నా తొడ మీద వాలిన పక్షి
యూట్యూబ్ లో సంగీతం వింటది.
ఏదో పాట పాడే యత్నంలో
మౌనం గొంతులో అడ్డుపడుతుంది
మొద్దు బారిన నాలికా, ఈకలు రాలిన రెక్కలూ ఇంకేముంటదీ
వీధిలో పిల్లాడు
తండ్రి రాక కోసం
నిరర్థకంగా ఎదురుచూస్తాడు
నెలల తరబడి
తండ్రి ఫోటో కోసం
ఆల్బమ్ లో, పాత పెట్టెలో వెతుకుతాడు
చివరికి
పావురానికి శిక్షణ ఇచ్చి
కాలికి చీటీని గట్టి
దూరాన ఉన్న "నెగేవ్ జైలు"లో
తండ్రిని చూసి రమ్మని
గంపెడాశతో పంపుతాడు
****
మోసబ్ -అబూ -తోహ పాలస్తీనా రచయిత, కవి పండితుడు మరియు లైబ్రేరియన్ .అతని తొలి పుస్తకం "things you may find hidden in my year".. పాలస్తీనా బుక్ అవార్డు, అమెరికన్ బుక్ అవార్డు గెలుచుకున్నది
"నెగేవ్ జైల్.". కేవలం 1988 లో ప్రారంభించబడి అతికొద్ది కాలంలోనే 50వేల మంది పాలస్తీ నీయు లతో నింపేశారు. ఓస్లో ఒప్పంద కారణంగా 1995 లో దీనిని మూసేశారు.
**
