సమీక్షలు

కష్టమైన జర్నీ

ఇటీవల విడుదలైన శ్రీరామ్ పుప్పాల దీర్ఘ కవిత 1818కు రాసిన ముందుమాట ఈ మధ్య కాలంలో అంతా బాగానే ఉంది. 'హక్కులు మనవి, హక్కుల పోరాటం వాళ్ళది' అని వాటాలు వేసుకున్నాక కులాసాగానే గడుస్తోంది. మీకు తెలియంది కాదు. 'వర్తమానం' ఎప్పుడో బహువచనంలోకి మారిపోయింది. ఇప్పుడు అనేక వర్తమానాలు. నచ్చిన, కంఫర్టబుల్ వర్తమానాన్ని ఎంచుకుంటున్నాం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టని 'నైసిటీస్'ని మాట్లాడటం, రాయడం, చదవడం అలవాటు చేసుకున్నాం. నచ్చిన రంగు సన్ గ్లాసెస్ లో వెలుగును చూస్తూ, 'ఎవ్రీధింగ్ లుక్స్ ఫైన్' అని 'ఉబర్ కూల్ పోజ్'ల ఆత్రం లో ఉన్నాం. అంతా బాగానే ఉంది. సౌకర్యంగానే