నాగరికతా…..అనాగరికతా…
కుటుంబం - సొంత ఆస్తి-రాజ్యాంగయంత్రం-5 ఇంత వరకూ చూసిన ప్రజా సమూహాలలో ఉదాహరణలతో గణ వ్యవస్థ ఏ విధంగా శిధిలమైపోయిందో చూసాం. ఇక ఆఖరున గణ వ్యవస్థను శిధిల పరచిన ఆర్ధిక పరిస్థితులను చూద్దాం. దీనికై మార్క్సు రాసిన ‘పెట్టుబడి' పుస్తకం అవసరం. మోర్గాన్ పుస్తకం లాగే. గణ వ్యవస్థ అటవిక కాలపు నడిమిదశలో పుట్టింది. వున్నత దశలో అభివ్రుద్ధి చెందింది. ఈ దశకు అమెరికను ఇండియన్లను ఉదాహరణకి తీసుకుందాం. వీరిలో గణ వ్యవస్థ పూర్తిగా అభివ్రుద్ధి పొందింది. తెగ ఎన్నో గణాలతో ఏర్పడుతుంది. సాధారణంగా రెండే గణాలు వుంటాయి. జనాభా పెరుగుతున్న










