విను! నాకు చదవడం వచ్చు!                          
నేను రాస్తాను కూడా!
నేను ఏ దుస్తులు ధరించాలో నాకు నేనుగా నిర్ణయించుకుంటాను!
మీ అపహాస్యం , అరుపులు ,వెక్కిరింతల మధ్య నేను దృఢమైన సింధూర వృక్షంలా నిలబడతాను
అదిగో స్కూలు బెల్లు మోగుతుంది వెళ్ళాలి!
*
నువ్వు ద్వేషాన్ని కక్కుతావు !
నేను బలాన్ని నాటుతాను !
నువ్వు గేట్లు మూసేస్తావు!
నేను నా హక్కుల్ని గుంజుకుంటాను!
చూడబోతే నీకు నా స్నేహితులు ఎవరో కూడా తెలియదులా ఉంది!
*.
నేను కళ్ళు మిరుమిట్లు గోలిపే కాంతిని!
రక్తాలు కారుతున్నా నేను లేచి మళ్ళీ నిలబడతాను!
నేను మరణించాక మళ్ళీ పుట్టే ఫీనిక్స్ పక్షిని కాదు సుమా!
*.
నేను గతాన్ని!
నేను భవిష్యత్తుని!
నేను వర్తమానాన్ని!
నేను నిరంతరం ఉండేదాన్ని!
నేను నువ్వు ఎన్నటికీ గెలవలేని యుద్ధాన్ని !
*
చూడు! నా పేరుమర్చిపోకు!
నేను మానవ ప్రేమని!
నేను హిజాబ్ ధరించిన అమ్మాయిని!
నేను హిజాబు తీసేసిన అమ్మాయిని కూడా!
జనం నన్ను ప్రతిఘటన అని పిలుస్తారు !
నువ్వూ అలానే పిలువు మరి!

Leave a Reply