జనతన రాజ్యంలో కా . గౌతమ్
(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో ఉండగానే కామ్రేడ్ గౌతం కనిపించాడు. ఆయన విప్లవోద్యమంలో సీనియర్ నాయకుడు. నేను అక్కడికి వస్తానని ఆయనకు ముందే తెలుసు. నన్నెంతో ఎరిగినవాడివలె ఆలింగనం చేసుకొని నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు. అందులో ఎన్నో పరామర్శలు. నా ప్రయాణంలో పార్టీ నాయకులు ఎవరెవరు కలుస్తారో నాకెలాంటి ఊహ కూడా లేదు. అయితే నేను విని ఉన్న వాళ్లెందరినో కలవాలనే ఆశ ఉండేది. అయితే ఇన్ని రోజుల్లో అలాంటివారేమైనా కలుస్తారా? అని నేను కామ్రేడ్ ఇడిమెను ప్రత్యేకించి










