దుఃఖమొక్కటే 
దేహమంతా వ్యాపిస్తూ నిలువునా
దహించి వేస్తూంది

తెగిపడ్డ అవయవాల
చుట్టూ ముసురుకున్న ఈగలులా
వాళ్ళు కేరింతలు కొడుతూ

దేహము నుండి వేరుచేయబడ్డ
మెదళ్ళు కోటి ఆలోచనలను
వెదజళ్లుతూ చెట్టు మొదళ్లపై
వేలాడుతూ

మూయని కనురెప్పల
వెనక దాగిన కలలు
అడవి చుట్టూ పచ్చని
కాంతి వలయాన్ని వెలిగిస్తూ

ఒరిగిన వారి వాగ్దానాన్ని
కాల్చి బూడిద చేయాలని
చూస్తే ఎగసిన నిప్పు రవ్వలు
నేలంతా వ్యాపిస్తున్నాయి

ఊర్మిళ మరి పదునాలుగు
మంది యుద్ధంలో మేమే
ముందున్నామని నింగికి నేలకు
మెరుపుల వంతెన కడుతున్నారు

రా నువ్వూ నేనూ
తోడుగా నడుద్దాం
వారి భుజం పై బరువును మార్చుకుందాం!!

Leave a Reply