13 నవంబర్ 2024

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం,

రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ 

విషయం: బీజాపూర్ జిల్లాలో చట్టవిరుద్ధమైన నిర్బంధాలు; చట్టాతీత హత్యలు – అన్ని నిర్బంచించిన వారిని వెంటనే  విడుదల చేయాలి; నిష్పాక్షిక విచారణను జరపాలి– సంబంధించి

సర్,

న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ప్రొఫెసర్లు, ఇతర న్యాయ నిపుణుల జాతీయ సమిష్టి సభ్యులుగా, నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ (నజర్) గా పిలువబడే మేము, ఛత్తీస్‌గఢ్,  బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు ఇటీవల, నవంబర్ 8, 2024, చేసిన చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ప్రముఖ కార్యకర్తలతో సహా వ్యక్తులను సామూహికంగా అరెస్టు చేయడం, అలాగే హత్యలు జరిగినట్లు సమాచారం, న్యాయమైన ప్రక్రియ అమలుజరపాక పోవడం, అధిక బల ప్రయోగం, చట్టపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

నవంబర్ 8 న , ఆదివాసీ హక్కుల కోసం కృషి చేస్తున్న మూలవాసి బచావో మంచ్ (ఎం‌బి‌ఎం)కి చెందిన ఎనిమిది మంది ప్రముఖులను గుండిరాగూడ గ్రామంలో ఉమ్మడి బలగాలు నిర్బంధించాయి. ఈ కార్యకర్తలను-అర్జున్ సోధి, ముయ్య హేమ్లా, గణేష్ కట్టం, నంద పోడియం, భీమా కుంజం, జోగ మిడియం, జగదీష్ మాండవి, నగేష్ బాడ్సే- చట్టం ప్రకారం అవసరమైన వారి కుటుంబాలకు తెలియజేయడం లేదా అధికారిక నోటీసు జారీ చేయకుండానే నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఈ సైనిక చర్య  చుట్టుపక్కల తొమ్మిది గ్రామాలకు విస్తరించింది; భద్రతా దళాలు మరుద్‌బాక, రేఖపల్లి, తుమీర్‌గూడ, సింగన్‌పల్లి, కమ్లాపూర్ నుండి కనీసం ఇతర 44 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమ  ప్రాథమిక నిర్బంధంలో మూడు రోజులు వుంచుకున్న తర్వాత అనేక మంది ఖైదీలను నవంబర్ 11 న విడుదల చేసారు. ఏడుగురు మూలవాసి బచావో మంచ్  కార్యకర్తలతో సహా 25 మంది వ్యక్తులు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. ఈ నిర్బంధాలు “విచారణ ప్రయోజనాల కోసం” అని పోలీసు అధికారులు పేర్కొంటూ, మిగిలిన ఖైదీలను తరువాత విడుదల చేస్తామని  హామీ ఇచ్చారు.

అయితే, తక్షణ నిర్బంధం అవసరం లేనప్పుడు ప్రశ్నించడం కోసం CrPC/ సెక్షన్ 35(3) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 41A కింద ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. ఈ వ్యక్తులను ఇరవై నాలుగు గంటలలోపు విడుదల చేయకుండా లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, చట్టబద్ధంగా అనుమతించబడిన కాలానికి మించి నిర్బంధించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా భారత చట్టం ప్రకారం అక్రమ నిర్బంధంలో ఉంచినట్లవుతుంది.  నిర్బంధంలో ఉన్న ఏ వ్యక్తినైనా 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఆదేశించింది; సి‌ఆర్‌పి‌సి/ బి‌ఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 56లోని సెక్షన్ 57లో ఈ అవసరాన్ని చెప్పింది .

అంతేకాకుండా, డికె బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తీర్పును బి‌ఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 48 లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, ఖైదీల ఆచూకీ గురించి సమాచారాన్ని, కలవాడానికి అనుమతిని నిరాకరించినట్లు సంబంధిత కుటుంబాలు తెలిపాయి. కనీసం ఒక బంధువు లేదా స్నేహితుడికి వారి నిర్బంధం లేదా అరెస్టు గురించి తెలియజేయాలని ఈ మైలురాయి తీర్పు నిర్ధారించింది. కుటుంబాన్ని కలిసే అవకాశాన్ని నిరాకరించడం ఈ నిర్బంధాల చట్టవిరుద్ధతను సమ్మిళితం చేయడమే కాకుండా ఖైదీలకు, వారి కుటుంబాలకు మానసిక హానిని కూడా కలిగిస్తుంది.

విషాదకరంగా, ఇద్దరు యువకులు, నిరాయుధులైన గ్రామస్థులు, మరుద్‌బాకకు చెందిన హిద్మా పొడియం (మైనర్, సుమారు 16 సంవత్సరాలు), రేఖపల్లికి చెందిన జోగ కుంజం (సుమారు 20 సంవత్సరాలు) సైనిక చర్య సమయంలో మరణించారు. సమీపంలో దాక్కున్న గ్రామస్తుల ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, ఈ ఇద్దరినీ రి ఇళ్ల నుండి బయటకు లాగి నేరుగా కాల్చి చంపారు. ఈ హత్యల దిగ్భ్రాంతికరమైన ఘటన భద్రతా దళాల చర్యల విపరీత స్వభావాన్ని మరింతగా నొక్కి చెబుతుంది; పౌరులకు వ్యతిరేకంగా ప్రాణాంతక శక్తిని ఉపయోగించడాన్ని నిషేధించే ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి తక్షణ ఆందోళనలను లేవనెత్తుతుంది. ఇంకా, హిడ్మా మైనర్ బాలుడు; జోగా కుంజమ్ ఆరుగురు చిన్న పిల్లలకు తండ్రి, వారికి దిక్కులేకుండా పోయింది.

నిర్బంధించబడిన వ్యక్తులలో కొందరు ఆదివాసీ హక్కులు, పర్యావరణ పరిరక్షణలు, భూమి హక్కుల కోసం వాదిస్తున్న మూల్వాసి బచావో మంచ్‌లోని ప్రసిద్ధ కార్యకర్తలు అని కూడా ప్రత్యేకంగా చెప్పడం అత్యవసరం. చట్టపరమైన విధానాలు లేదా అధికారిక అభియోగాలు లేకుండా వారి నిర్బంధం అసమ్మతి స్వరాలను నిశ్శబ్దం చేయడం, చట్టబద్ధమైన క్రియాశీలతను నేరం చేయడం లక్ష్యంగా రాజ్యం చేబడుతున్న చర్యల ఇబ్బందికరమైన ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఇటువంటి చర్యలు రాజ్యాంగబద్ధంగా సంరక్షించాల్సిన వాక్ స్వాతంత్ర్యం, సహవాసం, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులను దెబ్బతీస్తాయి.

ఈ తీవ్రమైన విధానపరమైన అవకతవకలు, హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా, మేము ఈ క్రింది అత్యవసర డిమాండ్లను గౌరవపూర్వకంగా సమర్పిస్తున్నాము:

చట్టపరమైన సమర్థన లేకుండా నిర్బంధాన్ని కొనసాగించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమవుతుంది కాబట్టి, ఇంకా కస్టడీలో ఉన్న 25 మంది వ్యక్తులను వెంటనే విడుదల చేయాలి

ఖైదీల కుటుంబాలకు వారిని ఎక్కడ వుంచారో  తెలియజేయాలి; చట్టం ప్రకారం, పారదర్శకత, మానవత్వంతో వ్యవహరించే విధంగా అవసరమైన కలిసే హక్కును మంజూరు చేయాలి.

హిద్మా పొడియం, జోగ కుంజమ్‌ల చత్టాతీత హత్యలపై సమగ్రమైన, నిష్పక్షపాత విచారణ; నవంబర్ 7 నుండి 8వ తేదీలలో జరిగిన సామూహిక నిర్బంధాలపై సమగ్ర విచారణ జరపాలి

పియుసిఎల్  v. యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లో సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం విశ్వసనీయతను నిర్ధారించడానికి; న్యాయాన్ని, చట్టాన్ని సమర్థించడానికి ఈ విచారణ తప్పనిసరిగా ఒక స్వతంత్ర అధికారం ద్వారా నిర్వహించాలి .

ఛత్తీస్‌గఢ్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, మీరు చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తారని, భద్రతా దళాల చర్యలు రాజ్యాంగ, చట్టపరమైన పరిమితుల్లో ఉండేలా చూస్తారని మేము ఆశిస్తున్నాము; విశ్వసిస్తున్నాము. న్యాయం, మానవ హక్కుల పట్ల చట్టాన్ని అమలు చేసేవారి నిబద్ధతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ తక్షణ ఆందోళనలపై  తక్షణ దృష్టిసారించాలని  అభ్యర్థిస్తున్నాం.

మీ భవదీయులు, 

నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ (ఎన్‌ఎజెఎఆర్) తరపున :

 1. ఇందిరా ఉన్నినాయర్ (లాయర్, సుప్రీంకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు), 2. ప్రియాషా సిన్హా (న్యాయ విద్యార్థి, తెలంగాణ)

3. భార్గవ్ ఓజా (న్యాయ విద్యార్థి,కార్మిక పరిశోధకుడు, అహ్మదాబాద్) 4. మహ్మద్ కుమైల్ హైదర్ (అడ్వకేట్, అలహాబాద్ లక్నో బెంచ్ సభ్యుడు, ఔద్ బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాది) 5. స్వస్తికా చౌదరి (అడ్వకేట్, కలకత్తా హైకోర్టు), 6. రిషవ్ శర్మ (లీగల్ ప్రాక్టీషనర్, ఢిల్లీ), 7. మందాకిని (న్యాయవాది, హైదరాబాద్) 8. రితేష్ (అడ్వకేట్, ఢిల్లీ)

9. దీప్తాంగ్షు (అడ్వకేట్, కోల్‌కతా), 10. అనుప్రదా సింగ్ (అడ్వకేట్, ఢిల్లీ), 11. వర్తిక మణి (లాయర్, ఢిల్లీ) 12. దియా ఎలిజబెత్ ప్రకాష్ (న్యాయ విద్యార్థి, సోనిపట్) 13. అడ్వ. డా. షాలు నిగమ్ (న్యాయవాది మరియు పరిశోధకుడు, ఢిల్లీ) 14. ప్రతీక్ (లాయర్, ఢిల్లీ NCR) 15. సహానా మంజేష్ (అడ్వకేట్, బాంబే) 16. లక్ష్మి సుజాత (లాయర్, ఢిల్లీ)

17. మీరా సంఘమిత్ర (లా గ్రాడ్యుయేట్, సామాజిక కార్యకర్త, తెలంగాణ) 18. సారా (ప్రొఫెసర్ మరియు లా గ్రాడ్యుయేట్, చెన్నై) 19. అరుంధతీ ధురు (న్యాయ పరిశోధకురాలు, కార్యకర్త, లక్నో) 20. వంశిక మోహతా (లాయర్, ఢిల్లీ) 21. హనన్య సుందర్‌రాజ్ (న్యాయ పరిశోధకురాలు, ఢిల్లీ) 22. కవిన్ కాస్ట్రో (అడ్వకేట్, చెన్నై) 23. ప్రణవ్ ధావన్ (అడ్వకేట్, ఢిల్లీ) 24. దీపేంద్ర (న్యాయ విద్యార్థి, మధ్యప్రదేశ్) 25. అమల (అడ్వకేట్, ఢిల్లీ) 26. సౌమ్య మహేశ్వరి (పరిశోధకురాలు, ఢిల్లీ) 27. ఐశ్వర్య (అడ్వకేట్, చెన్నై) 28. అమేయ (పరిశోధకుడు, బెంగళూరు) 29. సమా (న్యాయ విద్యార్థి, ఛత్తీస్‌గఢ్)

30. ప్రియాంక (అడ్వకేట్, లక్నో) 31. ముహ్మినా (లాయర్, కేరళ) 32. తానియా లస్కర్ (అడ్వకేట్, అస్సాం)          33. సుశ్రావ్య (అడ్వకేట్, బెంగళూరు) 34. శ్రీదేవి (అడ్వకేట్, ముంబై) 35. నిన్ని సుసాన్ థామస్ (అడ్వకేట్, ఢిల్లీ) 36. అర్చిత్ కృష్ణ (అడ్వకేట్, ఢిల్లీ) 37. నవీన్ గౌతమ్ (లాయర్ & ట్రైనర్, న్యూఢిల్లీ) 38. రాధిక చిట్కారా (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా, బెంగళూరు) 39. నికితా అగర్వాల్ (అడ్వకేట్, ఢిల్లీ) 40. రక్షా ఆవాస (అడ్వకేట్, న్యూఢిల్లీ) 41. ఖలీల్-ఉర్-రెహమాన్ (న్యాయ విద్యార్థి, ధార్వాడ్, కర్ణాటక) 42. సార్థక్ తోమర్ (లాయర్, భోపాల్) 43. ఎబో మిలి (అడ్వకేట్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ 

కాపీ టు: 

1.అవసరమైన చర్య కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్య కార్యదర్శి

2.అవసరమైన చర్య కోసం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బస్తర్ రేంజ్

వివరాల కోసం najarjusticeforum@gmail.com కు వ్రాయండి

Leave a Reply