సాహిత్యం వ్యాసాలు

పోడు భూముల స‌మ‌స్య‌కు ఇదీ ప‌రిష్కారం

ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ "షెడ్యూలు - వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు - సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ - పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌
సాహిత్యం వ్యాసాలు

వ‌ర్గ పోరాట ఆచ‌ర‌ణ‌లో సంస్కృతి

(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం - వ‌సంత‌మేఘం  టీం)  మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ
వ్యాసాలు

Operation Kagar: The most savage stage of the brutal war in Dandakaranaya

Dandakaranya, in its decades of revolutionary journey, pioneered several social and cultural experiments that India needs. It has been bearing the brunt of unparalleled violence for four decades. But now, it is in the midst of a ruthless battle for the past three months.  Operation Kagar (The Final Mission), with more than a hundred thousand paramilitary forces supported by drones, helicopters, and satellite surveillance, reminds us of an invasion of
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
వ్యాసాలు

కగార్ ఒక యుద్ధ వ్యూహం

(ఇటీవల ఆపరేషన్ కగార్   మీద  విరసం  ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి యుద్ధమంటే ఆక్రమణ. ఈ ఆక్రమణ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వుండదు. దేశాల మధ్య యుద్ధం. దేశం లోపల యుద్ధం. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా వుంటాయి. దేశ అంతర్గత యుద్ధానికి తన పౌరులనే శత్రువులుగా పరిగణించే రాజ్య స్వభావం వుంటుంది. భారతదేశంలో ఆదివాసీ సమూహం భారత రిపబ్లిక్‌కు శత్రువుయింది. ఎందుకిలా అయింది? ఈ ప్రశ్న మరీ పాతది. అయినా
సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
వ్యాసాలు

రక్షిత అడవుల్లో రక్షణలేని ఆదివాసీలు

గత కొన్ని సంవత్సరాలుగా, ఆదివాసీల ఐక్యత, పోరాటం, నిరంతరం పెరుగుతున్న బలం కారణంగా, వారి ప్రయోజనం కోసం అనేక చట్టాలు రూపొందాయి, ప్రభుత్వాలు కూడా వారికి రక్షణ కల్పించాలని ప్రకటిస్తూ వుంటాయి, కానీ నిజంగా ఈ ప్రయత్నాల ద్వారా ఆదివాసీలకు ఏదైనా మంచి జరిగిందా? పర్యాటకం కోసం పరిరక్షించబడుతున్న అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎంత సురక్షితంగా ఉన్నారు? భారతదేశంలో ఆదివాసీలు/మూల నివాసులకు అడవులతో ఉన్న సంబంధం సహ అస్తిత్వం సూత్రం పై ఆధారపడి ఉంది. చారిత్రాత్మకంగా, అడవులు, అటవీ ప్రాంతాలు ఆదివాసీ తెగల సాంప్రదాయ నివాసంగా ఉండేవి. అయితే, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ కోసం 'రిజర్వు ప్రాంతం' అనే
వ్యాసాలు

కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే "కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు" (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి
వ్యాసాలు

కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ
వ్యాసాలు

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు. ఆయన వారసులు మద్యం తాగి, రాముడిని వేదాంత స్వరూపుడిగానే చూడాలని బూతులు తిడతారు. రాముడి గురించి మేం తప్ప మరెవరూ మాట్లాడటానికి వీల్లేదని దాడి చేస్తారు. లౌకికవాదంపై చర్చకు వాళ్ల అనుమతి తీసుకోలేదని మీదపడి కొడతారు. వరంగల్‌ ‘సమూహ’ అనుభవం ఈ దేశం ఎక్కడున్నదో ఎత్తి చూపుతున్నది. లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఒకరి మాటలు ఒకరు వినాలి కదా. సభ పెట్టుకోవాలి కదా. లౌకికవాదాన్ని చర్చించబోతే రాజ్యాంగంలోని హక్కులన్నిటినీ