కోల్హాన్ యుద్ధ నివేదిక
జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,