ఉద్వేగపు అడుగులు
ఉప్పొంగిన కన్నీళ్లు
ఊరంతా విషాదం
దారిపొడవునా
ప్రతి పల్లె
అమరుడు హనుమంతన్నకి
పూలతో, తమ కన్నీళ్లతో
విప్లవ నినాదాలతో
జేజేలు పలికాయి
పుల్లెంల నిండా
మోదుగుపూలు
విరబూసినట్లుగా
ఎర్రజెండాల రెపరెపలు
ఆ ఎర్రజెండాలతో
ఎర్రబారిన ఆకాశం
ఎగిసిన ఉక్కు పిడికిళ్లు
అమర్ రహే అమర్ రహే
హనుమంతన్న అమర్ రహే
దిక్కులు పిక్కటిల్లేలా
కళాకారుల ఆటలు పాటలు
పోలీసుల పికెటింగ్
పల్లె నిండా రాజ్యం ఆంక్షలు
అయినా
ఉసిల్ల పుట్ట పగిలినట్లుగా
15 వేల మంది తరలొచ్చారు
ఇంతకు
హనుమంతన్న
ఎవరికి ప్రత్యక్షంగా తెలుసు..?
ఎవరికీ తెలవదు.
కానీ అందరి మనసులను
కలియతిరిగాడు
అందరి ఆలోచనల్లో
భాగమయ్యాడు
అందుకే అందరి నోళ్ళలో
హనుమంతన్న నిండిపోయాడు
వాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో.
పల్లెలో ప్రతీ ఇల్లు
దుఃఖపోయడం
ప్రతీ వ్యక్తి కన్నీరు కార్చడం
ఆ కన్నీళ్లలో కామ్రేడ్ల
త్యాగాలకు నివాళులర్పించడం
మొన్న హిడ్మా,
నిన్న హనుమంతన్న
అమరులందరి
అంతిమయాత్రలు
తెలియజేస్తున్నవి ఒక్కటే..
"ప్రజావీరులు మృత్యుంజయులు,
విప్లవం వర్ధిల్లునని"




