కలవపూడి కథలు రచయిత సాoబశివతడవర్తి గారు రాసిన మొదటి కథ సంపుటి.

ఉభయకుశలోపరి అని ఒక పిల్లవాడి ఉత్తరం తో మొదలై హంస మేడ అనె కథ లో..ఒక యువకుడి విరహ ప్రేమ లేఖలకు తన ప్రేయసి ప్రత్యుత్తరం తో ఈ కథ సంపుటి ముగిసిద్ది.

ఈ కథ సంపుటి లో కృష్ణప్ప, కటారి, తారకం అనే పాత్రలతో వాటితో పాటు మధ్యలో వివిధ కథల్లో ఆ పాత్రధారులు  మనల్ని పలకరించి వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, కథలు , స్మృతులు అన్ని మనతో పంచుకుంటూ వెళ్తారు. ఆ కథలతో పాటు మనమూ కలవపూడి కెళ్తామూ.

మొదటి కథ నుండి చివరి కథ కెళ్ళేలోపు ఈ కధలు ఇద్దరు వ్యక్తులు రాసారేమో అనే భావన నాలో కలిగింది. కథలు చదువుతూ వెళ్తుంటేకథను, కధనాన్ని  నడిపే విధానం ఆరోహణ క్రమంలో లో నాకు కనపడింది.

ప్రతి ఊరిలో, ఊరికో ఉన్న వీధి కో దాని పేరుకో  అక్కడున్న మనిషికో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది వాటికి కొన్ని స్వగతలు ఉంటాయి…ఎవ్వరైనా మనం ఉంటున్న ఊరికో వీధికో తనదైన  చరిత్ర ఉందని దాన్ని పంచుకుంటే అది ముందు తరాలకు అందుతుంది లేదంటే ఆ చరిత్ర అక్కడే సమాధి చెయ్యబడుతుంది… అలాంటి స్వాఘాతల కలయికే ఈ కలవ పూడి కథలు.

బహుశా శివ గారు కవి అవ్వడం వల్లనేమో కథల్లో చాలా వాటిల్లో మంచి వర్ణాలను మనం చదివి అనుభవించవచ్చు. అది గోదావరి జిల్లా లో కళవపూడి లో జరిగే కథలు కాబట్టి ఆ గోదావరి యాస లో ఉన్న కొన్ని మాటలు హావభావాలు జనాలను కొంతవరకు ఆకట్టుకుంటాయి.

చాల కథలకు  ఒక కథ తో ఇంకో కథకు లింక్ అప్ ఉండటం తో చదువుతున్న కాల క్రమం లో కథ సంపుటి నుండి అది నవల  రూపొం లోకి మరిందేమో.! అనిపించింది.దానితో పాటు చాలా కథలకు ఓపెన్ ఎండింగ్వళ్ళ కొంత మంది పాఠకులకు నచ్చచ్చు కొంత మందికి అసంపూర్ణం గా అనిపించవచ్చు.

ఓడల పోతురాజు, కల్కి మృదంగం ఈ రెండు కథలో  ఓడ కెప్టెన్ ఓడను దోచడానికి వచ్చిన దొంగ పోతురాజు  కల్కి వారి పాత్రలను చాల అధ్భుతం గా మలిచారు ప్రతి రూపాయి నాణానికి రెండు వైపులు ఉన్నట్టు అక్కడ కూడా కెప్టెన్ బాధ్యతను సముద్ర దొంగ గతా ని,అతను నావ ను దోయడానికి వచ్చినప్పుడు కెప్టెన్ సముద్ర దొంగ కు జరిగిన సంఘర్షణలను దాని ఎదురుకున్నాక కెప్టెన్ మనోభావాలను చాలా  బాగ రాశారు.

పుట్టడం తో ఎవ్వరూ దొంగ కాదు రాజు కాదు నువ్వు చేసిన పని వల్ల లాభం పొందిన వారికి నువ్వు రాజు నష్టపోయిన వాడికి నువ్వు దొంగ వి పరిస్థితులు ఒక మనిషిపై ఉన్న బాధ్యతలు చుట్టూ ఉన్న వాతావరణం ఉన్న సంఘత్యం వ్యక్తుల జీవితాల పై చాల దశలలో ప్రభావం చూపుతాయి  సమాజంలో, ఒక స్నేహితుడి వల్ల రాజు, పరిస్థితుల వల్ల  సముద్ర దొంగ జీవితాలు మారాయి.

కటారి  తన మస్త్యకారి తండ్రి గురించి ప్రస్తావించారే తప్ప వాళ్ళ ఇద్దరి మధ్య యే విధమైన రిలేషన్షిప్establishment నాకు కనిపించలేదు. తన తండ్రి ఒడ్డుకు చేరుకున్నాడు అని చెప్పినప్పుడు సంతోష పడటం మళ్ళీ తూఫాన్ లో వేటకెళ్ళేటప్పుడు బాధపడటం లాంటివి రెండు సందర్బాలు ఉంటాయి తప్ప ఇంకెక్కడా వాటి గురించి ప్రస్తావించలేదు ముందు నుండి కూడా ఆ పాత్రను చాల ఇంట్రవర్ట్ గా తక్కువ ఎక్స్ ప్రెషన్వ్యక్తపరిచే వ్యక్తి గానే ఆ పాత్రను రాశారు…అందుకోసమో తెలీదు కానీ వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కొన్ని సంభాషణలు కొంత కథానికి ఉంటే బాగుండు అనిపించింది.

ఊరి పెద్ద గోపాల రథం చరిత్ర ను ప్రస్తావించినట్టు ఆ ఉప్పుటేరు మస్త్యకారులు వారి జీవ వైవిధ్యాల వారి అనుభవాలు వేట కు వెళ్ళలేని స్థితి లో వాళ్ళ జీవనాధారం, వారి వలసల గురించి, కాలక్రమేణా ఆ వర్గం లో వచ్చిన మార్పూలు జరిగిన ఎవల్యూషన్ గురించి కూడా ప్రస్తావించి ఉంటే బాగుండు అనిపించింది. నాగరీకత పట్టణాభివృద్ధి దశలను గతం నుండి ప్రస్తుత పోలికలను కూడ కాస్తా చర్చించి ఉంటే బాగుండేదనిపించింది.

యాదుపాలేపు నెమలి. నెమలి బాహ్య సౌందర్యాని,తన ప్రేమ కథ ని అందంగ వర్ణించినట్టు ఆ నెమలి ధైర్యాన్ని తన ప్రజ్ఞతని ఇంకాస్త వర్ణిస్తే బాగుండు…కథ ముగింపు అసహజం గా ఉన్న,

అసలు ఎదురుచూడడం కంటే ఉత్తమమైన ప్రేమ ఎం ఉంటుంది…’the highest form of  love is  yearling for your love which is eternal,historic‘. కాస్త రియాలిటీ కి తక్కువ గా ఉన్న ప్రేమ లో ఉండే  ఎదురుచూపులకు ఎంతటి అసహజం అయినా సహజమే.

హంసమేడ. ఒక మనిషికి ఎంత విలాసవంత జీవితం అయినా స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని జీవం లాంటిది, హంస జీవితం కూడా అలాంటిదే కిటికీ లోంచి వీచే గాలిని నడిచే మట్టినీ కురిసే ఆ వర్షని చూసి ఊరుకోవడం తప్ప ఆ ఇంటి గుమ్మం దాటి వాటిని స్పర్శించి అనుభవించే స్వేచ్ఛ లేకుండా చేశారు, అనుభవించాలి అనే ఆ కోరిక ఉన్న  వాటిని అంతస్తు కట్టుబాట్లు అనే తాళాలు వేశారు వాళ్ళ మెదడులో…వారి పితృస్వామ్య కుటుంబం, అలాంటి  తాళానికి, తాళంచెవి తీసుకొని ఆ హద్దులని చెరిపేస్తూ స్వేచ్ఛ ప్రయాణం మొదలుపెట్టిన ఒక స్త్రీ కథే హంసమేడ తనకు తెలియకుండా నే తాళంచెవి గా మారినవాడు తనను ప్రేమించిన విరూచి.

విరూచి ఎవరు లేని హంస మేడ కు లేఖలు రాస్తుంటాడు. అంటే దీని ఆధారంగా హంస తన హంస మేడ దాటగానే చాల ….. జరుగుండచ్చు!

చివర్లో హంస విరూచి రాసిన ఉత్తరాలకి జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అంటూ గంగడుకు పంపిన ఉత్తరం తో కథ ముగిస్తుంది. ఒక ముగింపు ఇంకోదానికి ఆరంభం అంటే ఇదే నేమో…?

అసలు హంస ఎక్కడికెళ్ళింది?

ఇన్ని రోజులు ఎం చేసింది?

స్వేచ్ఛను వెతుకుతూ ప్రయాణం స్వేచ్ఛ వైపే సాగిందా లేక మళ్ళీ తన హంస మేడ లాంటి ఇంకో గుటి లో చేరిందా,సమాజం లోని రాబందులకు చిక్కిందా?

ఎగిరే ప్రయత్నం లో మళ్ళీ తన పాత గూటికే దొరికిపోయుందా?

కథ చదవడం పూర్తి చేసి లోపు మదిలో చాల ప్రశ్నలు మొదలవుతాయి…

కథలు,పరిస్థితులుపాతవే అయినా చెప్పే విధానం ఈ జనరేషన్ వాళ్లకు అర్థం అయ్యేలా ఆకట్టుకునేలా చెప్పడం వల్ల కథలకు అందo చదివే వారికి ఉత్సాహం కలుగుతుంది. జ్ఞాపకాలకు ఉన్న విలువ అంతా ఆ జ్ఞాపక స్మృతులతో జీవిస్తూ స్మరించడం లోనే ఉందేమో!.. అలాంటి జ్ఞాపకాలు కలవపూడి లాంటి ఊరిలో ఉంటే మళ్ళీ ఒకసారి స్పర్శించడానికి లేని వారికి ఇలాంటి జ్ఞాపకాలు కొన్ని ఉంటే బాగుండు అనిపించేలా…చదువుతున్నప్పుడు లేని వారు కూడా అనుభవించేల ఈ పుస్తకం ఉంటుంది. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

Leave a Reply