బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్‌లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత బి. అనురాధ ఐదేళ్ళు రాజకీయ ఖైదీగా గడిపి అదే హజారీబాగ్ జైలులో ఖైదీల కష్టాలను తన జైలు కథల్లో చెప్పారు. కాలంతో పాటు అంతా మారుతుంది కానీ బీహార్, జార్ఖండ్ జైళ్లు ఈ మార్పు నియమానికి మినహాయింపులా?
విజయ్ కుమార్ ఆర్య ఒక మావోయిస్టు రాజకీయ ఖైదీ. ప్రస్తుతం పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నాడు.. కేంద్రమావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటి సభ్యుడనే ఆరోపణ మీద ఎన్‌ఐఏ కేసులో అరెస్టయ్యిన అయ్యాడు. బీహార్ జైళ్లలో తనతో పాటు ఇతర ఖైదీలు ఎదుర్కొన్న భయానకమైన హింసను తన లేఖలో వెల్లడించాడు.
ఆ దారుణాలు ఆయన మాటల్లోనే విందాం:
బక్సర్ జైలులో దారుణం
“2024 ఆగస్టు 30న, ఉదయం 7 గంటల ప్రాంతంలో నేను బక్సర్ సెంట్రల్ జైలుకు చేరుకున్నా. నన్ను మొదట కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అసిస్టెంట్ జైలర్ శివసాగర్ ఉన్నాడు. నన్ను చూసిన వెంటనే- నన్ను, నా కుటుంబాన్ని అసభ్యకరంగా దుర్భాషలాడటం ప్రారంభించాడు. నేను ఆశ్చర్యపోయా.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగా. వెంటనే గార్డును పిలిచి ఇద్దరు బీహార్ మిలటరీ పోలీస్ (BMP) కానిస్టేబుళ్లను లాఠీలతో రమ్మని ఆదేశించాడు.
బేయూర్ జైలులో నా ప్రవర్తన గురించి వివరణ అడిగారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పాను. మా నిరాహార దీక్ష శాంతియుతంగా జరిగిందని, సరిగా ఆహారం ఇవ్వకపోవడం వల్లే అది చేశాం వివరించాను. ఆగ్రహించిన జైలర్ ‘వీడికి బుద్ధి చెప్పు’ అని గద్దించాడు.
నన్ను ఆఫీసు మూలకు తీసుకెళ్లారు. ఇద్దరు గార్డులు నా చేతులను పట్టుకోగా మూడవవాడు నా తొడల మీదా,పిరుదుల మీదా వందలాది లాఠీ దెబ్బలు కురిపించాడు. కొట్టడం ఆపాక మళ్ళీ నన్ను జైలర్ ముందుకు లాక్కెళ్లారు.
జైలర్ సంతృప్తి చెందలే.గొణుగుతూ ‘వీడు ఇంకా నిలబడే ఉన్నాడే? మళ్ళీ దంచండి’ అన్నాడు.
నన్ను వంగమని బలవంతం చేసి వంద సార్లకు పైగా కొట్టారు. నేను నొప్పితో కేకలేసినా, చూస్తున్నవారు కానీ దాడి చేసినవారు కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు. గార్డులు అలసిపోయాక, వాళ్లు నన్ను మళ్ళా జైలర్ ముందుకి లాక్కెళ్లారు. జైలర్ వెటకారంగా నవ్వుతూ:
‘ఇంకా నిలబడ్డాడా? వీడు తన గదికి కుంటుకుంటూ వెళ్ళే వరకు కొట్టండి.’
మళ్ళీ మూలకు తీసుకుపోయి ఒక గార్డు లాఠీ నన్ను కొడుతూ ఉండగా మరొకరు నా వీపుపై కూర్చున్నారు. వారు నా కాళ్ళను పైకెత్తి నా పాదాల అరికాళ్ళపై కొట్టడం ప్రారంభించారు. అలసిపోయినా వారు ఆగలేదు.
నిలబడలేనంత బలహీనంగా ఉన్న నన్ను మరోసారి జైలర్ ముందుకు తీసుకెళ్ళారు. అతను ఆదేశించాడు: ‘వీడిని 20 గుంజీలు తీయమని, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పమని ఇంకా మళ్ళీ ఎప్పుడూ నిరాహార దీక్ష చేయనని ప్రమాణం చేయించండి.’ నేను నిరాకరించాను.
ఆగ్రహించిన అతను నేను స్పృహ తప్పేవరకు కొట్టమని గార్డులకు ఆదేశించాడు.
వేరే మార్గం లేక నేను స్పృహ తప్పే వరకు గుంజీలు తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత జైలర్ నన్ను అండా సెల్‌లో పడేయమని ఆదేశించాడు.
గేట్ వద్ద మరో గార్డు నా వీపుపై 15 నుండి 20 సార్లు కొట్టాడు. నాకు 64 సంవత్సరాలు. నేను చతికిలబడి, తడబడుతూ సెల్‌లోకి వెళ్ళాను.”
***
విజయ్ కుమార్ ఆర్య తన 44 సంవత్సరాల రాజకీయ జీవితం లో ఇప్పుడు మూడోసారి జైలులో ఉన్నారు. బీహార్, విశాఖపట్నం, కరీంనగర్ లోని వివిధ జైళ్లలో ఇప్పటికే 14 సంవత్సరాలకు పైగా గడిపారు. ఈ బాధాకరమైన అనుభవం గురించి ఆయన 17 పేజీల లేఖ రాశాడు. ఈ లేఖ చిత్రహింసల చీకటి గదుల నుండి బయటి ప్రపంచానికి చేరడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది.
***
ఏప్రిల్ 2011లో విజయ్ కుమార్ ఆర్య, పూర్ణేందు శేఖర్ ముఖర్జీ (అలియాస్ సాహెబ్ దా), నేను బీహార్ తూర్పు ప్రాంతంలోని కటిహార్ జిల్లాలోని బార్సోయిపోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మారుమూల గ్రామం నుండి మరో నలుగురు కామ్రేడ్‌లతో పాటు అరెస్టు అయ్యాము. 2011 మే డే నాడు మమ్మల్ని కటిహార్ జైలుకు పంపారు. కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని స్పెషల్ సెంట్రల్ జైలు, భాగల్‌పూర్‌కు బదిలీ చేశారు. తరువాత ఆర్య, నేను విశాఖపట్నం, కరీంనగర్ జైళ్లలో కొద్దికాలం పాటు కలిసి ఉన్నాము. దాదాపు ఏడు సంవత్సరాల కారాగారవాసం అనుభవించిన తరువాత అతను చివరకు అక్టోబర్ 2018లో కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యాడు. సరిగ్గా నేను కటిహార్ నుండి విడుదల కావడానికి నాలుగు నెలల ముందు. ఇది విజయ కుమార్ రెండవ అరెస్ట్.
***
కామ్రేడ్ విజయ్ కుమార్ ది ఔరంగాబాద్ జిల్లాలోని కర్మ గ్రామం. నక్సల్‌బరీ, భోజ్‌పూర్ ఉద్యమాలను అణచివేసిన తరువాత 1970ల చివరి వరకు బీహార్‌లో విప్లవాత్మక కార్యకలాపాలు పునరుజ్జీవనం పొందిన ప్రాంతాలలో ఇది ఒకటి. ప్రధాన విప్లవ ప్రవాహాలలో ఒకటైన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ (MCC) సోన్ నదికి దక్షిణాన గయా, ఔరంగాబాద్ కేంద్రంగా తీవ్రమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపింది. ఈ పోరాటం తరువాత కాలంలో దక్షిణ బీహార్ మొత్తాన్ని చుట్టేసింది.
విప్లవోద్యమంలో MCCలో చేరడానికి ముందు విజయ్ కుమార్ 1970ల మధ్యలో జయప్రకాష్ నారాయణ్ “సంపూర్ణ విప్లవం” పిలుపు ఢిల్లీని ఉర్రూతలూగించినప్పుడు విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకుగా ఉన్నారు. యువకుడిగా అతను JP ఉద్యమంలో ముందు పీఠిలో ఉన్నాడు.. మగధ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక, మధ్య బీహార్‌లోని భూస్వామ్య మిలీషియాను ఎదుర్కోతున్న దశలో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ కు దగ్గరయ్యారు. తన తరం వారందరిలాగే అతను JP ఉద్యమం నుండి నక్సల్‌బరీ మార్గంలోకి ప్రవేశించాడు.
1993లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (AIPRF) ఏర్పడినప్పటి నుండి విజయ్ కుమార్ దాంట్లో చురుకుగా పనిచేశారు. పుస్తకాలపై ముఖ్యంగా- చరిత్ర, సాహిత్యంపై అంతులేని మమకారం.విజయ్ కుమార్ సౌమ్యుడు . హిందీలో రాజకీయ వ్యాసాలు పుంఖాను పుంఖాలుగా రాసారు. పాట్నాకు చెందిన “ఫిల్హాల్” పత్రిక ఆయన చాలా రచనలను ప్రచురించింది. ఆయన 2000లో మొదటి సారి అరెస్టయి బీహార్‌లోని వివిధ జైళ్లలో నాలుగు సంవత్సరాలు గడిపారు.
***
బేవుర్ జైలు – అవినీతికి వ్యతిరేకంగా పోరాటం
2022 ఏప్రిల్‌లో రోహ్‌తాస్‌లో మూడోసారి అరెస్టు అయిన తర్వాత విజయ్ కుమార్ పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టులో గయా జిల్లాలో అరెస్టయిన సీపీఐ (మావోయిస్ట్) ఈస్ట్ రీజినల్ బ్యూరో కార్యదర్శి కామ్రేడ్ ప్రమోద్ మిశ్రా కూడా బేవుర్ జైలులోనే ఉన్నారు.
బీహార్‌లో బేవుర్ జైలు అతి పెద్దది. దీనికి 2,360 మంది ఖైదీలకు మాత్రమే అనుమతి ఉంది. అయితే సగటున సుమారు 5,000 మంది ఖైదీలు ఇందులో ఉంటారు. ఇది జైలు సామర్ధ్యం కంటే 250% అధికం.దీనికి అధికారికంగా “ఆదర్శ్ సెంట్రల్ ప్రిజన్” (మోడల్ సెంట్రల్ జైలు) అని పేరు. అయితే ఇందులో ఆధునిక జైలు సంస్కరణల సూత్రాలకు సంబంధించిన ఆనవాళ్లు లేవు.
విదుష్ కుమార్ ఝా – అవినీతి విగ్రహం
2024 జూలైలో విదుష్ కుమార్ ఝా బేవుర్ జైలు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తన అవినీతి, క్రూరత్వానికిపేరు పొందిన ఇతడు తన పెత్తనం నిరంకుశంగా ప్రారంభించాడు.
“సూపరింటెండెంట్ ఖైదీల ఆహార రేషన్లను తగ్గించాడు. జైలు మాన్యువల్ ప్రకారం ఒక్కో ఖైదీకి 250 గ్రాముల బియ్యం లేదా గోధుమ పిండి అందాలి. దీన్ని100 గ్రాములకు తగ్గించాడు. రోజువారీ టిఫిన్ నిలిపివేయబడింది. ప్రతివారం ఇచ్చే ప్రత్యేక భోజనాలు – చికెన్, పనీర్, గుడ్లు రద్దు చేసాడు.
110 వార్డులలో 80 నుంచి 90 వార్డుల వరకు, పలుకుబడి ఉన్న ఖైదీలకు ప్రతి వార్డును 2,00,౦౦౦ రూపాయలకు అమ్మేశాడు. (వీళ్ళు తిరిగి ఖైదీల దగ్గర వార్డ్ లో మంచి స్తానాలను కేటాయించి డబ్బులు వాసులు చేస్తారు.) జైలు క్యాంటీన్‌లలో వస్తువులను ముద్రించిన ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తారు. పాల ఉత్పత్తులపై 5 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు. క్యాంటీన్ నుప్రైవేటు వ్యక్తుల చేతులో పెట్టారు.
ఒకప్పుడు తమకుఇష్టమైన వార్డులలో ప్రవేశానికి నెలకి 500 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ‘డీలక్స్ టాయిలెట్’ కూడా ప్రైవేటీకరించబడింది. స్నానం, టాయిలెట్ ఒక్క సారి ఉపయోగించడానికి ఖైదీలకు10 రూపాయలు లేదా నెలకి 300 రూపాయలు వసూలు చేస్తారు.
వార్డులు ‘కొన్న’ వారు తోటి ఖైదీల నుండి ఒక్కో పడకకు నెలకు 1,000 రూపాయలు,మేలైనఆహారం కోసం అదనంగా 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు వసూలు చేయడం ప్రారంభించారు.
సూపరింటెండెంట్ విదుష్ కుమార్ ఝా భయంకరమైన ‘గోల్‌ఘర్’, ‘కాలా పానీ’ సెల్‌లలో ఉన్న ప్రతి ఖైదీ నుండి 5,000 రూపాయలనుండి 5,00,000రూపాయల వరకు సంపాదించాడు. ఇవ్వగలిగే వర్గాల నుండి అతగాడు డబ్బు సంపాదిస్తాడు. నిరుపేదల పట్ల మాత్రం తిట్లు , దెబ్బలు. ఇంకా అన్ని రకాల అవమానాలకు గురిచేస్తాడు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన నేరస్థులకు, విచారణలో ఉన్న ఖైదీలకూ తేడా లేకుండా విచక్షణరహితమైన శిక్షలు విధిస్తారు. దెబ్బలకు ఖైదీలు నొప్పి, నిరాశలతో ఏద్చేసేవారు.”
ఈ విషయాలన్నీ విజయ్ కుమార్ ఇటీవల పత్రికలకు లీక్ అయిన లేఖలో రాశారు.
నిరాహార దీక్ష –జైలు బదిలీ:
ఈ అవినీతికి నిరసనగా, ఇతర డిమాండ్లను కోరుతూ విజయ్ కుమార్ ఆర్య నాయకత్వంలో ఒక లేఖ తయారు చేశాడు. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కామ్రేడ్ ప్రమోద్ మిశ్రాతో సహా పద్నాలుగు మంది ఖైదీలు సంతకం చేసి దానిని బేవుర్ జైలు సూపరింటెండెంట్‌కు ఇచ్చారు. వారిని కలవడానికీ, వారి డిమాండ్లను చర్చించడానికీ, సూపరింటెండెంట్ నిరాకరించారడు. దాంతో ఖైదీలు 2024 ఆగస్టు 30 నుండి నిరవధిక నిరాహార దీక్షను ప్రకటించారు.
జైలు ఖైదల నుండి వచ్చిన స్పందన అపూర్వం. దారుణమైన పరిస్థితులు, రోజుకు కేవలం 100 గ్రాముల బియ్యంతో పాటు అత్యంత నాసిరకం ఆహారాన్ని అందుతున్న చాలా మంది పేద ఖైదీలకు నిరాహార దీక్షలో చేరడం కష్టమయిన విషయం కాదు. వందలాది మంది ఖైదీలు ఈ నిరసనలో పాల్గొనడానికి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సామూహిక నిరసనను అణచివేయడానికి జైలు పరిపాలన ప్రతీకార చర్యలకు దిగింది. ఆగస్టు 29 రాత్రి విజయ్ కుమార్ ఆర్యను అకస్మాత్తుగా బక్సర్ జైలుకు బదిలీ చేసింది. కామ్రేడ్ ప్రమోద్ మిశ్రాను భాగల్‌పూర్‌లోని స్పెషల్ సెంట్రల్ జైలుకు పంపారు.
అటువంటి బదిలీలు ఎలా జరుగుతాయి?:
విచారణాధీణ ఖైదీలు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. వారి ఏజైలు లో ఉండాలనే విషయం కోర్టు పరిధికి లోబడి ఉంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 299 కింద నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదాభౌతికంగా హాజరుపరిచే హక్కు కోర్టులకు ఉంది. అయితే, ఒక నిబంధన – BNSSలోని సెక్షన్ 300 (గతంలో CrPCలోని సెక్షన్ 268) – నిర్దిష్ట కాలాలకు కోర్టు విచారణలకు హాజరుకాకుండా కొన్ని తరగతుల ఖైదీలను హాజరు చేయనవసరం లేకుండా జైళ్లకు మినహాయింపు ఇస్తుంది.
ఈ నిబంధనను ఉటంకిస్తూ బీహార్ ప్రభుత్వం ‘పరిపాలనా ఉత్తర్వును’ జారీ చేస్తుంది. ఇది విచారణ ఖైదీలను ఏ జైలుకైనా బదిలీ చేయడానికి అధికారం ఇస్తుంది. కోర్టులలో విచారణ ఖైదీలను హాజరు చేయడం నుండి మినహాయింపు తీసుకోవడానికి జైలు అధికారులకు అధికారం ఇస్తుంది. మొదట ఆరు నెలలకు మంజూరు చేసే ఈ ఉత్తర్వులు ఆరు నెలల వ్యవధి తర్వాత క్రమం తప్పకుండా పొడిగించబడతాయి. ఈ ప్రక్రియ నిరవధికంగా కొనసాగవచ్చు. ఫలితం? విచారణ ఖైదీలు వాస్తవానికిడిటెన్యూస్గా( విచారణ లేని ఖైదీలుగా ) మారతారు.
***
భాగల్పూర్ స్పెషల్ సెంట్రల్ జైలు :
2011లో బీహార్‌లో మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు ఈ GO కారణంగా విజయ్ కుమార్, మేమందరం ఏడాదికి పైగా కోర్టు ముఖం చూడలేదు. ప్రభుత్వం బీహార్‌లోని మా కేసులన్నింటినీ ఏకంచేసి జైలు లోపాలే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కోర్టులో మమ్మల్ని విచారించాలని ప్రణాళిక వేసింది. మేము నిరసన తెలిపాము. “ఈ నకిలీ విచారణల తరువాత మమ్మల్ని ఉరితీసినా సరే, మేము వాటిని ఒప్పుకోము.” అని చెప్పాం. ఎందుకోఆ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు.
భాగల్‌పూర్‌లోని స్పెషల్ సెంట్రల్ జైలుకు చేరుకున్న తర్వాత నేను గేటు లోపల గోడపై ఆరు ఫైబర్ లాఠీలు వేలాడుతూ ఉండటాన్ని గమనించాను. అవి దేనికని విజయ్ కుమార్‌ను అడిగాను. అతను గంభీరంగా సమాధానమిస్తూ, ఈ జైలు — ముఖ్యంగా మూడో సెక్టారు — ఎంతో భయంకరమైందని చెప్పాడు. స్థానికంగా ‘క్యాంప్ జైలు’గా పిలువబడే ఈ జైలు, ఖైదీలను అమానవీయ పరిస్థితుల్లో ఉంచే కేంద్రంగా భయంకరమైన పేరు సంపాదించింది.
ఎవరైనా నిరసన తెలిపినా, నిరాహార దీక్ష చేసినా, లేదా ప్రతిఘటించడానికి ధైర్యం చేసినా బీహార్ నలుమూలల ఉండే జైళ్ళ నుండి స్పెషల్ సెంట్రల్ జైలు, భాగల్పూర్కు ముఖ్యంగా, సెక్టార్ 3కు బదిలీ చేస్తారు. ఇతర ఖైదీలకు వారంలో ఏ రోజునైనా సందర్శకులను అనుమతించబడినప్పటికీ ఈ సెక్టార్‌లో బంధించబడిన వారికి సోమవారం మాత్రమే అనుమతిస్తారు. “పరిపాలనా ఉత్తర్వుల” కింద ఉన్న చాలా మంది ఖైదీలు సంవత్సరాల తరబడి బయటి ప్రపంచాన్ని చూడలేదు. ఎందుకంటే, వారిని వాయిదాల కోసం కోర్టుల ముందు హాజరుపరచరు.
ఆ ఖైదీలను ఈ జైలుకి తరలించిన వెంటనే వార్డర్లు క్రూరంగా కొడుతూ స్వాగతం పలికేవారు — ఎదిరించే ధైర్యం ఉన్నవారందరిలోనూ భయాన్ని నింపే ఉద్దేశ్యంతో. భాగల్‌పూర్ స్పెషల్ సెంట్రల్ జైలు లోని అత్యంత కఠిన విభాగం అయిన ‘అండా సెల్’లో ఉన్నప్పుడు మా సహఖైదీలు ఇలాంటి అనేక కథలను వినేవారు.
వైద్య నిర్లక్ష్యం:
2024 ఆగస్టు 30 ఉదయం బక్సర్ జైలులోకి ప్రవేశించిన వెంటనే దారుణమైన దెబ్బలు తిన్న విజయ్ కుమార్ పూర్తిగా వైద్య నిర్లక్ష్యానికి గురయ్యారు — అంటే ఆయనకు చికిత్సే అందకుండా నిరాకరించడం జరిగింది. ఆ సాయంత్రం విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ అతను డాక్టర్ను చూడాలని ఇంకా మందులు కావాలని అడిగాడు. అతనికి చికిత్స నిరాకరించారు. అతను వేడి నీళ్ళను అడిగితేఒక గార్డు దుర్భాషలాడాడు. 24 గంటలకు పైగా అతను నొప్పితో విలవిలలాడాడు. తన వీపుమీద పడుకోలేకపోయాడు. నిటారుగా కూర్చోలేకపోయాడు. టాయిలెట్‌కు వెళ్లడం దుర్భరంగా మారింది.
మరుసటి రోజుమధ్యాహ్నం జైలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం కాదు. కేవలం కుట్లు వేయడానికి మాత్రమే. అతనికి ఒక కూజా, ఒక ప్లేట్ ఇంకా ఒక దుప్పటి ఇచ్చారు కానీ గిన్నె గానీ గ్లాసు గాని ఇవ్వలేదు. ఇది కూడా శిక్షలో భాగమే. కనీస పాత్రల కోసం పదేపదే చేసిన అభ్యర్థనలనుపట్టించుకోలేదు. దీంతో, ప్లాస్టిక్ సీసా కోసుకుని కప్పులా మార్చుకుని ఉపయోగించక తప్పలేదు. ఈ “పాత్రలు” మూడునెలలకే పాడైపోయాయి.
చివరకు అతను సూపరింటెండెంట్‌ను సరైన సెట్ కోసం అడగడానికి వెళ్ళినప్పుడు అధికారి కొంత అయిష్టంగానే అతని కోసం మాత్రమే ఒక గిన్నె, గ్లాసును ఏర్పాటు చేశారు. చాలా మంది ఇతర ఖైదీలు విరిగిన ప్లాస్టిక్ సీసాలతోనే నెట్టుకొచ్చారు. బీహార్‌లోని అనేక జైళ్లలో ఇటువంటి అవమానాలు ఇంకా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యలు ఒక పెద్ద నమూనలో భాగం: ‘ఆడ్మినిస్ట్రేటివ్ ఖైదీలు’ అనేవారిపై జరగుపుతున్న వ్యవస్థీకృత హింస ఇది. వీళ్ళపై ఎన్ని అత్యాచారాలు చేసినా వాళ్ళ గొంతులు బయట ప్రపంచానికి తెలివు. ఇంటర్వ్యూ లు ఉండవు. కోర్టుకు తీసుకు పోరు. జైలు అధికారుల ఈ దారుణాలు నిర్భీతిగా చేయొచ్చు.
హింసకు అత్యంత అసభ్య రీతిలో ముద్దుపేరు –బక్సర్ జైలు ప్రత్యేకం-‘ శ్రీదేవి స్టైల్’ చిత్రహింస:
2024 సెప్టెంబర్ 15న బక్సర్ జైలులోని అండా సెల్‌లో ఉన్న ఖైదీలు ఆహారాన్ని బహిష్కరించిన ఒక సంఘటనను ఆర్య వివరిస్తున్నారు. దీనికి కారణం నాసిరకం ఆహారం ఇంకా చాలా తక్కువ పరిమాణంలో ఆహారం అందించడం. ఈ శాంతియుత నిరసనలో విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. రోజువారీ హాజరు తర్వాత, డిప్యూటీ జైలర్ శివసాగర్ వచ్చారు. ఖైదీలు తమ ఫిర్యాదులను లేవనెత్తారు. జైలర్ ఆందోళన చెందుతున్నట్లు నటించి పరిస్థితిని మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.
కొన్ని రోజులు భోజనం కొద్దిగా మెరుగుపడింది. కానీ ఒక వారం లోపల, నిరసనకు నాయకత్వం వహించిన ముగ్గురు ఖైదీలు – బబ్లూ కుష్వాహా, అత్వాస్, చోటెలాల్ – “గుంటి” (హెడ్ వార్డర్ లేదా డిప్యూటీ జైలర్ పర్యవేక్షించే కేంద్రం) కు పిలిపించారు.దారుణంగా జైలు అధికారులు దాడి చేశారు.
బక్సర్ జైలులో శిక్షా శైలిని వికృతంగా “శ్రీదేవి స్టైల్” అని పిలుస్తారు. ఖైదీని వార్డు బయటికి లాక్కొచ్చి స్తంభానికి ముఖంపెట్టి నిలబడమని బలవంతం చేస్తారు. ఇద్దరు వార్డర్లు కదలకుండా ఉండటానికి అతని చేతులను గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు, మరో ఇద్దరు – సాధారణంగా జైలు సిబ్బంది లేదా బీహార్ మిలిటరీ పోలీసులు (పదవీ విరమణ పొందిన సైనికులతో కూడిన సహాయక దళం) – రెండు వైపుల నుండి కర్రలతో కొట్టడం ప్రారంభిస్తారు. ఇది నాలుగు నుండి ఐదు రౌండ్ల వరకు కొనసాగుతుంది, ఒక్కో రౌండ్‌కు సుమారు 100 దెబ్బలు ఉంటాయి. దెబ్బలు కొనసాగుతుండగా జైలర్లు, కానిస్టేబుళ్లు, జమేదార్లు ( హెడ్ కానిస్టేబుళ్లు ), కొందరు ఖైదీలు, చుట్టూ నిలబడి, అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, అసహ్యకర వ్యాఖ్యలు చేస్తారు — ఆ హింసను చనిపోయిన నటి శ్రీదేవితో లైంగిక సంబందం తో పోలుస్తూ వ్యాఖ్యానిస్తారు.
అసిస్టెంట్ జైలర్ శివసాగర్ ఖైదీతో ఇలా అంటారు, “కొడకా నీవు తన్నులు తినటం లేదురా —శ్రీదేవిని ముద్దాడు తున్నావే అనుకో.”
జైలర్ రాఘవేంద్ర ఇలా అంటారు, “ఇది శిక్ష కాదు – ఇది శ్రీదేవితో ప్రేమాయణం అనుకో.” ఒక కానిస్టేబుల్ నవ్వుతూ, “నిన్ను కొట్టడం లేదు – ఇది శ్రీదేవితో సెక్స్ అనుకో.”
అక్కడున్నవారంతా విరగబడి నవ్వుతారు.ఈలోగా ఖైదీ నొప్పితో అరుస్తూ దయ కోసం వేడుకుంటాడు – కానీ అతని అభ్యర్థనలు పరిహాసంలో కొట్టుకుపోతాయి. నాలుగు లేదా ఐదు రౌండ్‌ల ఈ రాక్షస ‘ప్రేమ’ తర్వాత, రక్తం కారుతూ, శరీరం ముక్కలై, అవమానంతో నిండి ఉన్న బాధితున్ని ఆ స్థితిలో తిరిగి సెల్‌లోకి విసిరేస్తారు.
బబ్లూ, అత్వాస్ ఇంకా చోటెలాల్‌తో సహా డజన్ల కొద్దీ ఖైదీలు ఈ పైశాచిక వేదింపులకు గురయ్యారు. ఇది నిరాటంకంగా కొనసాగుతోంది.
విచిత్రమేమిటంటే బక్సర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జ్ఞానితా గౌరవ్ అనే ఒక మహిళ. కానీ సంస్కరణలను తీసుకురావడంకు బదులుగా ఆమె ఈ చిత్రహింసలను పర్యవేక్షిస్తుంది. ఆమె ఆదేశం ఇచ్చి ‘గుమ్టీ’ని వదిలి వెళ్లి పోతుంది. అసభ్యకర వ్యాఖ్యలను వినకూడదనో, లేదంటే తనకేమీ సంబంధం లేదని నటించే భ్రమని కొనసాగించడానికి కావచ్చు.
“ఆడ్మినిస్ట్రేటివ్ డిటైనీలు” – జైలులో బానిసలు:
బీహార్ జైలు వ్యవస్థలో “ఆడ్మినిస్ట్రేటివ్ ఖైదీల” స్థితి గురించి విజయ్ కుమార్ ఇలా ఆవేదన వ్యక్తం చేశారు:
“ఒక ఆడ్మినిస్ట్రేటివ్ ఖైదీ బీహార్ జైళ్లలో బానిసలా వేధింపులకు గురవుతాడు. వారిని కుటుంబసభ్యులు కలవడానికి వారాల తరబడి అనుమతిని నిరాకరిస్తారు. లేఖలు రాయడం, ఫోన్ కాల్స్ చేయడం కోసమూ సూపరింటెండెంట్ ప్రత్యేక అనుమతి కావాలి — అది ఎక్కువసార్లు తిరస్కరించబడుతుంది. కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌లో హింస గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, అధికారులు ఆడియోని మూసేస్తారు.
చాలా మంది డిటెయినీలు దరఖాస్తులను దాఖలు చేయలేరు – ప్రాథమిక హక్కులు ఏకపక్షంగా నిలిపివేయబడతాయి. అడ్మినిస్ట్రేటివ్ కారణాల ఆధారంగా బదిలీ చేయబడిన తర్వాత, ఖైదీలు తరచుగా నిరవధికంగా ఉన్న జైళ్ళలోనే చిక్కుకుపోతారు, ఎందుకంటే ఎవరూ వారిని ఎక్కడనుంచి వచ్చారో ఆ జైలు వాళ్ళు ‘తిరిగి క్లెయిమ్’ చేయరు. లంచాలు నిత్యం డిమాండ్ చేస్తారు. 2024 మేలో బేవుర్ నుండి బక్సర్‌కు తరలించిన ఒక ఖైదీనీ రెండు జైళ్లు బాధ్యత వహించకపోవడంతో ఎనిమిది నెలలు అయోమయ స్థితిలో ఉన్నాడు. చివరికి, బేవుర్ జైలుకి తిరిగి వెళ్లేందుకు రూ.30,000 లంచం చెల్లించక తప్పలేదు.
కోర్టు ఆదేశాలను కూడా నిర్లక్ష్యంగా ధిక్కరిస్తారు:
“2024 నవంబర్ 2 తిరిగి బదిలీ చేయమని ఆదేశించింది. కానీ బేవుర్ జైలు సూపరింటెండెంట్ నన్ను అంగీకరించడానికి నిరాకరించారు. నేను గంటల తరబడి వేచి ఉన్నాను. అర్ధరాత్రి దాటింది – నన్ను బక్సర్‌కు తిరిగి పంపించారు.
నన్ను బేవుర్ కు తిరిగి రమ్మని మరోసారి 2024 డిసెంబర్ 9న కోర్టు ఆదేశం తీర్మానం చేసింది. ఈసారి న్యాయపరమైన జోక్యంతో జైలు అధికారులు ఆగ్రహించినట్లు కనిపించారు. కేవలం ఐదు రోజుల తర్వాత, నన్ను మళ్లీ బక్సర్‌కు బదిలీ చేశారు.
చట్టం అంటే వీళ్ళకు చెత్త కాగితమే. నేను విచారణ ఖైదీగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా జైలు అధికారి కోర్టు ఆదేశాన్ని ధిక్కరించడం చట్టబద్ధంగా అసాధ్యం. అయినా వారు చేశారు. బీహార్‌లోని జైలు అధికారులు న్యాయవ్యవస్థను గౌరవించినట్లు కూడా నటించరు.”
చీకటిని ఛేదించి బయటికి చేరిన లేఖ:
విజయ్ కుమార్ ఆర్య కష్టపడి రాసి, జైలునియంత్రణలనుదాటుకొని ఈ ఉత్తరం చివరకు హిందీ పత్రికలలో ప్రచురితమైంది. ఈ ఉత్తరం, ప్రపంచం జూన్ 23 నుండి 26 2025 వరకు గ్లోబల్ వీక్ ఎగైనెస్ట్ టార్చర్‌ను (హింసకు వ్యతిరేకంగా ప్రపంచ వారోత్సవంగా) గుర్తించుకుంటున్న సమయంలో వెలుగులోకి వచ్చింది.
వరల్డ్ ఆర్గనైజేషన్ ఎగైనెస్ట్ టార్చర్ (OMCT) ఇంకాSOS-టార్చర్ నెట్‌వర్క్, యునైటెడ్ ఎగైనెస్ట్ టార్చర్ కన్సార్టియం సహకారంతో ఈ సంవత్సరం నిర్వహించిన ఈ కార్యక్రమం రెండు ముఖ్యమైన మైలురాళ్లను గుర్తు చేస్తుంది:జూన్ 26, 1987న అమల్లోకి వచ్చిన UN కన్వెన్షన్ ఎగైనెస్ట్ టార్చర్ (UNCAT) 40వ వార్షికోత్సవం.భారతదేశం ఇంకా ఈ కన్వెన్షన్‌ను ఆమోదించని 19 దేశాలలో ఒకటి.పోలీసు కస్టడీ, జైళ్లలో హింస యధాతథంగా కొనసాగుతూ భారత రాజ్యాంగంలోని జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇచ్చే ఆర్టికల్ 21ని ఘోరంగా అపహాస్యం చేస్తోంది.
బయటిపడిన పోరాటం – అవినీతి అధికారి పతనం:
విజయ్ కుమార్ ఆర్య, తోటి ఖైదీలు చేసిన పోరాటం వృథా పోలేదు. అప్పట్లో బేవుర్ జైలు సూపరింటెండెంట్ అయిన విదుష్ కుమార్ ఝా, ఆ నిరాహార దీక్షను క్రూరంగా అణచివేయగలిగినా, నిజం చివరికి జైలు గోడల లోపలి నుండి బయటపడింది.
బీహార్ పోలీసు ఎకనామిక్ ఆఫెన్సెస్ యూనిట్ (EOU) విచారణ తర్వాత ఝాను 2025 జనవరి 22న సస్పెండ్ చేశారు. అతనిపై ఆస్తుల కేసు (Disproportionate Assets Case) నమోదైంది. నిజానికి, అతను బేవుర్ జైలులో ఖైదీగా ఉండటానికి అర్హుడు. ఈ భయంకరమైన వివరాలను బయటపెట్టిన విజయ్ కుమార్ ఆర్య స్వేచ్ఛా మనిషిగా ఉండాలి. నిజంగా, మనం తలకిందులైన ప్రపంచంలో ఉన్నాం.
విజయ్ కుమార్ ఆర్య ఉత్తరం, భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థ ఎంతఘోరంగా పనిచేస్తోందో తెలిపెందుకు ఒక మంచి నిదర్శనంగా నిలుస్తుంది.
NEEDS REFORMS IN JAILS – BEATING /TORTURING NEEDS TO STOP
TREAT AS A HUMAN BEING —MUST
=========================
BUCHIREDDY GANGULA