కవిత్వం

పల్లె పిలుస్తోంది…!

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానే చిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కా ఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలు పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలో జీడి చెట్ల కొమ్మల్లో అడుగులు వడివడిగా మురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకుని మంచు బిందువుల్ని పూసుకుని ఎగిరే పక్షుల వెంట ఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని నా పల్లె లో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్ని వెలిగించుకుని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
కవిత్వం

సర్రియల్‌ క్లౌడ్‌ బర్స్‌ట్స్‌  వర్సెస్‌ వసంతమేఘం

ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం ఎప్పుడొస్తారు వానవలెవలస కూలీలుగా కాదుకోలీలు1గా కార్మికులుగాకోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదుఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే అని స్వాధీనం చేసుకోవడానికికార్పొరేట్ కాలుష్య మబ్బులు అనిక్లౌడ్ బర్స్ట్స్ కాదని హెచ్చరిస్తూమీ అక్రమ నిర్మాణాల వలన మావాళ్లే చావడానికి కాదు చెట్లు కూలిపోవడానికీ కాదుఆదివాసులను చంపివాళ్లు కళ్లల్లో పెట్టుకున్న మనుషుల్ని చంపిఅడవితల్లి గర్భం నుంచి పుట్టుకొచ్చి ఇంకా పేగుబంధం తెగనిలక్షలాది చెట్లను నరికే గఢ్ చోరీలుఉక్కుచెట్లను నాటితే అడవెక్కడికి పోవాలి మరినదులై మహానగర రోడ్లనే ముంచెత్తుతున్నది.పల్లెల్లోని రైతాంగమంతా ఢల్లీలో ఒక బహదూర్షాను పెట్టుకొని కంపెనీ మీద యుద్ధానికి తమ బిడ్డల్ని పంపింది మోషా(సా)ల
కవిత్వం

రణం దిక్కైనోళ్ళు!!

తలమీది నీడను త్యాగం చేసుడు తమవల్ల కాదని తెల చెప్పినోళ్ళు కాళ్ళ కింది నేల కడుపాకలి తీర్చే వొనరది మాకు వొదలమన్నోళ్ళు రిజర్వాయరు రక్కసి కోరని ఎరుగక జిక్కి అల్లాడెటోళ్ళు యాడాది పైనాయె ఎద బాదుకుంటు మొరల్ బెట్టి బెట్టి మోసపొయ్నోళ్ళు దొంగలోలె పట్టి టేషన్లకు దెచ్చి బైండోర్లు జేసెనే దొరోల్ల రాజ్యం ఇంత కెవరీళ్ళో సెప్పనైతి నేను ఎత్తిపోతల కత్తి ఎదలోకి దిగిన సిన్నోని పల్లెంట బతుకగ్గి పాలై బజారు పడిన పల్లె రైతులీళ్ళు ఎట్లైతె అట్లాయె ఇట్లైతె కాదంటు లీడర్ల రంగెరిగి రణం దిక్కైన్నోళ్ళు.
కవిత్వం

మరో ఉదయం కోసం

ఈ నిషాద విషాద కాలంలో ఒంటరిగా మిగిలి వున్నామన్న ఊహ గుండెల్లో మెలిపెడుతుంది మాటాడుకోవడానికి నీ పక్కన ఒకమనిషి లేరన్నది భయపెడుతుంది కలిసి నడిచినపాదాలన్ని దూరంగా జరిగిదారిలో నేనొక్కడినే మిగిలి వున్న ఊహ నిలువనీయదు కలిసి సాధించిన విజయాలు మరల మరలగుర్తుకు వచ్చి భుజం తడుతూనే వుంటాయి కానీ ఇన్ని మరణాలు కళ్ళలో కదలాడి నెత్తురు చిమ్ముతున్నాయి ప్రతీ దేహంతో వీడ్కోలు చెప్పే జన సందోహం నినదించిన నినాదాలు మరల ఆశను కల్పిస్తున్నాయి శిశిరం వెళ్లిన మరుక్షణం చిగురించే వసంత కాలమొకటి హామీగా వస్తుంది అయిన ఈకాలాన్ని జయించే విస్పోటనమేదొ మరల జరిగిపిడికిళ్లు బిగిసే సమయం ఉదయించే ఆ
కవిత్వం

మహమూద్ కవితలు రెండు

స్వప్న స్పర్శ ------------ భూగ్రహం మీద ఉల్కల వంటి వారు మట్టితో కలిసి చిగుళ్ళకు ప్రాణం పోసే ఉల్కలు అరణ్యంలో పిట్టలకు కాంతిని ఆయుధంగా ఇస్తారు అవి అడవిని కాపలా కాస్తుంటాయి తమ నీడలని రాత్రింబవళ్ళకి రెక్కలు గా తొడిగి 1. సముద్రపుటలల మీంచి జారే సూర్యరశ్మి లాంటి పారదర్శక జీవితాలవి తమతో తాము పోరాడుతూనే చుట్టూ పరిసరాల్తో తీరని సంఘర్షణలో మునిగి ఉంటాయి గాయమయమౌతూనో, గానమయమౌతూనో, 2. లేత కాంతికి బట్టలుగా తొడిగినట్టు నిండైన దృష్టి ఆదివాసి ఊదే బూరలాంటి స్పష్టాతిషైపష్టమైన కంఠస్వరం ఖంగున మ్రోగే మాట వినగానే మెదడులో రూపం ప్రసారమయేంత తాజా ఉద్యమ ప్రతిబింబాలు
కవిత్వం

అడవి –  రోడ్డు

అడవిమీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది అడవిని రోడ్డు ఆక్రమించుకుంటున్నది మట్టిని, చెట్టును, ఆకును, పుప్వును, నీటిని పుట్టను, పిట్టను, గుహను, గూటిని గుట్టను, లోయను తొలిచేస్తూ రోడ్డు పొక్లెయినర్‌లా వస్తున్నది కొండచిలువతో కూడ పోల్చలేము కొండచిలువ నుంచి పిల్లల్ని, వృద్ధుల్ని, తనను రక్షించుకోవడం అనాదిగా ఆదివాసీకి తెలుసు రోడ్డు బాటల్ని రద్దుచేస్తూ వస్తున్నది మనిషి పాదాలకింద మట్టిని డాంబర్‌తో సిమెంటుతో కప్పేస్తూ వస్తున్నది ఇసుకదాహంతో వస్తున్నది ఇనుము దాహంతో వస్తున్నది ఇంధనం దాహంతో వస్తున్నది ఖనిజదాహంతో వస్తున్నది ఎదుటివాని దప్పిక ఏమిటో ఆదివాసీకి తెలుసు పసిపాపకు చన్నుకుడిపిన అడవితల్లికి తెలుసు ఆవుపాలు దూడకోసమే అనుకునే ఆదివాసికి తెలుసు కడుపుకి
కవిత్వం

ముస్లిములు.. నిర్దోషులు

ఇప్పుడింక వాళ్ల నిర్దోషిత్వం ప్రశ్నార్థకమైంది విడుదలైన వాళ్లు ఇప్పుడింకతమ ఛిద్రమైన జీవితాలను కూడ దీసుకోవడం కాదు భార్యా పిల్లలతో వియోగ విషాదం పూడ్చుకోవడం కాదు ఒక తరం కన్నీళ్లు ఇంకిపోయినవికోవిడ్ ఒక మరణంలోకియవ్వనాలు వృద్ధాప్యాల్లోకి పసిపాపలు పెండ్లికెదిగిన కూతుర్లయియువతీ యువకులై తామైనా చదువో, కొలువో వెతుక్కునే వెసులుబాటు దొరికే విరామం లేదు. ఉన్నదల్లా బయటి వ్యవస్థ మొహానవేనోళ్ళ వేలాడుతున్న ప్రశ్నలు ఇంక జైల్లో దాక్కోవడానికీ లేదు వీధుల్లో తిరగడానికి లేదు నూట ఎనభై తొమ్మిది మృతదేహాలకంకాళాలు ప్రశ్నిస్తున్నాయి ప్రాణమొచ్చి మానినాయనుకున్న బాంబు బ్లాస్ట్ గాయాలను కెలికినట్టయి బుసకొడుతున్నాయిఇప్పుడు మళ్ళీ మిమ్ములనుమీడియా విచారణకు పెట్టినట్లయింది చచ్చినవాళ్లు అబద్దం కాదు కదా
కవిత్వం

సిగ్గుపడు

వాడెవడో అంటున్నాడు‘ఆడపిల్లల్ని అదుపులో పెంచండ’నివాడి జ్ఞానేంద్రియాలకుమగతనపు మదము జోడించివాడిలా కూడా కూసేడుమహిళ సహకరిస్తేనే గదా..!అని కూడా అన్నాడు మహిళలే మర్మగర్భంగా ఉండాలట మీ అంగాంగాలువాళ్లను కామోన్మాదులను చేయొచ్చునటరాక్షస సూత్రీకరణల ఉద్బోధకులుఇలా సెలవిస్తున్నారు మరి...మృత దేహాలనూ వదలనిమగాళ్ళ మూక–ఎదలు కోసినామర్మంగాలను ఛిద్రంచేసినాఘోరం ఘోరమనిగగ్గోలుపెట్టొద్దటఅది–వాని పూర్వజన్మ సుకృతం...వాడల చేస్తాడటమీదీకర్మఫలంమీరలాచావండనిఆమే అంటున్నది‘అమ్మా...నాకొద్దీఆడతనంలంగా,వోణిపూలుగాజులూఅసలే లింగమూ వద్ద’నిముద్దుకు మురిపానికిమాటకూచూపుకూరసికతను రంగరించి చూసిపసిపాపలను సైతం–కసిగా చంపే విషనాగుల గుంపులువిరుచుకు పడుతుంటేఏమంటుంది మరి..?సీతాకోకచిలుకల్లారా ఆకు చాటున దాచుకోండిపూవ్వుల్లారా మీపరిమళాలను వెదజల్లకండిరంగురంగులపక్షుల్లారామీ అందచందాలు ఆరబోయకండినెలవంకానీవే మబ్బుల చాటుకోపారిపోపండు ముసలినిండు చూలాలుబిచ్చగత్తెపిచ్చి తల్లీమీ వొళ్ళుజాగ్రత్తా...గుంపులు గుంపులుగాతిరుగుతున్న పిశాచాలగణంఈ నేలపై యేదోకామక్రీడ కమ్ముకున్నట్టునిర్మానుష్య స్మశానంలానిత్యం ఇలా కాలుతున్నదిఉన్మాదపు రసిపండైవిస్తరిస్తున్నదిఇదీ –ఏ నాగరికతకు ఫలశృతిఏ
కవిత్వం

అధర్మ స్థలం

అక్కడ ఎవరున్నారని వెళ్తున్నారు ఆ చోటులో ఏముందని అడుగుతున్నారు చుట్టూ కళేబరాల నడుమ ప్రార్థనా మందిరంలో నిత్య జన సందోహం!భక్తి పారవశ్యంలో చుట్టూ చూసే ఆరా తీసే తీరికా లేదు సమయమూ లేదు !శ్మశానమా?! కాదు అత్యాచారాల్లో ఆరితేరిన మానవుల అలికిడి గాంచలేని యువతీ యువకులు అర్ధాంతరంగా చంపబడుతున్నారు దేహాలు పూడ్చబడ్డాయి ఎక్కడబడితే అక్కడ రక్షక భటనిలయాల్లో ఫిర్యాదులకు సైతం నోచుకోబడని దేహాలవి బంధుమిత్రులను నయానా భయానా ఆ చోటునుండి వెళ్ళగొట్టిన పెత్తందారీ వ్యవస్థ !కులమూ లేదు మతమూ లేదు అంతా పురుషాధిక్య పైత్యంలో స్థలంలో స్థానభ్రంశం క్షణాల్లో ఒకటో రోజో రెండో రోజో గుట్టుచప్పుడు కాకుండా బొందో