వాళ్లు తమ ఊపిరి
వున్నంతవరకు పోరాడుతూ
మరణిస్తూనే వున్నారు
నువ్వింకా ఎంతమందిని
చంపినా చివరాఖరికి
నువ్వు విసిగి పోవాలి
కానీ వారు
పుడుతూనే వుంటారు
నువ్వు వాళ్ళతో
మాటాడే ధైర్యం లేని
పిరికి పందవు కనుక
వాళ్ళు ప్రజల కోసం
యుద్ధ రచన
చేసే మేధావులు
నువ్వు ప్రజలను
దోపిడీ చేసే
చదువు రాని
మొద్దువు
అందుకే నువ్వు
ప్రతిసారి
మాటల సందర్భాన్ని
తప్పించుకుంటున్నావు
ప్రజల ముందు
నీ ముసుగు
తొలగిపోతుందని
నీ బండారం
బయట పడుతుందని
నీకు భయం
అందుకే వాళ్ళని
చంపుతున్నావు
కానీ ఇది వెయ్యేళ్లకు
పైగా సాగుతున్న
యుద్ధం
చరిత్రను మార్చి
రాసే నీకు
చరిత్రను సృష్టించే
వాళ్లంటే భయం కదా?
ఇది ఈ దేశ
నెత్తుటి అధ్యాయం
కావచ్చు
రేపటి విజయం
ప్రజలదే....
(దండకారణ్య మృత వీరులకు)
