ఊరిలో బడి లేకపోయినా 
వాడ కో గుడి తప్పనిసరి నా దేశంలో
కొత్త గా ఒకే బడంటూ బయల్దేరిన కాషాయం

ఊరికో గ్రంథాలయం లేకపోతేనే
రంగురంగుల జెండాలతో ఊరేగే జనంలో
ఉన్మాదం తలెత్తు

అఖండ భారత్ హద్దులే కానని వారి నినాదాలు చూసి నివ్వెరపోవాలే

ఊరికో బావి
ఊరికో చెరువు
తాగితే నరికిన కాలంలో
పంట కాల్వలో తేలిన రోజుల్లో
వున్నా నోరు మెదపని కాషాయం నేటి నినాదమెనుక మర్మమేమిటి?!

ప్రాణం పోయాక
భూమి లేనిచో తగలెట్టడం
భూమి వుంటే పూడ్చడం ఆనవాయితీ
ఒకే శ్మశానం మాట ఇన్నేళ్ళ తర్వాత!

తప్పుడు లెక్కల తడక మీద
మతాల మధ్య వైరం
పబ్బం గడుపుకుంటున్న కాషాయం!
లెక్కలు తేలిన నాడు బొక్కలిరగక మానవు లే!

మోక్షం బూటకమని మతం ముసుగులోనుండి
బైటపడ్డ నాడే మనిషికి నిజమైన విముక్తి!!

Leave a Reply