మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
సమకాలీనం

శాంతి చర్చల పూర్వాపరాలు

 (రంగులు మారుతున్న నక్సలిజం – సదస్సుకు స్పందన)      నక్సల్బరీ కాలం నుంచీ కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు
కొత్త కవిత్వం కాలమ్స్

మానవుడే కవితా వస్తువు

ఆధునిక కవిత్వ  రచన దానియొక్క  రూప పరమైన  శిల్ప పరమైన చర్చ  చేసే టప్పుడు రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి.కవి  హఠాత్తుగా ఊడిపడిన సృజన కారుడు కాదు .తన అస్థిత్వం ,భౌగోళిక  స్థితి గతులు  తన అనుభవ౦ . రెండవది తన భావ జాలం. వీటిపై ఆధార పడిన ప్రాపంచిక  దృక్పధ ౦. కవిత్వ౦ మానవుని అంతర్ బహిర్ యుద్ధారావం  అనుకుంటే ,అంతిమంగా మానవుడు ,  మానవుని  అస్థిత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. రాజకీయ భావజాలం వుండట మనేది కవి యొక్క చైతన్యం పై ఆధార పడి వుంటుంది . రాజకీయ పరమైన అంశాలు  కవిత్వంగా  ఎలా మలచ
కథావరణం కాలమ్స్

ఇంకేమీ లేదు, జీవితమే.. నామిని కథ “అకా, కేక కా!”

భర్త చనిపోయిన దశలో పూర్తిగా నిరాశామయ  వాతావరణంలో నుంచి బయటపడి , నూతనోత్సాహంతో జీవితాన్ని పునః ప్రారంభించిన ఒక సాధారణ మనిషిలోని చైతన్యమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక  2015 సెప్టెంబర్ సంచికలో ఈ కథ ప్రచురితమైంది. ఊర్లో అతడి పేరు చిలకాయన. తిరుపతిలో పేరు మునీంద్ర. ఊర్లో వాళ్లతో అతడికి ఎలాంటి అనుబంధం ఉన్నట్లు కనిపించదు. ఇస్త్రీనలగని తెల్ల బట్టలతో నిద్ర లేచి లేవంగానే తయారై తిరుపతి టౌన్ క్లబ్  కి వెళ్ళి పోతాడు. ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒంటి మీద గుడ్డలు నలగకుండా చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ తో తిరిగి ఊర్లోకి వస్తాడు. మడత
సాహిత్యం నా క‌థ‌తో నేను కాలమ్స్

కథతో నేను

పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి. ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి
కవి నడిచిన దారి

నా దారి పూల బాట కాదు

అసలు ఈ నడక ఎక్కడ మొదలైంది.? ఎప్పుడు మొదలైంది..? దారి ఎక్కడ మారింది...? పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను పదోతరగతి వరకు అక్కడే పెరిగాను. స్నేహితులు, బంధువులు అంతా ఆధిపత్య కులాల వాళ్ళే, నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదే వాతావరణంలో ఉంచింది. ఆ వయసులో ఆ ఆధిపత్య ప్రవర్తన తప్పుగా కానీ లేదా అన్యాయంగా ఎప్పుడూ అనిపించలేదు. పదోతరగతి తరవాత మొదటిసారి డిప్లొమా చదవడానికి ఊరు నుండి బయటకు వచ్చాను, అక్కడ కూడా కులం నన్ను కలుపుకుని పోయింది. అక్కడ కూడా నా చుట్టూ అదే మనుషులు చేరారు. నాలో ఉన్న
మీరీ పుస్తకం చదివారా ?

నెత్తుటితో తడుస్తున్న నేల గురించి

‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్‌ జనం హృదయాలనైతే గెలవలేవు’ ‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’ ‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’ ...ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్‌  యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు,
కథా తెలంగాణ కాలమ్స్

*ఊడలమర్రి*లో విధ్వంస మూలాలు

సాహిత్యం ద్వారా సరికొత్త ప్రభావవంతమైన ఆలోచనల్ని పోగుచేసుకోవ‌డం ఇలాంటి  కథల ద్వారనే సాధ్యం అవుతుంది.పాఠకులను ఎదురుగా కూర్చొబెట్టుకుని ఉపాధ్యాయుని మాదిరిగా అద్బుతమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా తీర్పులు, పంచాయతీలు, పరిష్కారాలు పాఠకుడికి అవసరం అనిపించడంలేదు. కథను చదువుతున్న పాఠకుడి మనో అంతరంగంలో ఒక చిన్న అలజడిని, అల్లకల్లోల్లాన్ని సృష్టించినా రచయిత లక్ష్యం నెరవేర్చినట్లుగానే భావించాలి. ఈ దృక్పథంలో పరిశీలించినపుడు పి. చిన్నయ్య గారి కథలు అదే బలమైన ప్రభావాలను పాఠకుడి మనుసుపై తనదైన ముద్రను వేయడంలో 'ఊడలమర్రి' కథలకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రచయిత, పాఠకుడికి ఏ మాత్రం విసుగు కల్పించకుండా
మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
ఆర్ధికం కాలమ్స్

ఉపాధి డమాల్

కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని