మాడ్‌లో 112 గ్రామాల్లోనిరవధిక ఆందోళన
(బస్తర్ జంక్షన్ యూట్యూబ్ చానెల్ హిందీ వీడియో అనువాదం) బస్తర్ లో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆదివాసీలు తమ వివిధ డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు. అణచివేత ద్వారా లేదా ఒత్తిడి తీసువచ్చి కొన్ని ఉద్యమాలను పోలీసులు, ప్రభుత్వమూ ధ్వంసం చేశారు, అంతం చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్యమాలు నేటికీ కొనసాగుతూనే వున్నాయి. వాటిలో ఒకటి నారాయణపూర్‌లోని ఓర్చాలో కొనసాగుతోంది. ఓర్చాలో వందలాది మంది ఆదివాసీలు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. వందలాది గ్రామాల నుంచి వందలాది మంది గ్రామస్తులు యిక్కడ వున్నారు, భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.










