సాహిత్యం కవిత్వం

యుద్దానికి ఆవల..

చిటుక్కుమని గండు చీమ మామిడి ఆకు తొడిమ కొరికిన సడి ఎంత గట్టిగా వినబడిందో టేకు ఆకు మొదలుపై వాలిన గోరపిట్ట కాలి గోరు శబ్దం టిక్ టిక్ మని చెవులని తాకింది  ఇంతలోనే గాలి మోసుకొచ్చిన టకటక బూట్ల శబ్దం ఎత్తుపల్లాల మధ్య హోరుగా వినిపిస్తూ ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం  మొదలైన యుద్ధం చివరాఖరుకు నెత్తుటి ముద్దల విసిరివేతతో హాహాకారాల ఆర్తనాదాలమయంగా అడవి హోరుపెట్టింది పుడమి తల్లి గర్భంలో దాగిన‌ సంపదను కాపాడుతూ ఒరిగిన ప్రాణాలు కొన్ని ఫాసిస్ట్ కార్పొరేట్‌ దొంగల ఆశలు కావలి కాసే ఆకలి కడుపుల జీతగాళ్ళ మృతదేహాలు కొన్ని  నేలపై కారిన ప్రతి రక్తపు బొట్టు ఎదురెదురు గుండెల మండే కన్నీటి చారికల గాయపడిన అమ్మతనం  పేలిన‌ ప్రతి తూటాకు కళ్ళుంటేతను వెళ్ళే దిక్కు చూపేదినోరుంటే సాక్షిగా
సాహిత్యం కవిత్వం

వెన్నెలపంట

ఒకేసీటులోపక్కపక్కనే కూర్చుంటాంవందలకొద్ది మైళ్ళుకలిసే ప్రయాణిస్తాంహలొఅంటే హలొమీరెక్కడిదాకాపలాన వూరుఅంతేమాట్లాడటం ముగుస్తుంది నాచేతిలో సెల్ ఫోన్పక్కనవ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ఇద్దరితలలు ఓరిగిపోతాయి ఇక్కడదూరంలో ఉన్న వ్యక్తితో సంభాషణఅక్కడఎక్కడోవున్న వ్యక్తితో సంభాషణఇక్కడవీడియోగేమ్స్అక్కడఫేస్ బుక్ఇక్కడట్విట్టర్అక్కడవాట్సప్ యూట్యూబ్ గూగుల్ సెర్చింగ్ లునచ్చిన వాటిని వెదుక్కునివాటిల్లో లీనమవుతాం గ్రామాలను దాటుతాంపట్టణాలను దాటుటాంతలపక్కకుతిప్పికిటికిలోనుండి బయటకు చూసినప్పుడుఅనేక దృశ్యాలుతెరలు తెరలుగా ఎదురవుతాయి వర్తమానంలోకి వచ్చిఎవరిని చూసినారంగులు పూసుకున్న మొఖాలే చిరునవ్వుకిచిరునామలేని ప్రతిభింభాలు కాలానికి కళ్లెం లేదుభద్రతకు భరోసాలేదుఅంతాపల్లెరుకాయల పరాకు దుఃఖాలు ఎదురుపడతాయిసోకాలు ఎదురుపడతాయిఅన్నింటినిచూస్తూనే దాటిపోతుంటాంస్ఫురణలోకి వచ్చినప్పుడుఎదురుపడిన దృశ్యాలునిమిషమోఅరనిమిషమోబాధను కలిగిస్తాయి గమ్యం చేరువయ్యిందిఎవరిదిశగావారు వెళ్లిపోతున్నదారిలోనీడలు కనుమరుగయ్యాయిఅంతా గాఢాంధకారంనిశరాత్రిలోనిశ్శబ్దమేతప్పాతీతువుపిట్ట అరుపులులేవు అందరుఅందరిలోవున్నాప్రతిఒక్కరినిఒంటరితనం వెంటాడుతున్న క్షణానవెన్నెలపంటకోసం నేను
సాహిత్యం కవిత్వం

మీరూ – మీ రాజ్యం

నాలుగు రోడ్ల కూడలిలోనిమ్మ కాయ ముగ్గు తొక్కండిభూత వైద్య పట్టాదార్లుబెనారస్ నుండి వస్తున్నారు ఆత్మ పరమాత్మ లసంఘర్షణ ల నిగ్గు తేల్చేనిఖార్సైన చదువులురాజు ఇలాకాలో చెబుతున్నారు ఎలా చస్తేఎలా చంపితేఆత్మ పునర్జన్మ పొందుతుందోచెప్పే ప్రయోగశాలలు తయారవుతున్నాయితొందర పడినోట్లో రాగి చెంబులు పెట్టిడంబెల్స్ తో చంపబాకండి త్రిశూలం వాడితే శివుడొస్తడోచక్రం తో ఛేదిస్తే విష్ణువు వస్తాడోచెప్పే జ్ఞానంబాబాలకి లేదనివిశ్వవిద్యాలయాల్లో పురుడు పోస్తున్నారు నగ్న దేహాన్నిపటాల ముందు ప్రదర్శిస్తేపటాలు శాంతిస్తాయో లేదోననేపరిశోధనలు కొనసాగుతాయి త్వరలో అంతా ద్వైతమేశాస్త్రం సమాధిమీరు కోరుకుంటున్న సమాజమే వస్తుందిఆత్మలన్నీ మరుజన్మ ఎత్తిచావులేని పురాణ వైద్యాన్ని వెలుగులోకి తెస్తుంది రాజ్యం!! బువ్వ పెట్టే వాడ్ని చంపైనామీ మూఢ నమ్మకాన్ని
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...