కబళించే కార్పొరేట్ సమయంలో
దట్టమైన టేకు వనంలో తుపాకీల మోత వినిపిస్తుంది
ఆకుపచ్చని అడవిలో ఎరుపు చిమ్మింది
ఎన్ని గడ్డిపోచలు ఆక్రోశం తో రగులుతున్నాయి
మోదుగుపూలు కొద్ది నీళ్ళల్లో మరుగుతున్నాయి
ఇంకినాకా రసాన్ని కలంలో పోసి
కసిని పాళీ వెళ్ళగక్కుతుంటే
చావులను నిరసిస్తూ వ్రాస్తున్నా
కాగితం ఎర్రబారిన అక్షరాలతో మెరుపులు సృష్ఠిస్తుంది
కుంగిన పొద్దు మళ్ళీ ఉదయించే లోపు
సరికొత్త పొద్దు వైపు నా అక్షరాలు పయనిస్తాయి!