సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు