రోజూ వేసుకునేవే
కానీ ఈరోజు ఎందుకో
చెప్పులు ముద్దొస్తున్నాయి

ఒకటికి రెండు మార్లు
తుడిచి చిన్నగా
మరకాలుంటే తడి గుడ్డతో
మరీ తుడిచి
రోజూ విసురుగా వేసుకునే
వాటిని
నెమ్మదిగా నేలపై
వుంచి వేసుకుని
మెత్తగా మెల్లగా
నడిచాను

విసిరినది
నా చెప్పు కాకపోవచ్చు
కానీ అప్పుడు
వాడి మొఖంలో
వచ్చిన కంగారు చూసి
ఏ చెప్పును చూసిన
ఆ చెప్పులాగే కనిపిస్తోంది

ఆ విసిరిన గుండెకు
ఆలయి బలాయ్
చెప్పాలనుంది
ఆ చేతిని తాకి
ముద్దాడాలని వుంది.

( 19.6.2024 వారణాసి  సంఘటన ప్రేరణగా)

Leave a Reply