కొత్త కవిత్వం కాలమ్స్

తూర్పు ముఖం

తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం,   ఎన్.కె.లాల్ బనో గులామి  చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని  ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. క‌ళ్యాణ‌రావు #, కాలం*, కాశీం మానాల‌, గుత్తికొండ వంటి దీర్ఘ‌క‌విత‌లు చ‌రిత్ర‌ను, విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌ను న‌మోదు చేశాయి.    వీరంద‌రూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు  వేశారు.  ఛాయారాజ్  వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు
కవిత్వంలోకి కాలమ్స్

నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి

కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది.  వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు  ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై
లోచూపు కాలమ్స్

బజరా ‘మనువాచకం-స‌మ‌కాలీన అనుభ‌వ‌సారం

నేటి ఆధునిక యుగంలోనూ భారత సామాజిక జీవనం ఇంకా అనాధునికంగానే ఎందుకు ఉన్నది? ప్రగతి సూచికలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడైనా మనకు ఎదురవుతాయి. నిజానికి ప్రగతి సూచికను బట్టి చూస్తే, మన సమాజం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హేతుబుద్ధి మన సమాజానికింకా అపరిచితాలుగానే ఉన్నాయి. మరి మన దేశంలో జరిగిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమాలన్నీ సామాజిక మార్పుకు దోహదపడినవైనప్పటికీ, అవన్నీ మౌలిక సామాజిక మార్పును ఆశించి సాగినవి కావు. అలాగే ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకైనా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ,