రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి
కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ అమర్ రహే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడిన జాతీయ విప్లవకారులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ ఒకరు. ఆయన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలసి జైలులో అమరణ నిరహార దీక్షకు పూనుకొని 63 రోజుల తరువాత అసువులు బాసాడు. అంతర్జాతీయంగా మార్చ్ 18ని రాజకీయ ఖైదీల దినంగా పాటించడం మూడవ ఇంటర్నేషనల్ ప్రకటించిన విషయం విదితమే. ఆ పరంపరను కొనసాగిస్తూనే వారి త్యాగాల సృతిలో ఖైదీల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 13ను పోరాట దినంగా పాటించడం పరిపాటైంది. భారతదేశ విప్లవోద్యమంలో తమ ఆశయాల సాధనకై










