింది.

“మార్క్సిస్టు సిద్ధాంత కర్తలలో ఘనులం” అని భావించే ప్లెUనావ్, అతని మెన్షివిక్ స్నేహితులూ ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుతారని కొందరు అనుకోవచ్చు. కాని ఏవో వార్తాపత్రికల విమర్శల లాంటివి ఒకటి రెండు అనామక ముక్కలు విసిరేసి, ఆ రంగాన్ని వీరు వదలివేశారు.

1909లో ప్రచురించిన “భౌతిక వాదము`అనుభవ వాద విమర్శ” ( Materialism and Emprio-criticism) అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో యీకర్తవ్యాన్ని లెనిన్ నెరవేర్చాడు.  ఇందులో లెనిన్ ఇలా రాశాడు :

“గతితార్కిక భౌతికవాదంపైనే ప్రధానంగా కేంద్రీకరించి దాడి సల్పిన నాలుగు పుస్తకాలు గత ఆరు మాసాలలో వెలువడ్డాయి. వాటిలో మొట్టమొదటివీ, ప్రధానమైనవీ ఇవి : 1908లో సెంట్‌పీటర్స్‌బర్గ్‌లో ప్రచురించపబడిన మార్క్సిస్టు తత్వ శాస్త్ర‌ అధ్యయనాలు  (Studies in the philosophy of Marxism) నిజానికి ‘మార్క్సిస్టు తత్వశాస్త్రానికి వ్యతిరేక అధ్యయనాలు’ అని అంటే బాగుండేది) : బాజరోవ్, బోగ్డనోవ్, లూనాచెరెస్కీ, బెర్మన్, హెల్‌ఫాండ్, యుస్కెవిచ్, సువరోవ్ అనువారల వ్యాససంపుటి; యుస్కెవిచ్ వ్రాసిన భౌతికవాదము ` విమర్శనాత్మకత వాస్తవికత (Materialism and critical Realism) : బెర్మన్ రాసిన “ఆధునిక దర్శన శాస్త్ర దృష్ట్యా గతితర్కం” (Dialectics in the light of Modern theory of knowledge) : వాలెంటినోవ్ రాసిన “మార్క్సిస్టు తత్వశాస్త్ర  అన్వయాలు (The Philosophical constructions of Marxism)….వీరంతా రాజకీయంగా తీవ్రంగా విభిన్నాభిప్రాయాలు కలిగివున్నప్పటికీ, గతితార్కిక భౌతికవాదానికి ప్రతికూలతలో ఒక్కటే. పైగా తత్వశాస్త్రంలో తాము మార్క్సిస్టులమని చెప్ప్పుకునేవారు. ఏంగెల్సు గతితార్కికవాదం మార్మికవాదమనీ (mysticism) బెర్మన్ వాదించాడు.

అదేదో ప్రత్యక్ష నిదర్శన విషయమైనట్లు ఏంగెల్సు భావాలు “పాతబడ్డాయి” అని బాజరోవ్ చులకనగా అనేశాడు. ‘ఆధునిక దర్శనశాస్త్రం’, ‘మొన్న మొన్నటి తత్వశాస్త్రం’ (లేక రూఢివాదం) ‘ఆధునిక ప్రకృతిశాస్త్ర తత్వశాస్త్రము’, ‘20వ శతాబ్ధపు ప్రకృతి శాస్త్ర తత్వశాస్త్రము’ మొదలగువాటిని గురించి సగర్వంగా ఉదహరించే యీ సాహసిక యోధులు భౌతిక వాదాన్ని ఆ విధంగా త్రోసిపుచ్చారు” (లెనిన్, భౌతిక వాదము – అనుభవ వాద దృష్ట్యా విమర్శ – ఇంగ్లీషు ఎడిషన్ ` మాస్కో 1947, 9వ పేజీ).

తత్వశాస్త్ర రివిజనిస్టులైన తన స్నేహితులను సమర్థించుతూ లూనచార్‌స్కీ యిలా అన్నాడు : “మేము దారి తప్పితే తప్పవచ్చు. కాని దారికోసం అన్వేషించుకున్నాం”. దీనికి జవాబుగా లెనిన్ ఇలా వ్రాశాడు :

“నామట్టుకు నేను కూడా తత్వశాస్త్రంలో అన్వేషకుడినే. (భౌతికవాదం -అనుభవవాద విమర్శ, అనే గ్రంథంలో ` సంపాదకుడు) మార్క్సిజం అనే ముసుగు క్రింద అభివృద్ధి నిరోధకమైన, గందరగోళమైన, నమ్మరాని, అయోమయ విషయాలను తెలియజేసే, వీరి పొరపాట్లు ఏమిటో కనుగొనుటయే యీ విమర్శల వుద్దేశ్యం.” (పై గ్రంథమే 10వ పేజీ).

కాని వాస్తవానికి లెనిన్ గ్రంథం ఈ స్వల్ప కర్తవ్యంతోనే సరిపుచ్చుకోలేదు. బోగ్టనోవ్, యుష్కెనిచ్, బాజరోవ్, వాలెంటివనోవ్ ` వారికి తత్వ శాస్త్రంలో గురువులైన ఎవనోరియస్, మాష్ అను వారిని విమర్శించటంతోనే ఈ గ్రంథం సరిపుచ్చుకోలేదు. మార్క్సిస్టు భౌతిక వాదానికి వ్యతిరేకంగా ఎవనోరియస్, మాష్‌లు మెరుగుపెట్టిన, నాజూకైన భావవాదాన్ని తమ రాతలలో తెలియజేశారు. వీరందరిని విమర్శించటమేకాక లెనిన్ గ్రంథం మార్క్సిస్టు సిద్ధాంతపు పునాదులను అంటే గతి తార్కిక చారిత్రక భౌతికవాద సిద్ధాంతపు పునాదులను సమర్థించింది. ఏంగెల్స్ చనిపోయిన నాటినుండి లెనిన్ ప్రచురించిన “భౌతికవాదం – అనుభవవాద విమర్శ” అనే గ్రంథం వెలువడే వరకు, అంటే ఈ చారిత్రక కాలమంతటిలోను, సైన్సువల్ల ముఖ్యంగా ప్రకృతి విజ్ఞానశాస్త్రం వల్ల సంపాదించబడిన ప్రతి ముఖ్యమైన, కీలకమైన విషయానికి భౌతిక వాదాన్ని అన్వయించి సూత్రీకరించింది. రష్యన్ అనుభవవాద విమర్శకులను, వారి విదేశీగురువులను క్షుణ్ణంగా విమర్శించి, తత్వశాస్త్ర సిద్ధాంత రివిజనిజం గురించి యీ క్రింది నిర్ణయాలకు లెనిన్ వచ్చాడు :

మార్కిజాన్ని నేర్పుగా వక్రీకరించడం, మార్క్సిజం ముసుగులో భౌతికవాద వ్యతిరేక సిద్ధాంతాన్ని నేర్పుగా ప్రతిపాదించడం- ఇదీ, రాజకీయార్థశాస్త్రంలోనూ ఎత్తుగడలకు సంబంధించిన ప్రశ్నలలోను సాధారణంగా తత్వశాస్త్రంలోను ఆధునిక రివిజనిజం ప్రాథమిక లక్షణం. (పై గ్రంథమే 342`43 పేజీలు)

2. “మాష్, ఎవెనోరియస్ అనువారల ముఠా అంతా భావవాదంవైపు నడుస్తున్నది. (పై గ్రంథమే 370వ పేజీ)

3. “మాష్‌ను అనుసరించే మనవారంతా ఆదర్శవాదమనే వలలో చిక్కుకున్నారు. (పై గ్రంథమే 359వ పేజీ)

4. “అనుభవవాద విమర్శయొక్క తర్కజ్ఞాన పాండిత్యాల వెనుక, తత్వశాస్త్రంలోని వివిధ పక్షాల పోరాటాన్ని చూడకుండా వుండలేం. ఈ పోరాటం ఆధునిక సమాజంలోని పరస్పర వ్యతిరేకవర్గాల సిద్ధాంతాన్ని, ధోరణులను ప్రతిబింబిస్తుంది.” (పై గ్రంథమే 371 వ పేజీ)

5. సాధారణంగా భౌతికవాదానికి వ్యతిరేకంగాను, నిర్ధిష్టంగా చారిత్రక భౌతిక వాదానికి వ్యతిరేకంగాను, పోరాడే ఫిదెయిస్టుల (శాస్త్రవిజ్ఞానం కంటే విశ్వాసానికి ప్రాధాన్యతనిచ్చే అభివ‌వృద్ధి నిరోధకులు) స్థాయికి పడిపోవడమే, అనుభవవాద విమర్శ వర్గపాత్రా మరియు దాని లక్ష్యమూ.

6. “తాత్విక ఆదర్శవాదం (Philosophical idealism) మత అంధకార అజ్ఞానవాదానికి మార్గం.” (లెనిన్ కలెక్టెడ్ వర్క్స్, రష్యన్ ఎడిషన్`13వ వాల్యూం 304 పేజీ)

మనపార్టీ చరిత్రలో లెనిన్ గ్రంథం ప్రదర్శించిన అద్భుతమైన పాత్రను హర్షించాలంటే: స్టోలిపిన్ ప్రతీఘాత కాలంలో (రివిజనిస్టులు, నమ్మక ద్రోహులు మొదలైన నానా గోత్రీకుల గుంపునుండి, లెనిన్ సంరక్షించిన సిద్ధాంత సంపదను మనం గుర్తించాలి. మనం క్లుప్తంగానైనాసరే గతి తార్కిక చారిత్రక భౌతికవాద ప్రధాన సూత్రాలను తెలుసుకోవాలి.

గతితార్కిక చారిత్రక భౌతికవాదాలు కమ్యూనిస్టు సిద్ధాంతానికి పునాది. మార్క్సిస్టు పార్టీకి సిద్దాంత పునాది. అందుకే వీటిని తెలుసుకోవటం అవసరం.

Leave a Reply