బిడ్డా
నా జీవితం ఎప్పుడూ
అందమైన పాల రాతి మెట్ల మీదుగా
విలాసంగా సాగింది కాదు

నేనెక్కిన మెట్లలో
ఎన్నో పగుళ్లున్నాయి
అతుకులున్నాయి
అంచులు పగిలి ఉన్నాయి

నేనడిచిన నేలంతా
ఉత్త దిబ్బ నేల
ఎర్ర తివాచిపరిచి
నన్నెవరూ ఆహ్వానించింది లేదు

కానీ
నేను మెట్టెక్కుతూనే ఉన్నాను
అవరోధాలు అధిగమిస్తూనే ఉన్నాను
గమ్యాలు చేరుతూనే ఉన్నాను

ఒక్కొక్కసారి
గాఢాంధకారంలో నడక
చేతిలో దీపముండదు

బిడ్డా
మడమ తిప్పొద్దు
మెట్ల మీద చతికిల పడొద్దు
పగుళ్ళ మధ్యా, అతుకుల మధ్యా
పడిపోయినా
లేచి నిలబడు
అరికాళ్ళు చీలినా
నడక సాగించు

నేను పడిపోయినా
నడుస్తూనే ఉంటాను
మెట్లెక్కుతూనే ఉంటాను

జీవితమెప్పుడు
పూలపాన్పు కాదని గుర్తుంచుకో
సాహసం గానే సాగిపో ..
***

లాంగ్ స్టన్ హాఫ్ "Mother to Son "కు స్వేచ్ఛానువాదం. ఈయన అమెరికా కవి, సాంఘిక కార్యకర్త , నవలాకారుడు ,నాటక రచయిత కాలనీ. Jazz poetry కి ఆద్యుడు.. "హార్లెం పునరుజ్జీవనానికి "నాయకుడు..

ఈ కవితను జూనియర్ మార్ట్ లూథర్ కింగ్ తన ఉపన్యాసాల్లో చాలాసార్లు ఉదహరించేవాడు.

3 thoughts on “బిడ్డడితో తల్లి

Leave a Reply