వాళ్ళు చావును జయించిన వాళ్ళు
జైలు గోడలకు పాటలు నేర్పిన వాళ్ళు
ఇనుప ఊచలకు జానపద సంగీతం నేర్పిన వాళ్ళు
జైలుపై నక్షత్రల దుప్పటి కప్పి
గోడల మధ్య రహస్య సంభాషణ చేసినవాళ్లు
వాళ్ళేక్కడ వున్నా
నీ నా విమిక్తినే కోరుకున్న వాళ్ళు
రెడ్ కారిడార్ ఇండియా అంతా
రూపొందించిన వాళ్ళు
వాళ్లకు చావేంటి
ప్రెమొక్కటే గానం చేసిన
మన కాలం కబీర్లు వాళ్ళు
ఎర్ర జెండా ఎత్తి ఉంచండి
మలయ సమీరమ్లా వచ్చి తాకుతారు
పిడికిలి ఎత్తి పట్టి ఉంచండి
నరనరానా ఉక్కు సంకల్పంతో
ఎత్తి పడతారు
సాయి నిబ్బరంగానే వున్నాడు
చావును నిరాకరించిన వాడు కదా
చూడు చిరు నవ్వుతో తిరిగి వస్తాడు.

10.18పీఎం

Leave a Reply