ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది. ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి  దాటాల్సిందే. వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా  పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.!  కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా,  ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ
సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
సాహిత్యం సమీక్షలు

మంజీర.. స‌జీవధార

చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్‌ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్‌ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం,
కథలు సాహిత్యం

చంద్రిక‌

చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు.  అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి
కొత్త పుస్తకం సాహిత్యం

ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.

ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం. విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’
సాహిత్యం కవిత్వం ఆడియో

నాకు హెల్త్ కార్డు అవసరంలేదు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
సాహిత్యం కవిత్వం ఆడియో

పిలుపు

సాహిత్యం సంభాషణ

కల‌నేత‌ బతుకులు

అమ్మా నాన్న‌ల త‌ల‌పోత‌ వాటు పడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రభుత్వ ప్రచారాల్లో సర్కారు ప్రాంతంలోని ఓ జిల్లా మాది. సముద్రానికి రెండు గంటల దూరంలో ఉంటుంది.  జనాభా ఐదు వేలకు మించే (2001).పచ్చని పొలాలు గట్ల మీద వంపులు తిరిగిన తాటి కొబ్బరి చెట్లు క్షణం తీరిక లేకుండా టక టక సౌండ్‌ చేసే మగ్గాలు, వసారాల్లో ఉండే ఆసుల్సు రాట్నాలతో ఊరు ఆహ్వానం పలుకుతుంది.గ్రామంలో పెద్ద సంఖ్యలో దేవాంగ, కాపు కులాలు ఉన్నాయి. దేవాంగుల వృత్తి చేనేత. కొద్దిమంది కలంకారీ-అద్దకం పనులు చేస్తారు. కాపులు ఎక్కువ వ్యవసాయం, ఒకటి రెండు కుటుంబాలు తప్ప. గ్రామం మీద
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
సాహిత్యం ఆడియో

సిద్ధంగా ఉండండి