సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు