వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా
వ్యాసాలు

న్యాయవ్యవస్థను  ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా నియంత్రిస్తోంది ?

న్యాయవ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్‌  బలమైన పట్టు భారత రాజ్యాన్ని బలహీనపరచడం ద్వారా హిందూ-రాష్ట్రాన్ని సృష్టించే వారి అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో వారికి ఎలా సహాయపడుతుంది అనే అంశంపై  వివిధ పత్రికలు, సర్వేల నుండి వచ్చిన నివేదికలు వివరణాత్మక విశ్లేషణ చేసాయి. ఈ కథనం వివిధ వేదికలలో ప్రచురితమైన నివేదికలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని అన్ని రంగాలపై ఎబివిపి, ఇతర హిందూత్వ సంస్థలు, ముఖ్యంగా అఖిల భారతీయ న్యాయవాది పరిషత్ (ఎబి‌ఎపి)ల ఆధిపత్యం గురించిన వాస్తవాలను వ్యాసం విశ్లేషిస్తుంది. న్యాయవ్యవస్థ అనేది రాజ్యానికి ఒక సైద్ధాంతిక సాధనం; ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలకు సంబంధించి దృఢంగా ఉండాలి. అయితే
వ్యాసాలు

హమాస్‌ దాడులను ఎలా చూడాలి..?

‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది. వాకిలి నీదైనా నాదైనా, దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా అది ఆదాము నెత్తురే కదా యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. గాయపడేది మానవాత్మే కదా మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ అంటూ 1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు. నిజమే కదా యుద్ధ భీభత్సం
వ్యాసాలు

మోహన్ జీ అజరామర జ్ఞాపకాలు

కామ్రేడ్‌ ఆనంద్‌ నాకు మొదటిసారి ఓ సమావేశంలో  పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో   సృష్టించిన మొదటి సంక్షోభం  పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్‌ నుండి నేను, మరికొందరు అదిలాబాద్‌ నుండి కామ్రేడ్‌ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి  మరికొందరు  హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి  సమయంలో   సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్‌ విప్లవోద్యమానికి  ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో   ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు 
వ్యాసాలు

ప్రజా జీవితం వెల్లి విరియడానికే మా పోరాటం

(ప్ర‌జా జీవితం వెల్లివిరియ‌డ‌మ‌నే క‌వితాత్మ‌క వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజ‌కీయ  వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడ‌వ‌చ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌, అస‌మ సాంఘిక సంబంధాలు ప‌ట్టి ఉంచిన తావుల‌న్నిటా విప్ల‌వం జ‌రగ‌ల‌వ‌సిందే అంటాడు ఆర్‌కె. కొంద‌ర‌నుకున్న‌ట్ల విప్ల‌వం  ఏదో ఒకానొక స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే ప‌రిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బ‌హుముఖీన‌మైన క‌ర్త‌వ్యం. ఈ విష‌యంలో విప్ల‌వకారుల అవ‌గాహ‌న‌ను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవ‌డం ఈ  రాజ్యం ద్వారా సాధ్యం కాద‌ని, ఈ రాజ్యాంగ ప‌రిధిలో అయ్యేప‌ని కాద‌ని చెప్ప‌డం ఆయ‌న అస‌లు ఉద్దేశం. ఇంత
వ్యాసాలు

రక్త సంబంధీకులకు..

ఈ నేలకు చెందిన నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మీ కోసం నేనురాసే ఒక బహిరంగ లేఖ. మీకీ లేఖ రాయాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను. చాలా కాలం నుంచి రాయకుండా ఈ లేఖ అలా ఉండిపోయింది. మా సంస్థలో రొట్టెలు కాలుస్తున్నప్పుడు నా శరీరం కాలడంతో తొలిసారిగా నా కలాన్నిలా కదిలించాను. అమ్మా.. నీ అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్నప్పుడు నీకు రాయాలనుకున్నాను. ధనికులుగా, పేదలుగా, స్త్రీలుగా పురుషులుగా విభజించే విధానం పెరిగిపోతుండడం గురించి మా సంస్థలో తొలిసారిగా చర్చించాం. మన సమాజంలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ చణలో వీటిని ఎలా
వ్యాసాలు

చిత్తనూర్‌లో  ఇథనాల్‌- రాజ్య హింస

అక్టోబర్‌ 21, 2023 రాత్రి 8 గంటలకు లకు వ్యర్థపదార్థాలతో కూడిన ట్యాంకర్‌ ఇథనాల్‌ పరిశ్రమ నుండి బయటికి వచ్చిన విషయం తెలుసుకొని, ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటి సభ్యులు మరియు ఎక్లాస్‌పూర్‌, చిత్తనూర్‌, జిన్నారంకి చెందిన రైతులు దాన్ని 21 రాత్రి శనివారం 8 గంటల నుండి 22 ఉదయం 11 గంటల వరకు దాన్ని నిలువరించి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ట్యాంకర్లో ఇథనాల్‌ ఉందా లేక పరిశ్రమ వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అని స్పష్టం చేయాలనే ప్రజల డిమాండ్‌ పట్ల 15 గంటల నిరీక్షన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా ప్రజలు కనీసం
వ్యాసాలు

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసమే యుద్ధం

ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి
వ్యాసాలు

నిషేధం ఎత్తివేత రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది

(2004 అక్టోబ‌ర్ 15 నుంచి19 దాకా అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రెండు విప్ల‌వ పార్టీల‌కు మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. దానికి స‌న్నాహంగా తెలుగు స‌మాజాల్లో ఒక గొప్ప భావ సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ మొత్తానికి విప్ల‌వోద్య‌మం వైపు నుంచి కా. ఆర్‌కె నాయ‌క‌త్వం వ‌హించాడు.  శాంతి చ‌ర్చ‌ల  నేప‌థ్యంలో  2004 జూలై నుంచి న‌డిచిన *చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్* ప‌త్రిక బులెటిన్‌2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠ‌కుల కోసం పున‌ర్ముద్రిస్తున్నాం- వ‌సంత‌మేఘం టీం) ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న
వ్యాసాలు

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేథం

ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరోదేశం దురాక్రమించడం లేదా వలసగా మార్చుకోవడం చూశాం. కాని అత్యధిక ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. పాలస్తీనా ఐరాస సభ్యదేశం, అలీన దేశాలలో గుర్తింపు పొందిన దేశం. ఆ దేశానికి రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. పాలస్తీనా వెలుపల (40 లక్షలు) సగం మంది కాందీశీకులుగా ఉన్నారు. ఇది ఒక భయంకర పరిస్థితి, దీని చరిత్ర అంతా పోరాటాల, త్యాగాల, రక్తసిక్త చరిత్ర. తమ మాతృభూమి కోసం 75 ఏండ్లుగా