దండకారణ్య సమయం

బస్తర్‍లో సైనికీకరణ

దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న  ప్రాంతాలలో బస్తర్  ఒకటి. తరచుగా అక్కడ "తిరుగుబాట్లు",  పోలీసు "ఎన్‌కౌంటర్లు" జరుగుతుంటాయి. గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.  "ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో  ఎవరైనా అందులో భాగం కావచ్చు" అని
దండకారణ్య సమయం

ఏకకాలంలో శాంతి చర్చలు – సైనిక చర్యలు

దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్‌కౌంటర్‌లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను
దండకారణ్య సమయం

ఆదివాసీ బిడ్డల నెత్తురు తాగి త్రేన్చిన మన రిపబ్లిక్!

ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా సరిహద్దులలో, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లా కలాఘర్‌ టైగర్‌ రిజర్వ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఉభయ రాష్టాల భద్రత దళాల సంయుక్త గాలింపు చర్యల్లో భాగంగా జరిగింది. జనవరి 20 తేది ఉదయం ప్రారంభమై 23 వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇందులో గరియాబంద్‌ జిల్లా పోలీస్‌, సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌) అనే ఛత్తీస్‌గఢ్‌ లోని భద్రతా బలగాలతో పాటు ఒడిషా స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ ఎస్‌.ఒ.జి. పాల్గొన్నాయి. ఎస్‌.ఒ.జి. ఒడిషా లో ప్రత్యేకంగా నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో శిక్షణ పొందిన గ్రూప్‌. ఈసారి ఒడిషాలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడి అక్కడ
దండకారణ్య సమయం

బస్తర్‍లో సమాధానం దొరకని ప్రశ్నలు 

నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి  స్వస్థలం  కుమ్మంకి వెళ్లాను. అప్పటికే వారిని ఖననం చేసేసారు. వారు సాధారణ గ్రామస్తులని, మావోయిస్టులు కాదని, తమ పొలాలకు దగ్గరగా ఉన్న పొదల్లో భద్రతా బలగాలు చంపాయని వారి కుటుంబీకులు చెప్పారు. డిసెంబరు 12 నాడు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్న ప్రదేశానికి గ్రామస్థులు నన్ను తీసుకెళ్లారు. ఇది కల్హాజా-దొండెర్‌బెడా అడవుల నుంచి రెండున్నర గంటల నడకదూరంలో ఉంది. మేము ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఊహించని దుర్వాసన వచ్చింది. ముక్కు మూసుకుని దగ్గరకు వెళ్ళేసరికి,
దండకారణ్య సమయం

బీజాపూర్ హత్యాకాండపై డిజిపికి లేఖ

13 నవంబర్ 2024 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్  విషయం: బీజాపూర్ జిల్లాలో చట్టవిరుద్ధమైన నిర్బంధాలు; చట్టాతీత హత్యలు – అన్ని నిర్బంచించిన వారిని వెంటనే  విడుదల చేయాలి; నిష్పాక్షిక విచారణను జరపాలి– సంబంధించి సర్, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ప్రొఫెసర్లు, ఇతర న్యాయ నిపుణుల జాతీయ సమిష్టి సభ్యులుగా, నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ (నజర్) గా పిలువబడే మేము, ఛత్తీస్‌గఢ్,  బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు ఇటీవల, నవంబర్ 8, 2024, చేసిన చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ప్రముఖ కార్యకర్తలతో సహా
దండకారణ్య సమయం

ఛత్తీస్‍ఘడ్‍లో ప్రధాన స్రవంతి మీడియా

ప్రభుత్వం తప్పు చేస్తోంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఏదైనా ఘటన జరిగింది.. ఈ సమాచారాన్నంతటినీ  మీకు చేర్చేదాన్ని మీడియా అని అంటారు. ఈ మీడియానే  మీ మాటలను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ “వార్త”ల వాళ్ళ “వార్త” ను ఇవాళ మీకు అందించాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీరు భావించే మీడియా, మన దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దేశం మొత్తం మీద ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటి, సోషల్ మీడియా మాధ్యమంలో మొత్తం మాధ్యమాలతో పరిస్థితి ఏమిటి అని ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీడియా కార్పొరేట్ గుప్పిట్లో
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
దండకారణ్య సమయం వ్యాసాలు

లైంగిక హింస, అరెస్టులు:  ఆదివాసీ మహిళల పోరాట పటిమ

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై  భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు. సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన  అప్పటికి "మావోయిస్ట్" అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు. మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే