లోచూపు సాహిత్యం సమీక్షలు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
గల్పిక

‘బజరా’ గల్పికలు రెండు

1 సమభావం! “రేణుకని చంపేశారట...”“ఏ రేణుక?”“జి. రేణుక, మిడ్కో పేరుతో కథలు రాస్తుంది!”“ఆ... చూశాను, మనవాళ్ళంతా పోస్టులు పెడుతున్నారుగా?”“మెట్లమీద- అని యాంతాలజీ కూడా వచ్చింది!”“ఔనౌను, అందరూ అక్కడ ‘జోహార్లు’ చెపుతున్నారు, యిక్కడ ‘జేజేలు’ చెపుతున్నారు!”“జేజేలు యెవరికీ యెందుకూ?”“ఉగాది పురస్కారాలు పొందిన వాళ్ళకి, అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకుంటుంటే చెప్పరా జేజేలు...”“అదేంటి జోహార్లకి కారణమై భాగస్వాములైన వాళ్ళే శాలువాలు కప్పుతుంటే సిగ్గులేకండా జేజేలా?”“నీకు తెలీదబ్బా... మన రచయితలకు అన్నిటి మీద సమభావం వుంటుంది!”“....................................................?!?” 2 మిడ్కో! “మన రాజ్యం చీకటితో యెంత బావుందో కదా?!”“ఔను, కాని అదేమిటి యింత చీకటిలోనూ మచ్చలా ఆ వెలుగు?”“నిజమే, అది ఆ స్పార్క్... గ్లీమ్...
కథలు

మౌనం

సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని అతనికి అనిపిస్తోంది. కవల పిల్లలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో విలవిల్లాడుతున్నారు. ఒకరు పాప. మరొకరు బాబు. షబానా: "యాకూబ్, వీళ్ల శ్వాస ఇంకా బాగా లేనట్టుంది. మన దగ్గరి ఇంటి వైద్యం చేశాం. ఇంతకన్నా చేయగలిగింది ఏమీలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిదేమో." యాకూబ్: "నేను కూడా అదే అనుకుంటున్నా. వాళ్లను ఇక్కడ ఉంచితే ఏమైనా జరిగి పోతుందేమోనని భయం వేస్తోంది. మనం ఆలస్యం చేయకూడదు." షబానా: (పిల్లల్ని
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధం విరసం మీదేనా?

విప్లవ రచయితల‌ సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెల‌ల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాల‌కుల‌కు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్ప‌ని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల‌ తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు
అంతర్జాతీయ చిత్ర సమీక్ష సాహిత్యం

చివరి ఆరు రోజులు!

1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ  “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”.  ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు. ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్  దృష్టి
కథలు సాహిత్యం

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
సాహిత్యం వ్యాసాలు

ప్రతి విపత్తూ పెట్టుబడికి వరమే

ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య,  వారి సంపదను లెక్కించడం లో    ఫోర్బ్స్ సంస్థ  అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో,  వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక  దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్  నివేదికను
కథలు

ప్రజలదే విజయం

వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు
సాహిత్యం కవిత్వం

ఇక్కడి నీడలు నీడల్లా వుండవు

మా దేహపు నీడలోనూమా ఊపిరిపాట వినిపిస్తుంది మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణమా కడుపులోకి ఎలా దూకిందోమా దేహపు నీడలోనూ కనిపిస్తుంది స్థూపాల నీడలన్నీ కలగలిసినేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయిమా దేహపు నీడలోనూఅదే త్యాగాల రంగు దట్టమైన చీకటిలోనూనిద్ర పట్టని రాత్రిలోనూనేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయిమా నీడలు మా కింద నుండి పారుతుంటాయిగుండెలు పగిలిఅచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్నమరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికిమా నీడలు పారటం నేర్చుకున్నాయి చిమ్మ చీకటిలోనూమా నీడలన్నీ సజీవమేనీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలుపిడికిళ్లుగా మారుతుంటాయిపిడికిళ్లుగా పాడుతుంటాయి ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండిఇక్కడి
సాహిత్యం కవిత్వం

పరాకాష్ట

చేతులకు సంకెళ్ళువేసినరాతను గీతనుఆపలేవుకాల్లకు సంకెళ్ళువేసినమా ఆటను అడ్డుకోలేవునోటికి సంకెళ్ళువేసినపాటను మాటనుప్రశ్నను ఆపలేవుఅక్షరం పై ఆంక్షలుశబ్ధం పై నిషేదంకదిలిక పై నిర్భందంమెదలిక పై నిఘాఅప్రకటిత చీకటిపాలనకు పరాకాష్టఇక మౌనం మండాల్సిందేశబ్ధం విస్ఫోటం చెందాల్సిందే