సాయం సంధ్య వేళ
ఒంటరిగా
ఇంటి పైకప్పు మీద కూర్చుని వినీలాకాశం చేసి ఆశగా చూస్తాను

చల్లని పిల్లగాలి
నా ముఖాన్ని ముద్దాడుతుంది ఒక్కోసారి మృదువుగా, ఒక్కోసారి కవిత్వంగా ..

ఒక్కసారిగా
ఈ ప్రపంచమంతా నాదేనని
ఈ నా ఆకాశం
నా చేతుల్ని
మృదువుగా, దృఢంగా పట్టుకుని నీలి మేఘాల మీద
నడిపిస్తున్నట్టనిపిస్తుంది

కానీ ..ఒక్క ఐదు నిమిషాలు
కలల రెక్కల మీద ఎగురుతానో లేదో
నే పాడిన ఫైరుజ్ పాట
"కెనడాలో ఒక చిన్న ఇల్లు" లోని
వినూత్న ,సుందర జీవితం ఆస్వాదించే లోపల
ఓ భయానక విస్పోటనం...

పాట బద్దలై
రక్తమోడుతది
వినీలాకాశం
బూడిద రంగుతో మసకబారుతది

ఎటువంటి హెచ్చరిక లేకుండానే చివరికి కలలో నైనా సరే
నేను ఎక్కడికి ఎగరాలనుకున్నా ఎంత ఎత్తుకు ఎగరాలనుకున్నా
ఈ "ధ్వని" మాత్రం
నన్ను నీడలా వెంటాడుతుంటది కఠోర వాస్తవంలోనిలబెడుతది

భయమొక్కటే నీ నేస్తమని
చెవిలో గుసగుసలు చెబుతది

ఈ క్షణం
ఒంటరిగా ఉన్నావంటే
అది ప్రశాంతత కాదు
ప్రమాదమని గుర్తుంచుకో ..
***

.
హలా ఆలియా" shattered sirinity " కు స్వేచ్ఛానువాదం

ఈమె GAZA POETSలో సభ్యురాలు. జూలై 27, 19 86 నా జన్మించారు..పాలస్తినా_ అమెరికా రచయిత్రి ,కవయిత్రి సైకాలజిస్ట్ .

హలా ఆలియా రచనలు అస్తిత్వ ఆకాంక్షలు ,విస్థాపన ప్రభావాలు ముఖ్యంగా పాలస్తీనా ప్రజల దుస్థితి ని ప్రతిబింబిస్తాయి

Leave a Reply